శ్రీరామ నవరాత్రోత్సవ కల్పః
ఈ పుస్తకాన్ని శ్రీరామచంద్రమూర్తి స్వయంగా రామక రామశర్మ గారికి ఇచ్చారని ప్రతీతి. రామశర్మ గారు 108 మారులు రామాయణ పారాయణం ఉత్సవాలసహితంగా చేసారు.ఆ సమయంలో శ్రీరామ జన్మోత్సవం, సీతా జన్మోత్సవం, సీతా కల్యాణం, పట్టభిషేకం మొ. ఉత్సవాలన్నీ చేసారు. 108 సార్లు చేసిన తర్వాత మహా సామ్రాజ్య పట్టాభిషేకం, శ్రీరామ తారక మహా పురశ్చరణ హవనం చేసారు. అటువంటి మహనీయునికి శ్రీరాముడు అనుగ్రహించిన కల్పాన్ని మనం పొందగల్గడం మన భాగ్యం.
ఇందులో రామాయణాన్ని తొమ్మిది రోజుల్లో పారాయణం చేసే పద్ధతి, దశావరణార్చన, శ్రీ సీతా రామ కల్యాణం,శ్రీరామ జన్మోత్సవం, సీతా జన్మోత్సవం మొదలైన ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఈ పుస్తకాన్ని దిగుమతి చేసుకుని, రాబోయే శ్రీరామ నవరాత్రుల్లో రామోపాసన చేసి చరితార్థులగుదురు గాక.
మీరిక్కడే చదువుకోవాలంటే..........
Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....
పైనొక్కండి
0 వ్యాఖ్యలు:
Post a Comment