Showing posts with label ప్రబంధం. Show all posts
Showing posts with label ప్రబంధం. Show all posts

03 May, 2020

తెలుగు ప్రబంధాలు Telugu Prabandhas




ప్రబంధం అనేది  తెలుగువారి పుణ్యాల పరిపాకం. అది మన సృష్టి. మన ప్రత్యేకత. తెలుగు ప్రబంధాలను చదివించాలని గతంలో ఎమెస్కో వారు ప్రబంధాలన్నిటినీ చిన్నసైజులో పుస్తకాలుగా వేయించారు.

తెలుగుపరిశోధన తన సభ్యకుటుంబంకోసం తెలుగుప్రబంధాలన్నిటినీ దొరికినంతవరకు ఒక్కదగ్గర చేర్చి అందించాలనుకుంది.


  1. ఆముక్తమాల్యద - సవ్యాఖ్యానం
  2. కళాపూర్ణోదయం  (కళాపూర్ణోదయం కథ ఈమాటలో)
  3. పారిజాతాపహరణము
  4. ప్రభావతీ ప్రద్యుమ్నము - సవ్యాఖ్య
  5. మను చరిత్ర - సవ్యాఖ్య
  6. రాధికా సాంత్వనము
  7. రాఘవపాండవీయము - సవ్యాఖ్య
  8. వసు చరిత్ర - సవ్యాఖ్య
  9. విజయ విలాసము - తాపీ ధర్మారావు వ్యాఖ్య
  10. వైజయంతీ విలాసము
  11. సమీర కుమార విజయము
  12. శ్రీ కాళహస్తి మాహాత్మ్యము (లఘు టీకా సహితం)
  13. పాండురంగ మహాత్మ్యం , వావిళ్ళ వారిది 
  14. తాలాంకనందినీ పరిణయం 




ఈ టపాలో అప్పుడు కొత్త కొత్త పుస్తకాలు చేర్చే అవకాశం ఉంది కాబట్టి  దీనిపై అప్పుడప్పుడు ఒక కన్నేసి ఉంచండి ....



ఈ టపాపై మీ వ్యాఖ్య తప్పక రాస్తారు కదూ? మీ వ్యాఖ్యలే మాకు మంచి ప్రోత్సాహకాలు. ఈ టపాను మీ సాంఘికసంపర్కజాలంలో పంచుకొండి. ఇంకొందరికీ ఈ టపా ఉపయోగ పడుతుంది, మీరూ వారికి మేలు చేసినవారవుతారు. మీ రా పని చేస్తారనే నమ్మకంతో ముందుగానే ధన్యవాదాలు.

02 May, 2020

తాలాంక నందినీ పరిణయం Talankanandini Parinayam





దీనిని క్రీ.శ. 1780 ప్రాంతంలో వున్న ఆసూరి మరింగంటి వేంకట నరసింహాచార్య కవి రచించినాడు. నల్లగొండ జిల్లా అహల్యా మండలానికి చెందిన అనుముల ఈయన నివాస గ్రామం. కవి తన రచనల్లో షోడశ మహాగ్రంథ బంధురాలంకార నిర్మాణ ధురీణుడను అని తెల్పుకున్న ఈయన కృతుల్లో దాదాపు 10 గ్రంథాలు లభిస్తున్నవి. మిగతావి నామమాత్రావశేషాలు. దొరికిన వాటిలో 5 గ్రంథాలు ముద్రణమైనాయి.


అనుసరించువారు