03 August, 2025

రామాయణ రహస్యాల సమీక్ష వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి Ramayana Rahasyala Sameeksha

వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహాభారత తత్వకథనము గ్రంథాన్ని గతంలో అందించాం. 
ఇప్పుడు వారి మరో గ్రంథం రామాయణంపై కలుగే సందేహాలను శాస్త్రీయ పద్ధతిలో తీర్చే రామాయణ రహస్యాల సమీక్ష గ్రంథాన్ని అందిస్తున్నాం, ఆనందించండి. 

దిగుమతి చేసుకోవాలంటే -

👉 రామాయణ రహస్యాల సమీక్ష  👈

 పుస్తకాలను ఎలా దిగుమతి చేసుకోవాలంటే పైన 'సహాయం' ట్యాబ్ పై నొక్కండి ఈ టపాపై మీ వ్యాఖ్య తప్పక రాస్తారు కదూ? మీ వ్యాఖ్యలే మాకు మంచి ప్రోత్సాహకాలు. ఈ టపాను మీ సాంఘికసంపర్కజాలంలో పంచుకొండి. ఇంకొందరికీ ఈ టపా ఉపయోగ పడుతుంది, మీరూ వారికి మేలు చేసినవారవుతారు. మీ రా పని చేస్తారనే నమ్మకంతో ముందుగానే ధన్యవాదాలు.

26 July, 2025

సాహిత్య పదకోశము Dictionary of Literary Terminalogy

సాహిత్యం దృశ్య కావ్యం, శ్రావ్య కావ్యం అంటూ రెండు విధాలు. వీటికి సంబంధించిన సాహిత్య శాస్త్ర/ అలంకార శాస్త్ర సంబంధిత పారిభాషిక పదాలను అన్నింటినీ సేకరించి అకారాది క్రమంలో మనకు అందించారు తెలుగు అకాడమీవారు. ఇటువంటి అపురూపమైన శాస్త్ర గ్రంథాలు ఈమధ్య కాలంలో రావడం లేదు. ఈ గ్రంథం ప్రస్తుతం మార్కెట్లో దొరికే అవకాశం లేదు. ఈ గ్రంథం సాహిత్య శాస్త్ర అధ్యయనం చేసే విద్యార్థులకు, ఆచార్యులకు, పోటీ పరీక్షల అభ్యర్థులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. 
దీన్ని దిగుమతి చేసుకొని భద్రపరచుకోవాలి. 

దిగుమతి చేసుకోవాలంటే - 

సాహిత్య పదకోశము 

పుస్తకాలను ఎలా దిగుమతి చేసుకోవాలంటే పైన 'సహాయం' ట్యాబ్ పై నొక్కండి ఈ టపాపై మీ వ్యాఖ్య తప్పక రాస్తారు కదూ? మీ వ్యాఖ్యలే మాకు మంచి ప్రోత్సాహకాలు. ఈ టపాను మీ సాంఘికసంపర్కజాలంలో పంచుకొండి. ఇంకొందరికీ ఈ టపా ఉపయోగ పడుతుంది, మీరూ వారికి మేలు చేసినవారవుతారు. మీ రా పని చేస్తారనే నమ్మకంతో ముందుగానే ధన్యవాదాలు.

17 July, 2025

ఆంధ్ర ప్రశస్తి (వివిధ కవుల కవితా సంకలనం) Andhra Prashasti (Collections of Telugu Poetry of various poets)

ఈ కింది తెలుగు పద్యం చూడండి.
 
వేదముల్ సంస్కృత వాదముల్ చేసిన  తెలుఁగువాఁడే చేయవలయు ననఁగ
సంస్కృతచ్ఛందస్సు చక్కఁగా సాగింప తెలుఁగులోనే సాగవలయు ననఁగ
ఋతువులవద్దతి ఋజువుగా నుండఁగా నొకతెల్గునాటనే యుండు ననఁగ
నిఖిలసస్యములు పండింపఁగా దగినట్టి ధాత్రిలక్షణ మిందె తనరు ననఁగ

సర్వవేదాంతములకును జన్మభూమి
తూచిమనుజుఁడు తాల్చు దుస్తులకుఁ దగిన
దనుప్రమాణమ్ము చూపించి నట్టి నేల
తెలుఁగుధాత్రికి ధాత్రిలో దీటుఁగలదె?

ఈ పద్యం విశ్వనాథ సత్యనారాయణ గారిది. 
వివిధ కవులు వివిధ సందర్భాలలో తెలుగు జాతి, భాష, సంస్కృతులకు సంబంధించిన  వ్రాసిన ఇటువంటి కవితలను సేకరించి ఆంధ్ర ప్రశస్తి పేరుతో ఒక గ్రంథంగా ప్రచురించారు తెలుగు విశ్వవిద్యాలయం వారు. 
 
 ఆ అపురూపమైన పుస్తకం మీ కోసం......

👉  ఆంధ్ర ప్రశస్తి Andhra Prashasti 👈 

పుస్తకాలను ఎలా దిగుమతి చేసుకోవాలంటే పైన 'సహాయం' ట్యాబ్ పై నొక్కండి ఈ టపాపై మీ వ్యాఖ్య తప్పక రాస్తారు కదూ? మీ వ్యాఖ్యలే మాకు మంచి ప్రోత్సాహకాలు. ఈ టపాను మీ సాంఘికసంపర్కజాలంలో పంచుకొండి. ఇంకొందరికీ ఈ టపా ఉపయోగ పడుతుంది, మీరూ వారికి మేలు చేసినవారవుతారు. మీ రా పని చేస్తారనే నమ్మకంతో ముందుగానే ధన్యవాదాలు.

11 July, 2025

సంపూర్ణ నీతి చంద్రిక Sampoorna Neethi Chandrika

సంస్కృతంలో విష్ణుశర్మ రచించిన 👉 పంచతంత్రంలో - 👈
  1. మిత్ర భేదం 
  2. మిత్ర లాభం 
  3. విగ్రహం 
  4. లబ్ధ ప్రకాశం
  5. అపరీక్షిత కారకం     
   అనబడే అయిదు తంత్రాలు ఉన్నాయి. ఆ గ్రంథాన్ని గతంలో అందించాం. 

ఆ గ్రంథానికి తెలుగులో అనువాదమే నీతి చంద్రిక. ఈ నీతి చంద్రికలోని మొదటి రెండు తంత్రాలను చిన్నయసూరి తాను రాసిన బాల వ్యాకరణం గ్రంథానికి లక్ష్య గ్రంథంగా రచించారు. ఆ తర్వాతి మూడు తంత్రాలను కందుకూరి వీరేశలింగం పంతులు విగ్రహం, సంధి (లబ్ధ ప్రకాశం, అపరీక్షిత కారకం) రచించారు. 
ఆ సంపూర్ణ నీతి చంద్రికను కింద 👇అందిస్తున్నాం. చదివి ఆనందించండి.  

👉నీతి చంద్రిక 👈

  పుస్తకాలను ఎలా దిగుమతి చేసుకోవాలంటే పైన 'సహాయం' ట్యాబ్ పై నొక్కండి ఈ టపాపై మీ వ్యాఖ్య తప్పక రాస్తారు కదూ? మీ వ్యాఖ్యలే మాకు మంచి ప్రోత్సాహకాలు. ఈ టపాను మీ సాంఘికసంపర్కజాలంలో పంచుకొండి. ఇంకొందరికీ ఈ టపా ఉపయోగ పడుతుంది, మీరూ వారికి మేలు చేసినవారవుతారు. మీ రా పని చేస్తారనే నమ్మకంతో ముందుగానే ధన్యవాదాలు.

08 July, 2025

బాల ప్రౌఢ వ్యాకరణ సర్వస్వం - స్ఫూర్తిశ్రీ Bala Proudha Vyakarana Sarvaswam - SphoortiSree

స్ఫూర్తిశ్రీ భాస్కరరావు గారు వ్రాసిన బాల ప్రౌఢ వ్యాకరణ సర్వస్వం రెండు భాగాలు ఇక్కడ మీకు అందిస్తున్నాం 

 బాల ప్రౌఢ వ్యాకరణ సర్వస్వం 

  పుస్తకాలను ఎలా దిగుమతి చేసుకోవాలంటే పైన 'సహాయం' ట్యాబ్ పై నొక్కండి ఈ టపాపై మీ వ్యాఖ్య తప్పక రాస్తారు కదూ? మీ వ్యాఖ్యలే మాకు మంచి ప్రోత్సాహకాలు. ఈ టపాను మీ సాంఘికసంపర్కజాలంలో పంచుకొండి. ఇంకొందరికీ ఈ టపా ఉపయోగ పడుతుంది, మీరూ వారికి మేలు చేసినవారవుతారు. మీ రా పని చేస్తారనే నమ్మకంతో ముందుగానే ధన్యవాదాలు.

కువలయానందం Kuvalayanandam

సంస్కృతాంధ్ర విద్యార్థులు అలంకారాలు జయదేవ 'చంద్రాలోకం' సంస్కృత గ్రంధం ఆధారంగా నేర్చుకొంటూ ఉంటారు. చంద్రాలోకం గ్రంధానికి 
"ఆంధ్రత్వ మాంధ్రభాషా చ నాల్పస్య తపసః ఫలమ్
అంటూ నినదించిన మన తెలుగువాడు అప్పయ్య దీక్షితులు గారు వ్రాసిన వ్యాఖ్య ఈ కువలయానందం.
ఆ గ్రంథానికి రెండు తెలుగు అనువాదాలు వెలువడినాయి. వాటితో పాటు సంస్కృత వ్యాఖ్యతో కూడిన ఒక ప్రాచీన గ్రంథం కూడా లభించింది. 
వాటిని అన్నింటినీ కలిపి ఒకే దగ్గర అందిస్తున్నాం, చూడండి.

కువలయానందము

ఈ అలంకారాలకు లక్ష్య గ్రంథాన్ని కూడా చూడండి

పుస్తకాలను ఎలా దిగుమతి చేసుకోవాలంటే పైన 'సహాయం' ట్యాబ్ పై నొక్కండి ఈ టపాపై మీ వ్యాఖ్య తప్పక రాస్తారు కదూ? మీ వ్యాఖ్యలే మాకు మంచి ప్రోత్సాహకాలు. ఈ టపాను మీ సాంఘికసంపర్కజాలంలో పంచుకొండి. ఇంకొందరికీ ఈ టపా ఉపయోగ పడుతుంది, మీరూ వారికి మేలు చేసినవారవుతారు. మీ రా పని చేస్తారనే నమ్మకంతో ముందుగానే ధన్యవాదాలు.

07 July, 2025

తాపీ ధర్మారావు గారి రచనలు Books of Tapi Dharma Rao

ప్రసిద్ధ తెలుగు పండితులు తాపీ ధర్మారావు గారి రచనలు అంతర్జాలంలో లభించినంత వరకు ఇక్కడ అందిస్తున్నాం.

పుస్తకాలను ఎలా దిగుమతి చేసుకోవాలంటే పైన 'సహాయం' ట్యాబ్ పై నొక్కండి ఈ టపాపై మీ వ్యాఖ్య తప్పక రాస్తారు కదూ? మీ వ్యాఖ్యలే మాకు మంచి ప్రోత్సాహకాలు. ఈ టపాను మీ సాంఘికసంపర్కజాలంలో పంచుకొండి. ఇంకొందరికీ ఈ టపా ఉపయోగ పడుతుంది, మీరూ వారికి మేలు చేసినవారవుతారు. మీ రా పని చేస్తారనే నమ్మకంతో ముందుగానే ధన్యవాదాలు.

16 June, 2025

కాళిదాస గ్రంథాలు Writings of Kalidasa

మహాకవి కాళిదాసు రచించిన రఘువంశం రెండు భాగాలుగా (1-10 సర్గలు)(11-19సర్గలు) గతంలో అందించాం. ఇప్పుడు ఇక మిగిలిన కావ్య నాటకాలను ఇప్పుడు అందిస్తున్నాం. అవి వరుసగా -

 పుస్తకాలను ఎలా దిగుమతి చేసుకోవాలంటే పైన 'సహాయం' ట్యాబ్ పై నొక్కండి ఈ టపాపై మీ వ్యాఖ్య తప్పక రాస్తారు కదూ? మీ వ్యాఖ్యలే మాకు మంచి ప్రోత్సాహకాలు. ఈ టపాను మీ సాంఘికసంపర్కజాలంలో పంచుకొండి. ఇంకొందరికీ ఈ టపా ఉపయోగ పడుతుంది, మీరూ వారికి మేలు చేసినవారవుతారు. మీ రా పని చేస్తారనే నమ్మకంతో ముందుగానే ధన్యవాదాలు. 

14 June, 2025

పూర్వ గాథా లహరి Poorva Gadha Lahari

పూర్వగాథాలహరి నందు ఎన్నో పురణాలు,చరిత్రలు, ఉపనిషత్తులు పాత్రల వ్యైశిష్ఠ్యాన్ని తెలియజేశారు. ఇందులో అకారాదిగా పురాణ పాత్రల సంక్షిప్త పరిచయం ఉంటుంది. భాష పాత తెలుగులో ఉంటుంది. కానీ చాలా మటుకు సులువగా అర్థమవుతుంది. ఆయా పాత్రల గురించిన పరిచయం, పురాణం పేరు కూడా ఇవ్వబడుతుంది. 

గతంలో మన తెలుగు పరిశోధనలో  పురాణ నామ చంద్రిక మరియు పురాణ నామ సంగ్రహము ఒకే టపాలో మీ ముందుకు తెచ్చాం. ఇప్పుడు ఈ పూర్వగాథాలహరి అందుకోండి. 

పూర్వగాథాలహరి

పుస్తకాలను ఎలా దిగుమతి చేసుకోవాలంటే పైన 'సహాయం' ట్యాబ్ పై నొక్కండి ఈ టపాపై మీ వ్యాఖ్య తప్పక రాస్తారు కదూ? మీ వ్యాఖ్యలే మాకు మంచి ప్రోత్సాహకాలు. ఈ టపాను మీ సాంఘికసంపర్కజాలంలో పంచుకొండి. ఇంకొందరికీ ఈ టపా ఉపయోగ పడుతుంది, మీరూ వారికి మేలు చేసినవారవుతారు. మీ రా పని చేస్తారనే నమ్మకంతో ముందుగానే ధన్యవాదాలు.

08 April, 2021

ప్రౌఢ వ్యాకరణము - బహుజనవల్లి సీతారామాచార్యులు Praudha Vyakaranamu - Bahujanavalli Sitaramacharyulu

బహుజనవల్లి సీతారామాచార్యులుగారు వ్రాసిన ప్రౌఢవ్యాకరణం గూర్చి కొత్తగా తెలుపాసిన అవసరం లేదు. బాలవ్యాకరణమందు ప్రస్తావించబడని లేదా అభిప్రాయ భేదాలున్న విషయపూరకంగా వ్రాయబడినది ప్రౌఢవ్యాకరణం. 

24 March, 2021

తారాతోరణం - కవితా సంపుటి డా. దేవగుప్తాపు సూర్యగణపతి రావు Taratoranam

శ్రీ సూర్యగణపతి రావుగారు రసజ్ఞభారతి వ్యవస్ధాపక సభ్యులలో ఒకరు.

చి.సూర్యగణపతిరావు  తూ.గో.జిల్లా పెద్దాపురంతాలూకాలో కాట్రావులపల్లి అనే చిన్న గ్రామంలో జననం.హైస్కూల్ చదువు, మెడిసిన్ కాకినాడలో తర్వాత  ఛండీఘర్ లో.

ప్రస్తుతం రేడియాలిజిష్టు గా విశాఖపట్నం లో ఉద్యోగ బాధ్యతలు

వృత్తి రీత్యా డాక్టరైనా ప్రవృత్తి సాహిత్య వేత్త

రవి చూడనివి చూడ గల కవి

భగవదనుగ్రహం పరిపూర్ణంగా కలవాడు

ఆత్మ లోకంలో విహరించి కవిత్వాన్ని ఆ పర దేవతను దర్శించడానికి ఉపాధిగా తీసికొన్న వాడు

సాహిత్య చర్చలు..సాహితీ వ్యాసాలు ఇతనికి అత్యంత ప్రీతి పాత్రం

ఎన్నో రచనలు అలవోకగా చేసాడు..చేస్తున్నాడు

కొన్ని రచనలు

త్రివేణి

అలమేల్మంగ శతకము.

శివశతకము

శారదాంబశతకము

దివ్య లోచనశతకములు

రవిశతకము

చందమామశతకము

మకుటంలేని మహారాజులు 

బులుసు వేంకటేశ్వర్లు గారి మాటల్లో...

 అంబ నవా0బుజో జ్జ్వలకృపానన

                యై రస చంద్ర చంద్రికా

డంబరమూర్తి.ఔచు ప్రకటస్పుట

                భూషణ రత్న రమ్య భాక్

చుంబితవాగ్విశేషముల  చూరల నీయ

                    కవిత్వతత్వ భా

 వా0బర వీధి విశ్రుత విహారి గణేశకవిన్ 

                                 నుతించెదన్!!

శ్రీ దేవగుప్తాపు సూర్య గణపతికవి గారు 1961 లో

 జన్మించారు. వీరి జనని  ,శ్రీమతి విజయ

లక్షమ్మ గారు,  జనకులు. కీ.శే.  కూటంరాజు గారు .

 వీరి అన్నగారు ప్రసిద్దవైద్యులు శ్రీ కృష్ణప్రసాద్ గారు.

 తల్లిదండ్రుల శిక్షణ,గురువుల దయతో  అన్నదమ్ములు

ఇరువురు సాహిత్య ప్రియులుగా, చదువులో అగ్రేసరులుగా  నిలిచి వంశము పేరు నిల్పినారు.

                ప్రస్తుత మన కథానాయకులు  వినాయక 

చతుర్థి పర్వదినమున విజయలక్ష్మీ గర్భ శక్తి ముక్తాయ

మానంగా జనించిన కారణంగా సూర్య గణపతు లైనారు. ఆదేవుని వలెనే విద్యల కెల్ల  నొజ్జ యైనారు.

      వీరి సాహిత్యగురువులు శ్రీ బేతవోలు రామభ్రహ్మంగారు, కూర్చుమిత్రులు శ్రీ గరికపాటి వారు.

సహజ వినయ భాగ్యం కల శ్రీ గణపతి గారు విశాఖ పట్టణమున  ప్రముఖ"రేడియోలజిస్ట్"గా వైద్యవృత్తి

లో పేరు పొందారు .పరోపకార0 వారి వ్యక్తిత్వం లో 

ఒకగొప్ప ఆభరణం 

      వీరి రచనలు

దివ్యలోచనాలు:-సూర్యచంద్రులు పరాత్పరుని 

రెండుకన్నులు. సుమారు 100 పద్యాలు పైగా సూర్యుని

పై శతకం వ్రాయగా ,అమ్మగారి ఆదేశం తలదాల్చి చందమామ మకుటంతో   పద్యాలు వ్రాసారు. అన్నిపద్యాలు కొత్తవూహలతో సులభావగాహనగా

ఉంటాయి. శ్రీ బేతవోలు,గరికపాటి వంటి మహామహుల ప్రశంసలు పొందినరచ ఇది.

 త్రిశతి:- శివ,శారదా,,అలిమలుమంగ దైవతములను

          ఉద్దేశించిన 3 శతకాలు

మకుటం లేని మహారాజులు :-

                 పద్యంలో మకుటం లేకుండా శతకరీతిలో

   సాగిన చమత్కారపద్యాలు

 అద్దిర బన్న శతకం :- అద్దిరబన్న అను మకుటంతో

    చమత్కారంగా సాగేపద్యాల శతకం ఇది.

దశావతార బంధ}

ప్రబంధం[:-  బంధ కవిత్వం అందరు కవులకు అందే 

 ద్రాక్ష కాదు. దానికి ప్రత్యేకమైన .... అభినవేశం,సూక్ష్మబుద్ధి

 అవసరం.  మన డాక్టర్గారు "దశావతార బంధ ప్రబంధం"

 అనుపేరున  పుస్తకం ప్రచురించి తనసత్తా చాటుకున్నారు.

       మనరసజ్ఞ భారతి లో పా0డురంగ మహాత్మ్యంపై 

  వారి ధారావాహిక వ్యాఖ్యానం చదువుతూ నేవున్నాం

  వారి"పాత పద్య0---,కొత్తకోణం""వ్యాసాలు సాహిత్యం లో వారి విమర్శనా పటుత్వాన్ని తెలుపుతున్నాయి 

         బహుముఖ ప్రజ్నా శాలి ,సహృదయులు అయిన 

శ్రీ డి ఎస్ గణపతి గారిని గురించి నేను వ్రాసిన ఈనాలుగు మాటలు  కొండను అద్దంలో చూపించిన

ప్రయత్నం గా భావించ గలరని సభ్యుల్ని కోరుకుంటున్నాను

          గణపతి కవిగారు శతాయువై ఆంధ్ర సాహిత్యానికి

 అమూల్య ఆభరణాలను కైసేయాలని ఆశీర్వదిస్తున్నాను.!!( బులుసు)

దిగుమతి కొరకు నొక్కండి👇

11 January, 2021

వ్యావహారిక ఆంధ్ర మహాభారతం - పూరిపండా అప్పలస్వామి Vyavaharika Andhra Mahabharatham -Puripanda Appala Swamy

పూరిపండా అప్పల స్వామి

తెలుగువారికి భారతమంటే ప్రీతి అంతా ఇంతా కాదు. అందుకే కాబోలు నన్నయ భారతంతోనే తెలుగులో గ్రంథరచనకు శ్రీకారం చుట్టాడు నన్నయ. వెయ్యేళ్ళ తర్వాతకూడా ఈనాటికి కూడా తెలుగువారు భారతం అంటే చెవి కోసుకుంటారు. 

28 December, 2020

అక్షరాల అడుగుజాడల్లో పంచ సహస్రావధాని Aksharala Adugujadallo Pancha Sahasra Avadhani

గత శతాబ్దికి చెందిన జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ప్రధమ పంచ సహస్రావధాని. ..విద్వత్కవులైన వీరు తిరుపతి వెంకట కవుల శిష్యులు. నాడు విద్వద్గద్వాల గా పేరుగాంచిన గద్వాల సంస్ధానం లో పరీక్షాధికారి.అవధానాలు చేస్తూ కావ్య రచన కూడా కొనసాగించారు. 32 రచనలలో ముఖ్యంగా సాలంకార కృష్ణ దేవరాయలు ఆంధ్రసామ్రాజ్యము వచన రహితమైన కావ్యాలు. ప్రముఖ సాహితి విమర్శకుడు శ్రీ నియోగి వారి మౌహిక సాహిత్యాన్ని నిశితంగా పరిశీలించి చేసిన రచన 'అక్షరాల అడుగుజాడల్లో పంచ సహస్రావధాని. '

23 December, 2020

యువభారతి ప్రచురణలు - Yuvabharathi Publications

Updated on 24-09-2024

  అర్ధశతాబ్దానికి పైగా తెలుగు సాహిత్యానికి సేవ చేస్తున్న సంస్థ యువభారతి. ఈ సమయంలో ఈ సంస్థనుండి ఎన్నో విలువైన పుస్తకాలు ఎలువడ్డాయి. అవన్నీ ప్రస్తుతం మార్కెట్టులో లభిస్తూ లేవు. కొన్ని అంతర్జాలంలో లభిస్తున్నవాటిని మీకు అందించే ప్రయత్నం చేస్తున్నది మీ తెలుగుపరిశోధన

18 December, 2020

ఆదిభట్ల నారాయణ దాసు రచనలు - Adibhatla Narayana Dasu Rachanalu

ఆదిభట్ల నారాయణ దాసు

25 October, 2020

వెన్న ముద్దలు - డా. సూర్య గణపతి రావు గారు - Vennamuddalu - Dr. Surya Ganapati Rao

వెన్న ముద్దలు - డా. సూర్య గణపతి రావు గారు  

 Vennamuddalu - Dr. Surya Ganapati Rao

డాక్టర్ దేవగుప్తాపు సూర్య గణపతి రావుగారు వృత్తిపరంగా వైద్యులు. కానీ, గొప్ప గొప్ప కవుల సరసన చేరదగిన చేయితిరిగిన కవి. అంతేకాకుండా గొప్పనైన సాహిత్య విమర్శకుడు. వారు రాసిన పాండురంగ మహత్యం యొక్క వ్యాఖ్య మీకు తెలుగు పరిశోధనలో అందుబాటులోనే ఉంది. కొమ్ములు తిరిగిన పండితులు కూడా తడబడేటువంటి ప్రౌఢ పదబంధాన్ని వ్యాఖ్యానించిన వారి నేర్పరితనం బహుధా ప్రశంసనీయం. అంతేకాదు, అన్నమయ్య కీర్తనలకు వారు చెప్పిన భాష్యం ఒక కొత్త అందాన్ని తెచ్చింది. దీనివల్ల వారికి తెనుగు పదాలతో ఉన్నటువంటి గాఢమైన పరిచయం మనం అర్థం చేసుకోవచ్చు.

18 October, 2020

ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రచురణలు Andhra saraswata parishat publications

ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రచురణలు 

Updated on 27 - 08 - 2022

  1.  ఆంధ్ర వాఙ్మయ చరిత్రము - దివాకర్ల వేంకటావధాని
  2. సాహిత్య సోపానములు - దివాకర్ల వేంకటావధాని
  3. వికాస లహరి - దివాకర్ల వేంకటావధాని సంకలనం
  4. ఇతిహాస లహరి - దివాకర్ల వేంకటావధాని సంకలనం
  5. ప్రతిభా లహరి 
  6. జగద్గురు సాహితీ లహరి
  7. ఆలోచనా లహరి
  8. చైతన్య లహరి
  9. దశరూపక సందర్శనము
  10. అయ్యలరాజు కవితా వైభవం
  11. తులసీదాసు కవితా వికాసము
  12. ధూర్జటి కవితా వికాసము
  13. కాళిదాసు కవితా వైభవము
  14. తెలుగు కవిత - లయాత్మకత
  15. జీవనగీత - సినారె
  16. వీచికలు
  17. భావన
  18. అనుభూతి
  19. వ్యాస సూక్తం
  20. విజయానికి అభయం
  21. వాగ్భూషణం భూషణం - ఇరివెంటి కృష్ణమూర్తి
  22. తెలంగాణలో తెలుగు సాహిత్య వికాసం 
  23. తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర - ముదిగంటి సుజాతా రెడ్డి
  24. తెలంగాణ చరిత్ర
  25. తెలుగు భాషా సాహిత్య వైశిష్ట్యం - వ్యాస సంకలనం
  26. తెలుగు సాహితి - దేవులపల్లి రామానుజరావు
  27. తెలుగు పత్రికలు - ప్రసారమాధ్యమాల భాషా స్వరూపం
  28. ఆధునిక తెలుగు సాహిత్యంలో విభిన్న ధోరణులు
  29. తెలుగు పీఠిక - డి. చంద్ర శేఖర్ రెడ్డి
  30. ఆధునిక తెలుగు సాహిత్యంలో హాస్యం
  31. తెలుగు సాహిత్యం మరో చూపు
  32. సాహిత్యానువాదం సమాలోచనం
  33. తెలుగు వాగ్గేయకారులు - అన్నమయ్య విలక్షణ వ్యక్తిత్వం
  34. తెలుగు జానపద సాహిత్యము - స్త్రీల గేయాలలో సంప్రదాయము
  35. ఆంధ్ర మహాభారతోపన్యాసములు
  36. ఆంధ్రమహాభాగవత ఉపన్యాసములు 
  37. శేషాద్రి రమణ కవుల పరిశోధన వ్యాసమంజరి
  38. తెలుగులో పద కవిత
  39. తెలుగు నాటక సాహిత్యం
  40. మా ఊరు మాట్లాడింది - డా. సినారె
  41. సమీక్షణం - డా. సినారె
  42. సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు
  43. దేవులపల్లి రామానుజరావు గ్రంధావళి
  44. దేవులపల్లి రామానుజరావు
  45. గద్య సంగ్రహం
  46. పద్య కుసుమావళి
  47. వ్యాస గుళుచ్ఛం - మొదటి భాగం
  48. వ్యాస గుళుచ్ఛం - రెండవ భాగం
  49. శివరాత్రి మాహాత్మ్యము - శ్రీనాథుడు
  50. తెలంగాణ గిరిజన భాషా సాహిత్యాలు
  51. కదనం లోను కథనంలోనూ మేమే
  52. పరిణతవాణి - 1
  53. పరిణతవాణి - 2
  54. పరిణతవాణి - 3
  55. పరిణతవాణి - 4
  56. పరిణతవాణి - 5
  57. పరిణతవాణి - 6
  58. పరిణతవాణి - 7
  59. స్వర్ణోత్సవ సంచిక
  60. వజ్రోత్సవ సంచిక
  61. ఆంధ్ర సారస్వత పరిషత్తు చరిత్ర 1943-93 

పుస్తకాలను ఎలా దిగుమతి చేసుకోవాలంటే పైన 'సహాయం' ట్యాబ్ పై నొక్కండి ఈ టపాపై మీ వ్యాఖ్య తప్పక రాస్తారు కదూ? మీ వ్యాఖ్యలే మాకు మంచి ప్రోత్సాహకాలు. ఈ టపాను మీ సాంఘికసంపర్కజాలంలో పంచుకొండి. ఇంకొందరికీ ఈ టపా ఉపయోగ పడుతుంది, మీరూ వారికి మేలు చేసినవారవుతారు. మీ రా పని చేస్తారనే నమ్మకంతో ముందుగానే ధన్యవాదాలు.

క్షంతవ్యులు (నవల) చల్లా భీమేశ్వర్ Kshantavyulu - Novel - Challa Bhimeswar

క్షంతవ్యులు (నవల) చల్లా భీమేశ్వర్  

Kshantavyulu - Novel - Challa Bhimeswar 

(UPDATED)

తొలినవలని మొదటి ముద్దుతో  పోల్చడం అతిశయోక్తి కాదు.

 1956 నవల నేటి  భీమేశ్వర చల్లా నాటి సిబిరావు గా రచించినది.

చిన్ననాటి నేస్తాలురామంశశియుక్త వయసులో ప్రేమవలలో చిక్కుకుంటారు.                                                     

కాని విధి వారి వివాహ బంధానికి యమ పాశం అడ్డువేయాగా రామం శశిని కోల్పోతాడు

చనిపోయిన ప్రియురాలిని తన ప్రేమలో సజీవింపించడం రామం జీవిత లక్ష్యం చేసుకుంటాడు.

 మానసిక స్థితిలో ఉన్న అతని జీవితంలోకి యశోరాజ్యం తన ప్రేమానురాగాలతో అడుగిడుతుందిఒకవైపు శశి ప్రేమానూ మరువలేకయశో అనురాగాన్నీ వీడలేక 'రామం బాబుసతమత మవుతుంటే స్త్రీ వాది సరళకర్మసిధ్ధాంతి లఖియా అతని విచలిత జీవన సందిగ్ధతకు మరింత హేతుదాయకులవుతారు

28 August, 2020

వ్యాకరణ గేయాలు Vyakarana Geyalu

        వ్యాకరణ గేయాలు           Vyakarana Geyalu

వేదశ్రీ గంగాధరభట్ల వెంకటేశ్వర శర్మ  గారు రు ఉమ్మడి మెదక్ జిల్లా లో తెలుగు పండితుడిగా పనిచేసి రిటైర్ అయ్యారు. వారు ఉద్యోగంలో ఉన్న కాలంలో విద్యార్థులు తెలుగు వ్యాకరణం నేర్చుకోవడానికి పడే ఇబ్బందిని గమనించారు. వారి కష్టాన్ని తీర్చడానికి అంటూ ఈ విధంగా వ్యాకరణాన్ని అంతా కూడా గేయ రూపంలో రచించారు.

ఈ పుస్తకం విద్యార్థులకే కాకుండా ఉపాధ్యాయులకు కూడా కరదీపికలా ఉపయోగపడుతుందని తెలుగుపరిశోధన మీ ముందుకు తీసుకువస్తుంది. ఈ పుస్తకాన్ని దిగుమతి చేసుకుని తెలుగు ఉపాధ్యాయులు తమ విద్యార్థులకు వారి కృషిని అందించాలని వేడుకుంటున్నాం.

ఈ పుస్తకాన్ని దిగుమతి చేసుకోవాలంటే - 

                     వ్యాకరణ గేయాలు
                                     పై నొక్కండి. 

పుస్తకాలను ఎలా దిగుమతి చేసుకోవాలంటే పైన 'సహాయం' ట్యాబ్ పై నొక్కండి ఈ టపాపై మీ వ్యాఖ్య తప్పక రాస్తారు కదూ? మీ వ్యాఖ్యలే మాకు మంచి ప్రోత్సాహకాలు. ఈ టపాను మీ సాంఘికసంపర్కజాలంలో పంచుకొండి. ఇంకొందరికీ ఈ టపా ఉపయోగ పడుతుంది, మీరూ వారికి మేలు చేసినవారవుతారు. మీ రా పని చేస్తారనే నమ్మకంతో ముందుగానే ధన్యవాదాలు.

09 August, 2020

అప్రాశ్యులు ( నవల ) చల్లా భీమేశ్వర్ Aprashyulu (Novel) Challa Bhimeshar

  అప్రాశ్యులు ( నవల ) చల్లా భీమేశ్వర్  Aprashyulu (Novel) Challa Bhimeshar

(UPADATED)

అరవైఏళ్లనాటి  ఈ 'స్త్రీ' నవల ఈ నాటి అతి వకి ప్రతిబింబం.  

రజని ఆత్మనిర్భరత అసాధారణమయితే ఆమె చంచల ప్రవృత్తి అనూహ్యగోచరం.

కమల పాతివ్రత్య సంకల్పం అఖుంటితమయితే ఆమె లోనయిన పరపురుషాకర్షణ ప్రకృతి చిత్తం.

విశాల ఉదార సేవాభావం దైవత్వమయితే ఆమె చూపే అపార ప్రేమానురాగం స్త్రీ  సహజ  వ్యక్తిత్వం

ఈ ఐ-బాటిల్ లోని రజనీ - రామంల ప్రేమగీతాలు, కమల - ప్రసాద్ ల రాగద్వేషాలు మరియు విశాల - సనల్ ల అనురాగఛాయలు నేటి తెలుగు పాఠకుల కొరకు ఈ రచయిత  పొందు పరచిన వింటేజ్ వైన్.

ఆస్వాదించండి. 

దిగుమతి చేసుకోవడానికి -----

అనుసరించువారు