Showing posts with label Dictionary. Show all posts
Showing posts with label Dictionary. Show all posts

26 July, 2025

సాహిత్య పదకోశము Dictionary of Literary Terminalogy





సాహిత్యం దృశ్య కావ్యం, శ్రావ్య కావ్యం అంటూ రెండు విధాలు. వీటికి సంబంధించిన సాహిత్య శాస్త్ర/ అలంకార శాస్త్ర సంబంధిత పారిభాషిక పదాలను అన్నింటినీ సేకరించి అకారాది క్రమంలో మనకు అందించారు తెలుగు అకాడమీవారు. ఇటువంటి అపురూపమైన శాస్త్ర గ్రంథాలు ఈమధ్య కాలంలో రావడం లేదు. ఈ గ్రంథం ప్రస్తుతం మార్కెట్లో దొరికే అవకాశం లేదు. ఈ గ్రంథం సాహిత్య శాస్త్ర అధ్యయనం చేసే విద్యార్థులకు, ఆచార్యులకు, పోటీ పరీక్షల అభ్యర్థులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. 
దీన్ని దిగుమతి చేసుకొని భద్రపరచుకోవాలి. 







దిగుమతి చేసుకోవాలంటే - 

సాహిత్య పదకోశము 



పుస్తకాలను ఎలా దిగుమతి చేసుకోవాలంటే పైన 'సహాయం' ట్యాబ్ పై నొక్కండి ఈ టపాపై మీ వ్యాఖ్య తప్పక రాస్తారు కదూ? మీ వ్యాఖ్యలే మాకు మంచి ప్రోత్సాహకాలు. ఈ టపాను మీ సాంఘికసంపర్కజాలంలో పంచుకొండి. ఇంకొందరికీ ఈ టపా ఉపయోగ పడుతుంది, మీరూ వారికి మేలు చేసినవారవుతారు. మీ రా పని చేస్తారనే నమ్మకంతో ముందుగానే ధన్యవాదాలు.

30 June, 2020

అమర కోశము - గురుబాల ప్రబోధిక Amarakoshamu - Gurubala Prabodhika

అమర కోశము - గురుబాల ప్రబోధిక Amarakoshamu - Gurubala Prabodhika




అమరకోశము గూర్చి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. సంస్కృతాంధ్రభాషల్లో పట్టు సాధించాలంటే, సంస్కృత పదాలన్నీ నాలుకమీద నాట్యమాడాలంటే నేర్చుకోవాల్సింది అమరకోశము.

01 May, 2020

ప్రాసాక్షర పదకోశము విద్యార్థి కల్పవల్లి Prasakshara Padakoshamu Vidyarthi Kalpavalli


ముసునూరి నారాయణ రావు గారు రాసిన రెండు విశిష్టమైన నిఘంటువులు విద్యార్థులకు కవులకు పండితులకు ఉపయోగపడేవి మీ ముందుకు తేవాలని తెలుగు పరిశోధన నిర్ణయించుకుంది.

04 April, 2020

పదబంధ పారిజాతము Padabandha parijatamu


  పదబంధ పారిజాతము
 Padabandha parijatamu



     ఈ రోజు మీ అందరికీ నచ్చే ఒక ప్రత్యేకమైన పుస్తకం అందిస్తాను.

      "వాడికి కళ్ళమంట" 
     " కళ్లలో కారం కొట్టినాడు"
     " వెన్ను చూపడు"
    " మడమ తిప్పడు"
   "కళ్ళు నెత్తికెక్కు"

మొదలైన పదాలు మన భాషకు అందాన్ని తెస్తాయి. అయితే ఆ మాటల్లో ఏ పదాలైతే కలిసి ఉన్నాయో ఆ యా మాటల వాచ్యార్థం ఆ పదబంధానిది కాదు. ఆ పదాన్ని, అలాగే, ఉన్నదున్నట్టుగా వేరే భాషలోకి అనువదిస్తే అర్థం కాదు అవతలివాడికి. వీటినే మనం జాతీయాలు అంటాం.


ఇటువంటి వాటిని ఒక్కదగ్గర కూర్చి పదబంధపారిజాతంగా వేసిన పెద్దలకు నమస్కారం చేసి, ఈ రెండు సంపుటాలు, నార్ల వారి తెలుగు జాతీయాలు దిగుమతి చేసుకుని పరిశీలిద్దాం. ఆ యా జాతీయాలను ఆయా సందర్భాల్లో వాడుతూ అందమైన తెలుగు భాషను వాడుకలో కొనసాగిద్దాం. "ఇప్పటికే టెలుగు మర్షి పోటున్నాంగా?"


 దిగుమతికై నొక్కండి ....


                                                           పదబంధ పారిజాతం  1
                                                           పదబంధ పారిజాతం  2
                                                           తెలుగు జాతీయాలు    1
                                                                                                           .....లపై నొక్కండి

ఈ టపాను మీ సాంఘికసంపర్కజాలంలో పంచుకొండి. ఇంకొందరికీ ఈ టపా ఉపయోగ పడుతుంది, మీరూ వారికి మేలు చేసినవారవుతారు. మీ రా పని చేస్తారనే నమ్మకంతో ముందుగానే ధన్యవాదాలు.

12 January, 2020

సాహిత్య పదకోశము Sahithya pada koshamu


సాహిత్య పదకోశము
 Sahithya pada koshamu



న్నో ఏళ్ళక్రితం ప్రచురితమైన పుస్తకం ఇది. సాహిత్య విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ విధమైన సాహిత్యపదకోశాలు హిందిలో ఉన్నా తెలుగులో లేదనే లోటు లేకుండా తెలుగుఅకాడమీ వారు ప్రచురించారు చాలానాళ్ళక్రితం. అదృష్టవశాత్తు నాకు ఈ మధ్య తారసపడింది. ఈ పుస్తకంకోసం ఎన్నాళ్లనుండో తాపత్రయపడుతున్నాను. కానీ, దొరకడం లేదు. నేను గతంలో కొనుక్కున్న మూడు ప్రతులూ సాహితీపిపాసుకులైన మిత్రులెవరికో ఇచ్చాను. ఏమయితేనేం ఈ విధంగానైనా మనకు లభించేట్టు చేసిన ఆ అజ్ఞాత'ఈ'పుస్తకదాతకు శతకోటి నమస్కారాలు.

ఈ పుసకంలో సాహిత్య,నాటక,అలంకార విభాగాల్లో సాహిత్యశాస్త్ర పారిభాషికపదాలన్నీ అకారాదిక్రమంలో ఉన్నాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు .... ఈ పుస్తకాన్ని పొంది, ఆనందించాలని మా కోరిక.




దిగుమతి కొరకు లంకె .......



- పై నొక్కండి.








ఈ టపాను మీ సాంఘికసంపర్కజాలంలో పంచుకొండి. ఇంకొందరికీ ఈ టపా ఉపయోగ పడుతుంది, మీరూ వారికి మేలు చేసినవారవుతారు. మీ రా పని చేస్తారనే నమ్మకంతో ముందుగానే ధన్యవాదాలు.

08 November, 2016

తెలంగాణ పదకోశం-నలిమెల భాస్కర్ Telangana Padakosham - Nalimela Bhaskar

తెలంగాణ పదకోశం-నలిమెల భాస్కర్ 

Telangana Padakosham - Nalimela Bhaskar


Telangana Padakosham

లిమెల భాస్కర్ సేకరించిన తెలంగాణ పదకోశాన్ని http://etelangana.org వారు అందిస్తున్నారు. ఆ అపురూపమైన పదకోశాన్ని తెలుగువారి దృష్టికి తేవాలనేదే మా ప్రయత్నం.

03 March, 2016

ఆంధ్ర వాచస్పత్యము Andhra Vachaspathyamu

ఆంధ్ర వాచస్పత్యము
కొట్ర శ్యామల కామ శాస్త్రి 
Andhra Vachaspathyamu
Kotra Shyamala Kama Shastry

కొట్ర శ్యామల కామశాస్త్రిగారు రచించిన బృహత్తర నిఘంటువు ఆంధ్ర వాచస్పత్యము. దానిని సమగ్రంగా అందించే భాగ్యం తెలుగు పరిశోధన వారికి కలిగింది. దీనికొరకు పాఠకులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. దిగుమతి చేసుకుని, ఆనందించండి.

అనుసరించువారు