16 జనవరి, 2016

సాక్షి వ్యాస సంపుటి-పానుగంటి Sakshi by Panuganti

సాక్షి వ్యాసాలు పానుగంటి లక్ష్మీ నరసింహారావు (1865-1940) రచించిన ప్రసిద్ధ తెలుగు వ్యాసాల సంపుటి. ఈ వ్యాసములన్ని కూడ చిక్కనైన గ్రాంధిక భాషలో వ్రాయబడినాయి. 

15 జనవరి, 2016

ఆరుద్ర నాటికలు Arudra Natikalu

తెలంగాణా పోరాట ఇతివృత్తంతో రాసిన త్వమేవాహం (1949) కావ్యం చదివి ఇక నేను పద్యాలు రాయక పోయినా పరవాలేదు అని మహాకవిశ్రీశ్రీ ప్రశంస పొందిన ఆరుద్ర ( ఆగస్టు 311925 - జూన్ 41998) పూర్తిపేరు భాగవతుల సదాశివశంకర శాస్త్రి . శ్రీశ్రీ తర్వాత యువతరంపై ఎక్కువ ముద్ర పడిన కవిగా పేరు పొందిన ఆరుద్ర అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త మరియు విమర్శకుడు.ఈయన భార్య కె.రామలక్ష్మి కూడా ప్రముఖ తెలుగు రచయిత్రి.


14 జనవరి, 2016

మనుచరిత్ర (సవ్యాఖ్యానము) Manu Charitra

అల్లసాని పెద్దన రచించిన మనుచరిత్ర తెలుగులో వెలువడిన మొట్టమొదటి ప్రబంధము. ఈ రచనతోటే అల్లసానివానికి ఆంధ్రకవితాపితామహుడనే పేరు వచ్చింది. ఈ పుస్తకాన్ని సవ్యాఖ్యానంగా మీకు అందించడం తెలుగు పరిశోధన కు సంతోషం.

13 జనవరి, 2016

మహాభారత సంబంధ ప్రవచనాలు,గ్రంథాలు,సినిమాలు Information about Mahabharatha

తెలుగు వారికి భాషా సాహిత్య ధార్మిక రంగాల్లో సేవ చేయాలనే సత్సంకల్పంతో పని చేస్తున్న సాయి సేవకులు ఈసారి మహాభారత సంబంధ సమాచారాన్ని (పుస్తకాలు,ప్రవచనాలు,సినిమాలు)  ఒకే దగ్గర అందించే ప్రయత్నం చేస్తున్నారు. వారి సేవ తెలుగు వారందరికీ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు ప్రకటిస్తున్న తెలుగుపరిశోధన ఈ సందేశాన్ని కూడా మీకు అందిస్తుంది. దీనిని వినియోగించుకొని తెలుగువారు ఆనందింతురు గాక!


12 జనవరి, 2016

పాండురంగ మాహాత్మ్యం (సవ్యాఖ్యానం) Panduranga Mahatmyam Tenali Ramakrishna Kavi

తెనాలి రామకృష్ణకవి రచించిన పాండురంగ మాహాత్మ్యం ప్రౌఢ ప్రబంధం. వ్యాఖ్యాన సహితంగా మీ ముందుకు తెస్తుంది తెలుగు పరిశోధన. ఈ పుస్తకం అంతర్జాలం లో లభించడం అపురూపం. రసికులైన పాఠకులు దీనిని దిగుమతి చేసుకుని, చదివి, ఆనందింతురు గాక.


01 జనవరి, 2016

శ్రీవిద్యా సారథి ( శ్రీవిద్యా గ్రంథాలు) Shri Vidya Granthas

క్రోవి పార్థ సారథి గారి సంపాదకత్వంలో వెలువడిన శ్రీవిద్యా గ్రంథాలన్నీ ఒకే చోట వారి వెబ్ సైట్ శ్రీవిద్యా సారథి లో లభిస్తున్నాయి. వాటిని తెలుగు పరిశోధన పాఠకులు ఈ కింది లంకెలో పొందవచ్చు.

శబ్దార్థ చంద్రిక (నిఘంటువు) Shabda Artha Chandrika (Telugu-Telugu Dictionary)

గతంలో ఎన్నో తెలుగు - తెలుగు నిఘంటువులను అందించిన తెలుగు పరిశోధన మరొక తెలుగు నిఘంటువును మీ ముందుకు తెస్తున్నది. అదే శబ్దార్థ చంద్రిక. ఈ నిఘంటువును దిగుమతి చేసుకుని, మీ అవసరాలకు ఉపయోగించుకోగలరు.

27 డిసెంబర్, 2015

ఉత్తర రామాయణం - కంకంటి పాప రాజు Uttara Ramayanam Of Kankanti Papa Raju

కంకంటి పాపరాజు రాసిన ఉత్తర రామాయణం కొరకు పాఠకులు ఎన్నాళ్ళనుండో ఎదురు చూస్తున్నారు. ఆ గ్రంథాన్ని అందించే అవకాశం తెలుగు పరిశోధనకు ఇన్నాళ్ళకు కలిగింది.

అనుసరించువారు