Showing posts with label Kavya-Prabandham. Show all posts
Showing posts with label Kavya-Prabandham. Show all posts

08 April, 2020

శ్రీనాథ కవిసార్వభౌముడు - రచనలు Srinatha Kavi Sarvabhaumuni Rachanalu

శ్రీనాథ కవిసార్వభౌముడు - రచనలు 
 Srinatha Kavi Sarvabhaumuni Rachanalu

శ్రీకారంతోనే తెలుగు సాహిత్య ఆరంభం. తెలుగు సాహిత్య సముద్రంలో శ్రీనాథ మహా కవి ఉవ్వెత్తుత్తున ఎగిసిపడిన తరంగం. శ్రీనాథుని చదవడం జీవితానికి ఒక తృప్తి. 

20 October, 2018

పాండురంగ మాహాత్మ్యం - పామర వ్యాఖ్యా సహితం Panduranga Mahathmyam - Pamara vyakhya


పాండురంగ మాహాత్మ్యం - పామర వ్యాఖ్య Panduranga Mahathmyamu - Pamara vyakhya


పాండురంగ మాహాత్మ్యం-పామర వ్యాఖ్య



తెలుగు సాహిత్యంతో ఏ కొంచెం పరిచయం ఉన్నవారయినా తెనాలి రామకృష్ణ కవి గూర్చి వినక ఉండరు. ఆయన రాసిన పాండురంగ మాహాత్మ్యం కూడా ప్రసిద్ధమే. అది ప్రౌఢ ప్రబంధం.  గతంలో ఈ గ్రంథాన్ని బులుసు వేంకటరమణయ్యగారి టీకతో తెలుగుపరిశోధన మీకు అందించింది. ఇక ఇప్పుడు 'పామర' వ్యాఖ్యతో మీకు అందించే అవకాశం కల్పించినవారు రసజ్ఞభారతి వ్యవస్థాపకులు ఆచార్య ఆర్.వి.కుమార్ గారు. వారికి సహస్రానేక కృతజ్ఞతాభివందనాలు.

ఈ 'పామర' వ్యాఖ్యను మనకొరకు అందించినవారు డా.దేవగుప్తాపు సూర్య గణపతి రావు గారు. వారు వృత్తిరీత్యా సామాన్యులకు దురవగాహమైన ఎన్నో విషయాలను పరిశీలించి లోకసామాన్యానికి అర్థమయ్యేతీరులో వ్యాఖ్యానించి చెప్పే రేడియాలజిష్టు. వారు తమ ఆ తృతీయనేత్రాన్ని  సాహిత్యంలో కూడా పారించారు. ఇంకేం సామాన్యులకు పాండురంగ మహాత్మ్యం అర్థం కావడం కష్టం. దాన్ని కూడా పరిశీలించి, మనకు  వ్యాఖ్యానించి అందించారు.  అదీ అందరికీ ఉచితంగా అందించాలనే సత్సంకల్పంతో .... 

ఈ రసజ్ఞభారతి గూర్చి, వ్యాఖ్యా రచయితగూర్చి, వారి మిత్రబృందంగూర్చి అన్ని విషయాలను ఆ పుస్తకంలోనే చదువండి. 

మరింకేం ఆలస్యం .......


పాండురంగ మాహాత్మ్యం-పామరవ్యాఖ్య by Dr.Pandu Ranga Sharma Ramaka on Scribd




ఈ పుస్తకాన్ని దిగుమతి చేసుకోవాలనుకుంటే .......


పై నొక్కండి.

ఈ టపాను మీ సాంఘికసంపర్కజాలంలో పంచుకొండి. ఇంకొందరికీ ఈ టపా ఉపయోగ పడుతుంది, మీరూ వారికి మేలు చేసినవారవుతారు. మీ రా పని చేస్తారనే నమ్మకంతో ముందుగానే ధన్యవాదాలు.

07 June, 2018

వసుచరిత్రము (సవ్యాఖ్యానం) Vasucharitramu (Savyakhya)

వసుచరిత్రము (సవ్యాఖ్యానం) 
Vasucharitramu (Savyakhya)
రామరాజ భూషణుడు Ramaraja Bhushanudu

ప్రబంధయుగములో వెలువడిన అత్యుత్తమసాహిత్యంలో రామరాజకృత వసుచరిత్రము ప్రముఖము. ఈ ప్రబంధం ప్రౌఢము. వ్యాఖ్యానరహితంగా అర్థమయ్యేది కాదు.

04 June, 2018

ప్రబంధాలు - శృంగారం-ప్రయోగాలు Prabandhalu-Sringaram-Prayogalu

ప్రబంధాలు - శృంగారం-ప్రయోగాలు 
Prabandhalu-Sringaram-Prayogalu
బి.రాములు B.Ramulu


చార్యులు బి.రాములు గారు హైదరాబాద్ విశ్వ విద్యాలయంలో Ph.D. పట్టం కొరకు సమర్పించిన సిద్ధాంత వ్యాసం.

02 May, 2016

విష్ణుమాయా విలాసము Vishnu maya Vilasamu of Kankanti Papi Raju

విష్ణుమాయా విలాసము   
 Vishnu maya Vilasamu of  Kankanti Papi Raju



గతంలో తెలుగు పరిశోధన కంకంటి పాపరాజు రచించిన ఉత్తరరామాయణాన్ని ప్రకటించింది. ఇక ఇప్పుడు అతని మరొక కృతి విష్ణుమాయావిలాసము ను కూడా ప్రకటించి, కవి ఋణాన్ని, భాషా సాహిత్య ఋణాన్ని తీర్చుకునే ప్రయత్నం చేస్తుంది మీ తెలుగు పరిశోధన.

24 January, 2016

పురాణ నామ చంద్రిక Purana Nama Chandrika

పూర్వగాధాలహరి ప్రసిద్ధమైన పూర్వ కథా గ్రంథం. అందులో మన పురాణాల్లోని వివిధ పాత్రలు,స్థలాలు మొదలైన వాని పేర్లు, వాని విశేషాలూ ఉంటాయి. అటువంటివే ఈ పురాణ నామ చంద్రిక, పురాణ నామ సంగ్రహము.

Purana Nama Chandrika

14 January, 2016

మనుచరిత్ర (సవ్యాఖ్యానము) Manu Charitra

అల్లసాని పెద్దన రచించిన మనుచరిత్ర తెలుగులో వెలువడిన మొట్టమొదటి ప్రబంధము. ఈ రచనతోటే అల్లసానివానికి ఆంధ్రకవితాపితామహుడనే పేరు వచ్చింది. ఈ పుస్తకాన్ని సవ్యాఖ్యానంగా మీకు అందించడం తెలుగు పరిశోధన కు సంతోషం.

అనుసరించువారు