ఆర్కైవ్ లో (DLL వారివి) కొన్ని నవలలు కన్పించినాయి. వాటిని అందుబాటులోకి తెస్తే ఔత్సాహికులైన పాఠకులకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఇక్కడ సాధ్యమైనవాటిని అందిస్తున్నాము.
తెలుగు సాహిత్యంలో గురజాడది ప్రత్యేకస్థానం. ఆయన ఆధునిక కవిత్వానికి యుగకర్త. వ్యావహారిక భాషను రచనల్లో వాడి, దానికీ పుస్తకభాషా స్థాయిని కల్పించిన మహనీయుడు.
చిలకమర్తి లక్ష్మీనరసింహం రచనలు Chilakamarthi Lakshmi Narasiamham Rachanalu
కవిగా, నవలా రచయితగా, నాటక రచయితగా, సంఘసంస్కర్తగా పేరుపొందిన చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు చేసిన అనేక రచనల్లో అంతర్జాలంలో లభిస్తున్న వాటిని సేకరించి, మీ ముందుకు తెస్తున్నాం. ఈ పుస్తకాలను దిగుఅమతి చేసుకుని, చదివి, ఆనందించండి.
దాసోజు జ్ఞానేశ్వర్ గారు తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో తెలుగు పండితులుగా ఉద్యోగబాధ్యతలు నిర్వహిస్తూ కవితావ్యవసాయం చేస్తున్నారు. వారు రాసిన శ్రీదళంలో నల్గొండ జిల్లాలోని ప్రజల కష్టాలు అద్భుతంగా ఆవిష్కరించారు. అందులో ఆయన ........
"శివుడిని పార్వతి హాలాహలాన్ని మింగడానికి అనుమతించిది ఎందుకో తెలుసా?" అని ప్రశ్నించి సమాధానం ఆయనే చెబుతారు -
"అందులో ఎల్లాగూ ఫ్లోరైడ్ అయితే లేదు, అయితే మరేం ఫర్లేదు" అని అట.
ఈ మాటల్లో నల్గొండజిల్లా ప్రజలు ఫ్లోరైడ్ తో ఎంతగా బాధ పడుతున్నారో వ్యంజింపజేసారు.
వారు రాసిన కవితాసంపుటాలను తెలుగుప్రజలకు అందరికీ అందించాలని తెలుగుపరిశోధన ప్రయత్నం చేస్తున్నది.
సుప్రసిద్ధ పండితులు వేదం వేంకటరాయ శాస్త్రి గారి రచనలను డిజిటల్ లైబ్రరి ఆఫ్ ఇండియా లో లభిస్తున్న వానిని మీ ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నది తెలుగుపరిశోధన. పుస్తకాలను దిగుమతి చేసుకొని, చదివి ఆనందించండి.
దాశరథి రంగాచార్యుల రచనలను అంతర్జాలంలో లభించిన వాటిని ఒక్కదగ్గర చేర్చి, మీ ముందుకు తెస్తుంది తెలుగు పరిశోధన. ఆయా పుస్తకాలను దిగుమతి చేసుకొని, చదివి ఆనందించండి.
సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రి గారి గ్రంథాలను అంతర్జాలంలో లభించిన వాటినన్నింటిని ఒక్కచోట చేర్చి అందించాలనే సంకల్పంతో చేసిన ప్రయత్నమే ఈ సన్నిధానం వారి రచనలు. ప్రస్తుతం లభిస్తున్నవాటిని ప్రకటిస్తున్నాం. ఇంకా ఏవైనా పుస్తకాల లంకెలను ఎవరైనా అందిస్తే వాటినీ అందిస్తాం.
ఇంతకు ముందు జ్ఞానపీఠ పురస్కారాన్ని రావూరి భరద్వాజగారు పొందిన సందర్భంగా అభినందిస్తూ ప్రకటించిన టపాలో కొన్ని వారి రచనలను పేర్కొనడం జరిగింది. ఇప్పుడు మాకు అంతర్జాలంలో లభించిన పుస్తకాలననన్నిటిని ఒక్క దగ్గర చేర్చి ప్రకటిస్తున్నాము.
ఆరుద్ర ( ఆగస్టు 31, 1925 - జూన్ 4, 1998) పూర్తిపేరు భాగవతుల సదాశివశంకర శాస్త్రి . శ్రీశ్రీ తర్వాత యువతరంపై ఎక్కువ ముద్ర పడిన కవిగా పేరు పొందిన ఆరుద్ర అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త మరియు విమర్శకుడు. ఈయన భార్య కె.రామలక్ష్మి కూడా ప్రముఖ తెలుగు రచయిత్రి.
సాక్షి వ్యాసాలుపానుగంటి లక్ష్మీ నరసింహారావు (1865-1940) రచించిన ప్రసిద్ధ తెలుగు వ్యాసాల సంపుటి. ఈ వ్యాసములన్ని కూడ చిక్కనైన గ్రాంధిక భాషలో వ్రాయబడినాయి.
తెలంగాణా పోరాట ఇతివృత్తంతో రాసిన త్వమేవాహం (1949) కావ్యం చదివి ఇక నేను పద్యాలు రాయక పోయినా పరవాలేదు అని మహాకవిశ్రీశ్రీ ప్రశంస పొందిన ఆరుద్ర ( ఆగస్టు 31, 1925 - జూన్ 4, 1998) పూర్తిపేరు భాగవతుల సదాశివశంకర శాస్త్రి . శ్రీశ్రీ తర్వాత యువతరంపై ఎక్కువ ముద్ర పడిన కవిగా పేరు పొందిన ఆరుద్ర అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త మరియు విమర్శకుడు.ఈయన భార్య కె.రామలక్ష్మి కూడా ప్రముఖ తెలుగు రచయిత్రి.
పుట్టపర్తి నారాయణాచార్యులు గారి ఈ శివతాండవం అద్భుతకావ్యం. ఇటువంటి కావ్యాన్ని అందిస్తున్నందుకు ఆనందంగా ఉంది.
ఇది చాలా ఉపయోగకరమైన పుస్తకం. తప్పక దీన్ని దిగుమతి చేసుకోండి.
స్వీయపఠనం -ఆడియో
(శోభనాచల వారి సౌజన్యంతో)
చిన్న గమనిక:- మీకు ఈ పుస్తకం నచ్చితే, కింద వ్యాఖ్యానం వ్రాయండి. పదిమందితో ఈ టపాను పంచుకొండి. మేం చేసే ఈ జ్ఞాన యజ్ఞంలో పాలు పంచుకొండి.
డా.సి. నారాయణ రెడ్డి గారు ఉస్మానియా విశ్వ విద్యాలయానికి 1962 లో Ph.D. పట్టం కొరకుగాను సమర్పిచిన సిద్ధాంత వ్యాసమిది. ఇది ప్రచురించబడిన నాటినుండి ఎన్నో ముద్రణలకు నోచుకుంది. తెలుగు అభిమాన విషయంగా చదివే విద్యార్థులందరికీ ఈ పుస్తకం కరదీపిక ఆధునికాంధ్ర కవిత్వ విషయంలో. చదివి ఆనందించండి.
ఒక చిన్న విజ్ఞాపన. మీకు, మేము చేస్తున్న ఈ సేవ నచ్చితే, మీ సాంఘిక సంపర్క జాలాల్లో ప్రస్తావించి మరింత ఎక్కువజనాలకు సేవ చేసుకునే భాగ్యం మాకు ప్రసాదించండి. ఏ పుస్తకం నచ్చినా వెంటనే ఆ పుస్తకాన్ని ఇక్కడ దొరుకుతుందని పదుగురికి చెప్పండి. మన తెలుగుజాతికి చేసే సేవలో మీ వంతు చేయూత అందించండి.