గతంలో తెలుగు పరిశోధన కంకంటి పాపరాజు రచించిన ఉత్తరరామాయణాన్ని ప్రకటించింది. ఇక ఇప్పుడు అతని మరొక కృతి విష్ణుమాయావిలాసము ను కూడా ప్రకటించి, కవి ఋణాన్ని, భాషా సాహిత్య ఋణాన్ని తీర్చుకునే ప్రయత్నం చేస్తుంది మీ తెలుగు పరిశోధన.
సుప్రసిద్ధ పండితులు వేదం వేంకటరాయ శాస్త్రి గారి రచనలను డిజిటల్ లైబ్రరి ఆఫ్ ఇండియా లో లభిస్తున్న వానిని మీ ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నది తెలుగుపరిశోధన. పుస్తకాలను దిగుమతి చేసుకొని, చదివి ఆనందించండి.
దాశరథి రంగాచార్యుల రచనలను అంతర్జాలంలో లభించిన వాటిని ఒక్కదగ్గర చేర్చి, మీ ముందుకు తెస్తుంది తెలుగు పరిశోధన. ఆయా పుస్తకాలను దిగుమతి చేసుకొని, చదివి ఆనందించండి.
చర్ల గణపతి శాస్త్రిగారి రచనలన్నింటినీ ఒకే దగ్గర మనకోసం సమకూర్చి పెట్టారు చర్ల మృదుల గారు వారి ప్రత్యేకమైన charla.in అనే వెబ్ సైట్ ద్వారా. దాదాపు తొంబదికి పైగా ఉన్నవారి గ్రంథాలను దిగుమతి చేసుకుని తరించండి.