ఆత్రేయ గారి అంత్యార్పణ
Antyarpana By Atreya
దాదా హయత్ గారు ప్రేమతో ఈ పుస్తకాన్ని పంపిస్తూ తెలిపిన మాటలు ...వారి మాటల్లోనే...
శర్మగారూ!అన్నట్లు... ఎవరికయినా అభ్యంతరముంటే ఈ పుస్తకాన్ని ఇక్కడినుండి తొలగిస్తాం. లేదా తెలుగువారు ఈ పుస్తకం చదివి ఆనందింతురు గాక.
ఆచార్య ఆత్రేయగారి 'అంత్యార్పణ' నాటిక ఇందువెంట పంపిస్తున్నాను.
ఈ నాటిక మీరిచ్చిన 'ఎవరు దొంగ? - ఇతర నాటికలు ' లంకెలో ఇదివరకు వున్నదే. అయితే ఈ ఎడిషన్ వేరు. 'ఎవరు దొంగ?' దేశీ ప్రచురణలు. ఇప్పుడు నేనిస్తున్నది విశాలాంధ్ర ప్రచురణ. 1955 నాటి అపురూపమైన ఎడిషన్ ఇది. అంతర్జాలంలో సేకరించిందే. ఇందులో ఆత్రేయగారి చరిత్రాత్మకమైన ముందుమాట వున్నది. నటీనటవర్గం జాబితా వున్నది. భారతమ్మ పాత్ర ఆనాటి సుప్రసిద్ధ సినీనటి జి.వరలక్ష్మిగారు పోషించినట్టుగా ఈ ముందుమాటవల్ల తెలుస్తోంది. శేషయ్యగా వేసిన నాగభూషణం మన 'రక్తకన్నీరు' నాగభూషణం గారే అనుకుంటున్నాను. ఎవరో మధుసూదనరావుగారు రెండుపాత్రలు వేశారు. దురదృష్టవశాతూ ఇంటిపేర్లివ్వకపోవడంవల్ల వారు ఏ మధుసూదనరావుగారో తెలియకుండాపోయింది. ఒక సంవత్సరకాలంలోనే ఎనిమిది లక్షలమంది ప్రేక్షకులు ఈ నాటకం చూశారట. మా ప్రొద్దుటూరులో కూడా ఈ నాటకం ఆడినట్టున్నారు. ఎందుకో ఈ ముందుమాట దేశీ ప్రచురణల ఎడిషన్ లో లేదు. ఇంకా విశేషమేమిటంటే ఆత్రేయగారు స్వయంగా ఇందులో జగన్నాధం పాత్ర వేశారు. భారతమ్మగా పూర్తి నాన్-గ్లామరస్ గెటప్ లో జి.వరలక్ష్మి, జగన్నాధం పాత్రలో ఆత్రేయగారూ వున్న ఒక ఛాయాచిత్రం కూడా ఈ విశాలాంధ్రవారి ఎడిషన్ లో వుంది. అందులో ఆత్రేయగారు నిండుగా స్ఫురద్రూపిగా కనిపిస్తున్నారు. 'కోడెనాగు' సినిమాలో కనిపించిన ఆత్రేయగారికీ ఈ ఆత్రేయగారికీ చాలా తేడా వుంది. జగ్గయ్యగారు ఎంతో అభిమానం తో 'ఆత్రేయ సాహితి' ప్రకటించకపోయి వుంటే సినిమారంగం మింగేసిన మన సొంత బెర్నార్డ్ షా ఆత్రేయగారి రచనలు అనేకం శాశ్వతంగా కనుమరుగు అయిపోయివుండేవి. ఈ ఎడిషన్ మీ వెబ్ సైటులో వుంచడానికి విశాలాంధ్రవారికి ఏమైనా అభ్యంతరాలుంటాయేమో నాకు తెలీదు. ఇది మీకు పంపించి ఆత్రేయగారి సాహితీ ఋణం తీర్చుకుంటున్నాననుకుంటున్నాను.
ఇట్లు మీ విధేయుడు,
ఎన్. దాదా హయాత్
0 వ్యాఖ్యలు:
Post a Comment