01 June, 2018

చిలకమర్తి లక్ష్మీనరసింహం రచనలు Chilakamarthi Lakshmi Narasiamham Rachanalu

చిలకమర్తి లక్ష్మీనరసింహం రచనలు Chilakamarthi Lakshmi Narasiamham Rachanalu




విగా, నవలా రచయితగా, నాటక రచయితగా, సంఘసంస్కర్తగా పేరుపొందిన చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు చేసిన అనేక రచనల్లో అంతర్జాలంలో లభిస్తున్న వాటిని సేకరించి, మీ ముందుకు తెస్తున్నాం. ఈ పుస్తకాలను దిగుఅమతి చేసుకుని, చదివి, ఆనందించండి.

09 December, 2017

పద్మపురాణం Padmapuranam

పద్మపురాణం-
 Padmapuranam 



04 December, 2017

సారస్వతవ్యాసములు Sarasvata vyasamulu

సారస్వతవ్యాసములు 
Sarasvata vyasamulu


గతంలో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి వారు మహత్తరమైన గ్రంథాలు ప్రచురించారు. అందులో భాగంగా సారస్వతవ్యాసములు అనే వ్యాససంపుటులను పర్చురించారు. ప్రస్తుతం ఇవి మార్కెట్టులో లభించడం లేదు. అంతర్జాలంలో లభిస్తున్నవాటిని అన్నింటిని 
(ప్రస్తుతం ఐదుభాగాలు)  వీలైనంతవరకు సేకరించి మీ చేతికి అందిచే ప్రయత్నం చేస్తున్నది తెలుగుపరిశోధన.

28 November, 2017

పోతన భాగవతం - సార్థతాత్పర్యం Pothana Bhagavatham (Sateeka)

పోతన భాగవతం - సార్థతాత్పర్యం 
Pothana Bhagavatham (Sateeka)


తిరుమల వేంకటేశ్వరస్వామి మరొకసారి తెలుగువారిని కరుణించి తెలుగువారి దోసిళ్ళలో అమృతాన్ని ధారవోశాడు. గతంలో భాగవతాన్నంతా తాత్పర్యంతో అందించి, అంతటితో తృప్తిపడక ఆ స్వామి మనమీదగల అవ్యాజమైన, అపారమైన కరుణతో భాగవతాన్నంతా ప్రతిపదార్థసహిత వ్యాఖ్యానంతో అందించారు.అవును పోతన ఏమడిగాడు? .....

''పద్యంబొక్కటి చెప్పి సార్థముగ తాత్పర్యమ్ము భాషింపుమా !''  - అనికదా?

18 September, 2017

ఆధునిక భాషాశాస్త్ర సిద్ధాంతాలు Adhunika Bhasha Shastra Siddhantalu

ఆధునిక భాషాశాస్త్ర సిద్ధాంతాలు
 Adhunika Bhasha Shastra Siddhantalu
Dr.పి.యస్.సుబ్రహ్మణ్యం Dr.P.S.Subrahmanyam

Dr.పి.యస్.సుబ్రహ్మణ్యం జగమెరిగిన  భాషాశాస్త్రపండితులు. వారు తెలుగులో అందించిన రెండు అపురూపగ్రంథాలు -
  1. ఆధునిక భాషాశాస్త్ర సిద్ధాంతాలు
  2. ద్రావిడభాషలు
ఇందులో మొదటి గ్రంథాన్ని  మేము మీకు అందిస్తున్నాము. రెండవపుస్తకం అంతర్జాలంలో లభించడం లేదు.

అన్నట్టు, ఈ రెండుపుస్తకాలను తెలుగువిశ్వవిద్యాలయంవారు ముద్రించి అమ్ముతున్నారు. మీరూ ఒకప్రతి కొని పెట్టుకొండి. లేదంటే, అవి దొరకనప్పుడు బాధ పడతారు.
ఈ పుస్తకాలను తెలుగు భాషాసాహిత్యాభిమానులు,భాషాశాస్త్రాభిమానులు,విద్యార్థులు, పోటీ పరీక్షల్లో పాల్గొనేవారు, ఉపాధ్యాయులు..... ఒకమాటలో చెప్పాలంటే, ప్రతి యింట ఉండదగిన అపురూప గ్రంథాలు. ఇప్పుడుమీకు  'ఆధునిక భాషాశాస్త్ర సిద్ధాంతాలు' గ్రంథాన్ని అందిస్తున్నాము. 

                                      ఆధునిక భాషాశాస్త్ర సిద్ధాంతాలు

సూచనః 
తెలుగులో ఎన్నో గ్రంథాలను అందిస్తూ సేవ చేస్తున్న ఉచితగురుకులవిద్య వారి ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్ ని దిగుమతి చేసుకొని, పుస్తకాలను చదువుకోండి. లంకె -
    


12 September, 2017

తెలుగు రామాయణాలు Telugu Ramayanalu

తెలుగు రామాయణాలు 
Telugu Ramayanalu



తెలుగులో వెలువడిన వివిధ రామాయణాలను అంతర్జాలంలో లభిస్తున్నవాటిని ఒక్కదగ్గర అందించే ప్రయత్నం లో భాగంగా ఈ టపాను మీ ముందుకు తెస్తున్నాం.





  1. రంగనాథరామాయణం
  2. గోపీనాథ రామాయణం (కొత్తగా చేర్చబడింది)
  3. మొల్ల రామాయణం
  4. ఆనంద రామాయణం
  5. ఆంధ్ర వాల్మీకి రామాయణం
  6. శ్రీ జైమినీయ రామాయణం
  7. నిర్వచనరామాయణం
  8. శ్రీ అమృతరామాయణం
  9. రమణియ రామాయణం
  10. ఆధ్యాత్మ రామాయణం
  11. గంగా రామాయణం
  12. శతకరీతి పద్యాంధ్ర సంగ్రహ రామాయణం
  13. గజల్ రామాయణం
  14. తులసి రామాయణం
  15. శ్రీ హనుమద్రామాయణం
  16. శతకంఠ రామాయణం
  17. గౌరీ రామాయణం
  18. చంపూ రామాయణము
  19. రఘురామ రామాయణం
  20. గణపతి రామాయణ సుధ
  21. లల్ల రామాయణం
  22. మల్లెమాల రామాయణం
  23. అద్భుత రామాయణం
  24. మోక్షగుండ రామాయణం

ఇవే కాకుండా  సాయి రియల్ ఆటిట్యూడ్ వారి రామాయణం లంకెలో మరికొంత సమాచారం లభించవచ్చు.

10 July, 2017

తిరుపతి వేంకటకవుల రచనలు Tirupathi Venkata kavula rachanalu

తిరుపతి వేంకటకవుల రచనలు 
Tirupathi Venkata kavula rachanalu



జంటకవులుగా చెళ్ళపిళ్ల వేంకటశాస్త్రిగారు, దివాకర్ల తిరుపతి శాస్త్రిగారు ఆంధ్రదేశమంతా తిరిగి వెలువరించిన తమ కవితా సుగంధాలను నేటికీ ......

"బావా ఎప్పుడు వచ్చితీవు?"

 " జెండాపై కపిరాజు " 

అంటూనో తెలుగువారందరూ నేటికీ ఆస్వాదిస్తూనే ఉన్నారు.

అటువంటి తిరుపతి వేంకటకవుల రచనలు తెలుగువారందరికీ దొరికినంతవరకు పంచుకోవాలనే ప్రయత్నం తెలుగుపరిశోధన చేస్తుంది. గతంలో
శతావధానసారము  ప్రకటించాము. ఇప్పుడు ........



  
  1. పాండవ జననము (1901-1917)
  2. పాండవ ప్రవాసము
  3. పాండవ రాజసూయము
  4. పాండవ ఉద్యోగము
  5. పాండవ విజయము
  6. పాండవ అశ్వమేధము
  7. అనర్ఘ నారదము
  8. దంభ వామనము
  9. సుకన్య
  10. ప్రభావతీ ప్రద్యుమ్నము (1920-1922) 


అనేవి ఒకే సంపుటంలో కలిగిన 


            2.  గీరతము 



        5.  కథలూ గాథలూ
         
         6.  ప్రబంధాలు 
          
                ( ఇందులో 
                
                    
  1. శ్రవణానందము (1893-1897; 1897-1898)
  2. పాణిగృహీత
  3. లక్షణా పరిణయము (1897-1901)- లక్షణతో శ్రీకృష్ణుని వివాహాన్ని గురించిన భాగవత గాథ.
  4. ఏలా మహాత్మ్యము (1898-1900) ఏలా నది గురించి.
  5. బొబ్బిలి పట్టాభిషేకం (కావ్యము) (1929) బొబ్బిలి మహారాజు పట్టాభిషేక సందర్భంగా.
  6. బుద్ధచరిత్ర
  7. శ్రీనివాసవిలాసము  

                  అనే ప్రబంధాలున్నాయి.)

      




దాసోజు జ్ఞానేశ్వర్ రచనలు Dasoju Gyaneshwar Rachanalu

దాసోజు జ్ఞానేశ్వర్ రచనలు 
Dasoju Gyaneshwar Rachanalu


దాసోజు జ్ఞానేశ్వర్ గారు తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో తెలుగు పండితులుగా ఉద్యోగబాధ్యతలు నిర్వహిస్తూ కవితావ్యవసాయం చేస్తున్నారు. వారు రాసిన శ్రీదళంలో నల్గొండ జిల్లాలోని ప్రజల కష్టాలు అద్భుతంగా ఆవిష్కరించారు. అందులో ఆయన ........

"శివుడిని పార్వతి హాలాహలాన్ని మింగడానికి అనుమతించిది ఎందుకో తెలుసా?" అని ప్రశ్నించి సమాధానం ఆయనే చెబుతారు -
"అందులో ఎల్లాగూ ఫ్లోరైడ్ అయితే లేదు, అయితే మరేం ఫర్లేదు" అని అట.

ఈ మాటల్లో నల్గొండజిల్లా ప్రజలు ఫ్లోరైడ్ తో ఎంతగా బాధ పడుతున్నారో వ్యంజింపజేసారు. 

వారు రాసిన కవితాసంపుటాలను తెలుగుప్రజలకు అందరికీ అందించాలని తెలుగుపరిశోధన ప్రయత్నం చేస్తున్నది.

వాటిని దిగుమతి చేసుకోవాలంటే........


అనుసరించువారు