31 May, 2013

బాల ప్రౌఢ వ్యాకరణ విశ్లేషణాత్మక అధ్యయనం Analytical Study Of Bala & Praudha Vyakaranas

బాల ప్రౌఢ వ్యాకరణ విశ్లేషణాత్మక అధ్యయనం
Analytical Study Of Bala & Praudha Vyakaranas 
ఆచార్య హరి శివ కుమార్  Prof. Hari Shiva Kumar

బాల ప్రౌఢ వ్యాకరణాల విషయాంశాలను అధ్యయనం చేయాల్సిన పద్ధతిని, సులువుగా అర్థమయ్యేట్టు హరిశివ కుమార్ గారు చక్కగా నిరూపించారు. ఈ పుస్తకం వ్యాకరణాధ్యేతలకు ఉపయోగకరం.

30 May, 2013

బాలవ్యాకరణ సూక్తులు 3 Bala Vyakarana Suktulu

బాలవ్యాకరణ సూక్తులు 3
 Bala Vyakarana Suktulu 3
డా. అంబడిపూడి నాగభూషణం Dr. Ambadipudi Naga Bhushanam

ప్రముఖ వ్యాకరణాచార్యులు డా. అంబడిపూడి నాగభూషణంగారు బాలవ్యాకరణానికి ఉన్న రెండు ప్రముఖ వ్యాఖ్యానాలైన ఉద్ద్యోతం, సంజీవనీ లలోని విషయాలను పరామర్శిస్తూ వ్రాసిన గ్రంథమిది. ఇది మూడు భాగాలుగా వెలువడగా ప్రస్తుతం మన తెలుగుపరిశోధనలో ప్రథమ,తృతీయ భాగాలు మాత్రమే లభిస్తున్నాయి.

29 May, 2013

బాలవ్యాకరణ సూక్తులు 1 Bala Vyakarana Suktulu

బాలవ్యాకరణ సూక్తులు 1 
Bala Vyakarana Suktulu 1
డా. అంబడిపూడి నాగభూషణం Dr.Ambadipudi Nagabhushanam



ప్రముఖ వ్యాకరణాచార్యులు డా. అంబడిపూడి నాగభూషణంగారు బాలవ్యాకరణానికి ఉన్న రెండు ప్రముఖ వ్యాఖ్యానాలైన ఉద్ద్యోతం, సంజీవనీ లలోని విషయాలను పరామర్శిస్తూ వ్రాసిన గ్రంథమిది. ఇది మూడు భాగాలుగా వెలువడగా ప్రస్తుతం మన తెలుగుపరిశోధనలో ప్రథమ,తృతీయ భాగాలు మాత్రమే లభిస్తున్నాయి.

28 May, 2013

ప్రౌఢ వ్యాకరణ దిగ్దర్శిని Praudha vyakarana Dig darshini

ప్రౌఢ వ్యాకరణ దిగ్దర్శిని
              Praudha vyakarana Dig darshini
     డా. అంబడిపూడి నాగభూషణం Dr. Ambadipudi Nagabhushanam

తెలుగులో వ్యాకరణంలో చిన్నయ సూరి రచించిన బాల వ్యాకరణం ప్రసిద్ధం. దాని తర్వాత వారి శిష్యులు బహుజనవల్లి సీతా రామా చార్యులవారు రచించిన ప్రౌఢవ్యాకరణం ప్రసిద్ధం. బాల వ్యాకరణం లో చెప్పగా విడిచిన విషయాలను చెప్పడానికి, అందులో చెప్పిన విషయాల సవరణకూ తాను ఆ గ్రంథం ప్రారంభించానని చెబుతారు ఆచార్యుల వారు.

ఈ వ్యాకరణ గ్రంథం పేరుకు తగినట్లుగా ప్రౌఢం. సులువుగా అర్థమయ్యేది కాదు. అటువంటి ఈ గ్రంథానికి ప్రసిద్ధ వ్యాకరణ పండితులు బాలవ్యాకరణ సూక్తులు గ్రంథ రచయిత డా. అంబడిపూడి నాగభూషణం గారు దిగ్దర్శిని వ్యాఖ్యతో విద్యార్థులకు ఉపకారం చేసారు. ఇందులో ప్రతిసూత్ర వ్యాఖ్య లేకున్నా, అవసరమైన అన్ని సూత్రాలనూ వ్యాఖ్యానించారు.

27 May, 2013

శ్రీ సూర్య రాయాంధ్ర నిఘంటువు Shree Surya Raya Andhra Nighantuvu

శ్రీ సూర్య రాయాంధ్ర నిఘంటువు Shree Surya Raya Andhra Nighantuvu
Rao Venkata Kumara Maheepati SuryaRao

(ఇప్పుడు అన్ని సంపుటాలూ లభిస్తున్నాయి)





ఇంతవరకు  దాదాపు పదిహేను నిఘంటువులను తెలుగుపరిశోధన అందించింది. ఇక ఇప్పుడు శ్రీ సూర్య రాయాంధ్ర నిఘంటువు.
తెలుగులో వెలువడిన నిఘంటువుల్లో పెద్దది ... ఈ నిఘంటువు. ప్రతి పదానికి వివిధ గ్రంథాల ప్రమాణాలతో అర్థ నిరూపణ చేసారు. ఇది సమగ్రం అని మనం చెప్పలేకున్నా ఎంతో పెద్దది. దీనికి పూరకంగా కావచ్చు శ్రీహరి నిఘంటువు వెలువడింది. ఏమయితేనేం ఈ నిఘంటువును అందించడం ద్వారా తెలుగుపరిశోధన కొంత జాతి ఋణం తీర్చుకుంటున్నది. 

వరుసగా ఇక్కడ కింద ఆయా భాగాలను ఇస్తున్నాము. పుస్తకంపేరుపై నొక్కగానే దిగుమతి పుటకు తీసుకువెళుతుంది.
ఈ టపాను మీ సాంఘిక సంపర్క జాలంలో తప్పక పేర్కొనండి

 👉శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు 👈 

☝️అన్ని భాగాలు ఒకే దగ్గర 


ఇంకేం, ఈ పుస్తకాన్ని దిగుమతి చేసుకోండి. మీ మొబైల్ ఫోన్ లో, మీ ట్యాబ్లెట్ పి.సి.లో ....వేసుకోండి. అంత పెద్ద నిఘంటువును మీ వెంటే ఉంటుందెప్పుడూ....

Please Read:-

            Rao Venkata Kumara Maheepati SuryaRao


26 May, 2013

శ్రీమదాంధ్ర మహా భాగవతము (సమగ్రం) Shree Mad Andhra Maha Bhagavatham (Complete)


శ్రీమదాంధ్ర మహా భాగవతము (సమగ్రం)
Shree Mad Andhra Maha Bhagavatham (Complete)
బమ్మెర పోతన Bammera Pothana
Bammera Pothana

గతంలో ఆం.ప్ర. సాహిత్య పరిషత్ ప్రచురించిన భాగవతం అందించాము. అది సమగ్రంగా లేదనీ, మొత్తం భాగవతం కావాలనీ మిత్రులు కొందరు అడిగారు. ఇప్పుడు  సమగ్రంగా ఆమూలాగ్రంగా ,ద్వాదశ స్కంధ పర్యంతం అందిస్తున్నాము. చదివి ఆనందించండి.

25 May, 2013

ఆంధ్ర ప్రబంధము- అవతరణ వికాసములు Andhra Prabandham-Avatarana Vikasamulu

ఆంధ్ర ప్రబంధము- అవతరణ వికాసములు
Andhra Prabandham-Avatarana Vikasamulu
కాకర్ల వేంకట రామ నరసింహం .Kakarla Ramanarasimham
 
Kakarla Ven kata Rama Narasimham



ఆంధ్రా విశ్వవిద్యాలయం నుండి వెలువడిన మొట్టమొదటి పరిశోధనా గ్రంథమిది. అప్పట్లో రామ నరసింహంగారిని "డాక్టరుగారూ" అని అభిమానంగా పిలిచేవారట.
ప్రబంధం అనేది తెలుగువారి సొత్తు.ఈ ప్రక్రియ ప్రారంభించడం వల్లనే రాయలు పెద్దన్నను ఆంధ్ర కవితా పితామహా అన్నారు. సంస్కృత శ్రవ్యకావ్య,దృశ్యకావ్య లక్షణాలను రెంటినీ ఒక్కదగ్గర చేర్చిన ప్రక్రియ ప్రబంధం. అటువంటి ప్రబంధం యొక్క పుట్టుక, పెరుగుదల మొదలైన సకల విషయాలూ ఇందులో చదివి తెలుసుకోవచ్చు.

24 May, 2013

జానపద సాహిత్యంలో అలంకార విధానం Janapada Sahityamlo Alankara vidhanam

జానపద సాహిత్యంలో అలంకార విధానం  
Janapada Sahityamlo Alankara vidhanam
డా. ఋక్నుద్దీన్  Dr.Ruknuddeen


ఉస్మానియా విశ్వవిద్యాలయంనుండి పిహెచ్.డి పట్టం పొందిన సిద్ధాంతవ్యాసం.

అనుసరించువారు