10 March, 2016

తెలుగులో యాత్రా చరిత్రలు Telugulo Yatra charitralu

మచ్చ హరిదాసు గారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో Ph.D. పట్టం కొరకు సమర్పించిన సిద్ధాంత గ్రంథమే తెలుగులో యాత్రా చరిత్రలు. ఇందులో తెలుగులో వెలువడిన యాత్రా చరిత్రలు చక్కగా సేకరించి,వివరించారు. మంచి సమాచారం ఉంది.

06 March, 2016

ఆంధ్రానంద రామాయణం Andhra Ananda Ramayanam

గుండు లక్ష్మణ శాస్త్రి గారిచే వ్రాయబడిన ఈ ఆనంద రామాయణము తెలుగు వారికి మరుగున పడినట్లైనది.ఇదొక అపురూప కావ్యం. సంస్కృతంలోని ఆనందరామాయణానికి ఇది అనువాదమో కాదో తెలీదు. కానీ, రసనిర్భరము. చదివి ఆనందించండి.

03 March, 2016

ఆంధ్ర వాచస్పత్యము Andhra Vachaspathyamu

ఆంధ్ర వాచస్పత్యము
కొట్ర శ్యామల కామ శాస్త్రి 
Andhra Vachaspathyamu
Kotra Shyamala Kama Shastry

కొట్ర శ్యామల కామశాస్త్రిగారు రచించిన బృహత్తర నిఘంటువు ఆంధ్ర వాచస్పత్యము. దానిని సమగ్రంగా అందించే భాగ్యం తెలుగు పరిశోధన వారికి కలిగింది. దీనికొరకు పాఠకులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. దిగుమతి చేసుకుని, ఆనందించండి.

29 February, 2016

వానమామలై రచనలు Vanamamalai Rachanalu

డా. వానమామలై వరదాచార్యులు  గారు రచించిన పుస్తకాలు అంతర్జాలంలో లభిస్తున్నవాటిని సేకరించి మీ ముందుకి తెస్తుంది తెలుగుపరిశోధన. ఆనందించంచండి.





10 February, 2016

ప్రథమాంధ్ర మహా పురాణము Prathama Andhra Maha Puranamu

జి.వి.సుబ్రహ్మణ్యం గారి
ప్రథమాంధ్ర మహా పురాణము 
Prathama Andhra Maha Puranamu
By
G.V.Subrahmanyam


తెలుగులో వెలువడిన మొట్టమొదటి పురాణం మారన రాసిన మార్కండేయ పురాణం. దానిని పరిశోధించే నెపంతో సుబ్రహ్మణ్యంగారు తెలుగులో పురాణాల పుట్టు పూర్వోత్తరాలను చక్కగా పరామర్శించారు. తెలుగు సాహితీ పిపాసకులకు చక్కని పరామర్శ గ్రంథమిది.  ఇది ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి Ph.D. పట్టం పొందిన సిద్ధాంత గ్రంథం.

07 February, 2016

శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం ( మందరము) Mandaramu Vavikolanu Subba Rao

వావికొలను సుబ్బారావుగారు రచించిన మందరము తెలుగువారికి నిజంగా రామాయణ విషయ విశేష మందారమే. దీనికి వారు శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం అనే పేరు పెట్టినా మందరము గానే ప్రసిద్ధమిది. శ్రీ భక్తి సంజీవని వారు అందించే ప్రయత్నం చేసారు. సాయి రియల్ ఆటిట్యూడ్ వారు కూడా ఆ ప్రయత్నమే చేసారు. ఇప్పటికీ ఇంకా మనం దిగుమతి చేసుకోకుంటే ఎలా? చదువకుంటే ఎలా?


06 February, 2016

పోతన చరిత్రము(వానమామలై వరదాచార్యులు) Potana Charitramu (Vanamamalai Varada acharyulu)

వానమామలై వరదాచార్యులు గారు రచించిన పోతన చరిత్రము అనే అద్భుత గ్రంథాన్ని మీకు అందించే భాగ్యాన్ని తెలుగు పరిశోధన పొందింది.


31 January, 2016

తెలుగు సాహిత్య కోశము Telugu Sahitya Koshamu


నల్లపాటి శివనారయ్యగారు సంపాదించిన (ప్రాచీన) తెలుగు సాహిత్య కోశము మీకు అందిస్తున్నాము.

అనుసరించువారు