ఇటీవల నవీకరించిన టపాలు
08 ఏప్రిల్, 2021
ప్రౌఢ వ్యాకరణము - బహుజనవల్లి సీతారామాచార్యులు Praudha Vyakaranamu - Bahujanavalli Sitaramacharyulu
24 మార్చి, 2021
తారాతోరణం - కవితా సంపుటి డా. దేవగుప్తాపు సూర్యగణపతి రావు Taratoranam
శ్రీ సూర్యగణపతి రావుగారు రసజ్ఞభారతి వ్యవస్ధాపక సభ్యులలో ఒకరు.
చి.సూర్యగణపతిరావు తూ.గో.జిల్లా పెద్దాపురంతాలూకాలో కాట్రావులపల్లి అనే చిన్న గ్రామంలో జననం.హైస్కూల్ చదువు, మెడిసిన్ కాకినాడలో తర్వాత ఛండీఘర్ లో.
ప్రస్తుతం రేడియాలిజిష్టు గా విశాఖపట్నం లో ఉద్యోగ బాధ్యతలు
వృత్తి రీత్యా డాక్టరైనా ప్రవృత్తి సాహిత్య వేత్త
రవి చూడనివి చూడ గల కవి
భగవదనుగ్రహం పరిపూర్ణంగా కలవాడు
ఆత్మ లోకంలో విహరించి కవిత్వాన్ని ఆ పర దేవతను దర్శించడానికి ఉపాధిగా తీసికొన్న వాడు
సాహిత్య చర్చలు..సాహితీ వ్యాసాలు ఇతనికి అత్యంత ప్రీతి పాత్రం
ఎన్నో రచనలు అలవోకగా చేసాడు..చేస్తున్నాడు
కొన్ని రచనలు
త్రివేణి
అలమేల్మంగ శతకము.
శివశతకము
శారదాంబశతకము
దివ్య లోచనశతకములు
రవిశతకము
చందమామశతకము
మకుటంలేని మహారాజులు
బులుసు వేంకటేశ్వర్లు గారి మాటల్లో...
అంబ నవా0బుజో జ్జ్వలకృపానన
యై రస చంద్ర చంద్రికా
డంబరమూర్తి.ఔచు ప్రకటస్పుట
భూషణ రత్న రమ్య భాక్
చుంబితవాగ్విశేషముల చూరల నీయ
కవిత్వతత్వ భా
వా0బర వీధి విశ్రుత విహారి గణేశకవిన్
నుతించెదన్!!
శ్రీ దేవగుప్తాపు సూర్య గణపతికవి గారు 1961 లో
జన్మించారు. వీరి జనని ,శ్రీమతి విజయ
లక్షమ్మ గారు, జనకులు. కీ.శే. కూటంరాజు గారు .
వీరి అన్నగారు ప్రసిద్దవైద్యులు శ్రీ కృష్ణప్రసాద్ గారు.
తల్లిదండ్రుల శిక్షణ,గురువుల దయతో అన్నదమ్ములు
ఇరువురు సాహిత్య ప్రియులుగా, చదువులో అగ్రేసరులుగా నిలిచి వంశము పేరు నిల్పినారు.
ప్రస్తుత మన కథానాయకులు వినాయక
చతుర్థి పర్వదినమున విజయలక్ష్మీ గర్భ శక్తి ముక్తాయ
మానంగా జనించిన కారణంగా సూర్య గణపతు లైనారు. ఆదేవుని వలెనే విద్యల కెల్ల నొజ్జ యైనారు.
వీరి సాహిత్యగురువులు శ్రీ బేతవోలు రామభ్రహ్మంగారు, కూర్చుమిత్రులు శ్రీ గరికపాటి వారు.
సహజ వినయ భాగ్యం కల శ్రీ గణపతి గారు విశాఖ పట్టణమున ప్రముఖ"రేడియోలజిస్ట్"గా వైద్యవృత్తి
లో పేరు పొందారు .పరోపకార0 వారి వ్యక్తిత్వం లో
ఒకగొప్ప ఆభరణం
వీరి రచనలు
దివ్యలోచనాలు:-సూర్యచంద్రులు పరాత్పరుని
రెండుకన్నులు. సుమారు 100 పద్యాలు పైగా సూర్యుని
పై శతకం వ్రాయగా ,అమ్మగారి ఆదేశం తలదాల్చి చందమామ మకుటంతో పద్యాలు వ్రాసారు. అన్నిపద్యాలు కొత్తవూహలతో సులభావగాహనగా
ఉంటాయి. శ్రీ బేతవోలు,గరికపాటి వంటి మహామహుల ప్రశంసలు పొందినరచ ఇది.
త్రిశతి:- శివ,శారదా,,అలిమలుమంగ దైవతములను
ఉద్దేశించిన 3 శతకాలు
మకుటం లేని మహారాజులు :-
పద్యంలో మకుటం లేకుండా శతకరీతిలో
సాగిన చమత్కారపద్యాలు
అద్దిర బన్న శతకం :- అద్దిరబన్న అను మకుటంతో
చమత్కారంగా సాగేపద్యాల శతకం ఇది.
దశావతార బంధ}
ప్రబంధం[:- బంధ కవిత్వం అందరు కవులకు అందే
ద్రాక్ష కాదు. దానికి ప్రత్యేకమైన .... అభినవేశం,సూక్ష్మబుద్ధి
అవసరం. మన డాక్టర్గారు "దశావతార బంధ ప్రబంధం"
అనుపేరున పుస్తకం ప్రచురించి తనసత్తా చాటుకున్నారు.
మనరసజ్ఞ భారతి లో పా0డురంగ మహాత్మ్యంపై
వారి ధారావాహిక వ్యాఖ్యానం చదువుతూ నేవున్నాం
వారి"పాత పద్య0---,కొత్తకోణం""వ్యాసాలు సాహిత్యం లో వారి విమర్శనా పటుత్వాన్ని తెలుపుతున్నాయి
బహుముఖ ప్రజ్నా శాలి ,సహృదయులు అయిన
శ్రీ డి ఎస్ గణపతి గారిని గురించి నేను వ్రాసిన ఈనాలుగు మాటలు కొండను అద్దంలో చూపించిన
ప్రయత్నం గా భావించ గలరని సభ్యుల్ని కోరుకుంటున్నాను
గణపతి కవిగారు శతాయువై ఆంధ్ర సాహిత్యానికి
అమూల్య ఆభరణాలను కైసేయాలని ఆశీర్వదిస్తున్నాను.!!( బులుసు)
దిగుమతి కొరకు నొక్కండి👇
11 జనవరి, 2021
వ్యావహారిక ఆంధ్ర మహాభారతం - పూరిపండా అప్పలస్వామి Vyavaharika Andhra Mahabharatham -Puripanda Appala Swamy
28 డిసెంబర్, 2020
అక్షరాల అడుగుజాడల్లో పంచ సహస్రావధాని Aksharala Adugujadallo Pancha Sahasra Avadhani
23 డిసెంబర్, 2020
యువభారతి ప్రచురణలు - Yuvabharathi Publications
Updated on 24-09-2024
18 డిసెంబర్, 2020
ఆదిభట్ల నారాయణ దాసు రచనలు - Adibhatla Narayana Dasu Rachanalu
25 అక్టోబర్, 2020
వెన్న ముద్దలు - డా. సూర్య గణపతి రావు గారు - Vennamuddalu - Dr. Surya Ganapati Rao
వెన్న ముద్దలు - డా. సూర్య గణపతి రావు గారు
Vennamuddalu - Dr. Surya Ganapati Rao
డాక్టర్ దేవగుప్తాపు సూర్య గణపతి రావుగారు వృత్తిపరంగా వైద్యులు. కానీ, గొప్ప గొప్ప కవుల సరసన చేరదగిన చేయితిరిగిన కవి. అంతేకాకుండా గొప్పనైన సాహిత్య విమర్శకుడు. వారు రాసిన పాండురంగ మహత్యం యొక్క వ్యాఖ్య మీకు తెలుగు పరిశోధనలో అందుబాటులోనే ఉంది. కొమ్ములు తిరిగిన పండితులు కూడా తడబడేటువంటి ప్రౌఢ పదబంధాన్ని వ్యాఖ్యానించిన వారి నేర్పరితనం బహుధా ప్రశంసనీయం. అంతేకాదు, అన్నమయ్య కీర్తనలకు వారు చెప్పిన భాష్యం ఒక కొత్త అందాన్ని తెచ్చింది. దీనివల్ల వారికి తెనుగు పదాలతో ఉన్నటువంటి గాఢమైన పరిచయం మనం అర్థం చేసుకోవచ్చు.
18 అక్టోబర్, 2020
ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రచురణలు Andhra saraswata parishat publications
ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రచురణలు
- ఆంధ్ర వాఙ్మయ చరిత్రము - దివాకర్ల వేంకటావధాని
- సాహిత్య సోపానములు - దివాకర్ల వేంకటావధాని
- వికాస లహరి - దివాకర్ల వేంకటావధాని సంకలనం
- ఇతిహాస లహరి - దివాకర్ల వేంకటావధాని సంకలనం
- ప్రతిభా లహరి
- జగద్గురు సాహితీ లహరి
- ఆలోచనా లహరి
- చైతన్య లహరి
- దశరూపక సందర్శనము
- అయ్యలరాజు కవితా వైభవం
- తులసీదాసు కవితా వికాసము
- ధూర్జటి కవితా వికాసము
- కాళిదాసు కవితా వైభవము
- తెలుగు కవిత - లయాత్మకత
- జీవనగీత - సినారె
- వీచికలు
- భావన
- అనుభూతి
- వ్యాస సూక్తం
- విజయానికి అభయం
- వాగ్భూషణం భూషణం - ఇరివెంటి కృష్ణమూర్తి
- తెలంగాణలో తెలుగు సాహిత్య వికాసం
- తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర - ముదిగంటి సుజాతా రెడ్డి
- తెలంగాణ చరిత్ర
- తెలుగు భాషా సాహిత్య వైశిష్ట్యం - వ్యాస సంకలనం
- తెలుగు సాహితి - దేవులపల్లి రామానుజరావు
- తెలుగు పత్రికలు - ప్రసారమాధ్యమాల భాషా స్వరూపం
- ఆధునిక తెలుగు సాహిత్యంలో విభిన్న ధోరణులు
- తెలుగు పీఠిక - డి. చంద్ర శేఖర్ రెడ్డి
- ఆధునిక తెలుగు సాహిత్యంలో హాస్యం
- తెలుగు సాహిత్యం మరో చూపు
- సాహిత్యానువాదం సమాలోచనం
- తెలుగు వాగ్గేయకారులు - అన్నమయ్య విలక్షణ వ్యక్తిత్వం
- తెలుగు జానపద సాహిత్యము - స్త్రీల గేయాలలో సంప్రదాయము
- ఆంధ్ర మహాభారతోపన్యాసములు
- ఆంధ్రమహాభాగవత ఉపన్యాసములు
- శేషాద్రి రమణ కవుల పరిశోధన వ్యాసమంజరి
- తెలుగులో పద కవిత
- తెలుగు నాటక సాహిత్యం
- మా ఊరు మాట్లాడింది - డా. సినారె
- సమీక్షణం - డా. సినారె
- సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు
- దేవులపల్లి రామానుజరావు గ్రంధావళి
- దేవులపల్లి రామానుజరావు
- గద్య సంగ్రహం
- పద్య కుసుమావళి
- వ్యాస గుళుచ్ఛం - మొదటి భాగం
- వ్యాస గుళుచ్ఛం - రెండవ భాగం
- శివరాత్రి మాహాత్మ్యము - శ్రీనాథుడు
- తెలంగాణ గిరిజన భాషా సాహిత్యాలు
- కదనం లోను కథనంలోనూ మేమే
- పరిణతవాణి - 1
- పరిణతవాణి - 2
- పరిణతవాణి - 3
- పరిణతవాణి - 4
- పరిణతవాణి - 5
- పరిణతవాణి - 6
- పరిణతవాణి - 7
- స్వర్ణోత్సవ సంచిక
- వజ్రోత్సవ సంచిక
- ఆంధ్ర సారస్వత పరిషత్తు చరిత్ర 1943-93





