Language లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Language లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

18 సెప్టెంబర్, 2017

ఆధునిక భాషాశాస్త్ర సిద్ధాంతాలు Adhunika Bhasha Shastra Siddhantalu

ఆధునిక భాషాశాస్త్ర సిద్ధాంతాలు
 Adhunika Bhasha Shastra Siddhantalu
Dr.పి.యస్.సుబ్రహ్మణ్యం Dr.P.S.Subrahmanyam

Dr.పి.యస్.సుబ్రహ్మణ్యం జగమెరిగిన  భాషాశాస్త్రపండితులు. వారు తెలుగులో అందించిన రెండు అపురూపగ్రంథాలు -
  1. ఆధునిక భాషాశాస్త్ర సిద్ధాంతాలు
  2. ద్రావిడభాషలు
ఇందులో మొదటి గ్రంథాన్ని  మేము మీకు అందిస్తున్నాము. రెండవపుస్తకం అంతర్జాలంలో లభించడం లేదు.

అన్నట్టు, ఈ రెండుపుస్తకాలను తెలుగువిశ్వవిద్యాలయంవారు ముద్రించి అమ్ముతున్నారు. మీరూ ఒకప్రతి కొని పెట్టుకొండి. లేదంటే, అవి దొరకనప్పుడు బాధ పడతారు.
ఈ పుస్తకాలను తెలుగు భాషాసాహిత్యాభిమానులు,భాషాశాస్త్రాభిమానులు,విద్యార్థులు, పోటీ పరీక్షల్లో పాల్గొనేవారు, ఉపాధ్యాయులు..... ఒకమాటలో చెప్పాలంటే, ప్రతి యింట ఉండదగిన అపురూప గ్రంథాలు. ఇప్పుడుమీకు  'ఆధునిక భాషాశాస్త్ర సిద్ధాంతాలు' గ్రంథాన్ని అందిస్తున్నాము. 

                                      ఆధునిక భాషాశాస్త్ర సిద్ధాంతాలు

సూచనః 
తెలుగులో ఎన్నో గ్రంథాలను అందిస్తూ సేవ చేస్తున్న ఉచితగురుకులవిద్య వారి ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్ ని దిగుమతి చేసుకొని, పుస్తకాలను చదువుకోండి. లంకె -
    


28 ఆగస్టు, 2016

Dr.అంబడిపూడి నాగభూషణం రచనలు Dr.Ambadipudi Nagabhushanam

Dr.అంబడిపూడి నాగభూషణం రచనలు Dr.Ambadipudi Nagabhushanam


ప్రసిద్ధ వ్యాకరణశాస్త్ర పండితులు, భాషాశాస్త్రవేత్త, ఆచార్యులు అంబడిపూడి నాగభూషణంగారి వ్యాకరణ రచనలు లభిస్తున్నాయి. వాటిని చదవడంవల్ల మన భాషా జ్ఞానం పెరుగుతుంది. చక్కని సంప్రదింపు గ్రంథాలు. దిగుమతి చేసుకుని, ఆనందించండి.

07 సెప్టెంబర్, 2014

భాష - ఆధునిక దృక్పథం Bhasha Adhunika Drikpatham

భాష - ఆధునిక దృక్పథం
 Bhasha Adhunika Drikpatham
డా. పోరంకి దక్షిణా మూర్తి Dr.Poranki Dakshina murthi

డా. పోరంకి దక్షిణా మూర్తి గారు వ్యావహారిక భాషా రచన గురించి వ్రాసిన వివిధ వ్యాసాలు ఈ పుస్తకంలో చదువుకోవచ్చు. ఈ అపురూప గ్రంథాన్ని ఇక్కడ పొందండి.


03 సెప్టెంబర్, 2013

భాషా చారిత్రక వ్యాసావళి Bhasha Charitraka Vyasavali

భాషా చారిత్రక వ్యాసావళి 
Bhasha Charitraka Vyasavali
తూమాటి దొణప్ప Tumati Donappa

చార్య తూమాటి దొణప్పగారు  రచించిన భాషా చారిత్రకవ్యాసాల సంపుటి.

24 ఆగస్టు, 2013

కౌముదీ శరదాగమనము Kaumudi Sharad Agamanamu

కౌముదీ శరదాగమనము
                Kaumudi Sharad Agamanamu
        
           శ్రీ అప్పల్ల జోగన్న శాస్త్రి గారు Shri Appanna Joganna Shastri


సుప్రసిద్ధ వైయాకరణి శ్రీ అప్పల్ల జోగన్న శాస్త్రి గారు తెలుగువారిని అనుగ్రహించదలచి, సంస్కృతంలో భట్టోజీ దీక్షితులవారు రచించిన వైయ్యాకరణ సిద్ధాంత కౌముదీ గ్రంథానికి తెలుగులో వ్యాఖ్యానంతో (సమాస ప్రకరణం వరకు) అందించారు. ఆ అద్భుత గ్రంథాన్ని తెలుగువారికి అందించగలిగి తెలుగు పరిశోధన గర్విస్తుంది.

21 ఆగస్టు, 2013

ఆంధ్రభాషా వికాసము Andhra Bhasha Vikasam

ఆంధ్రభాషా వికాసము 
Andhra Bhasha Vikasam
గంటిజోగి సోమయాజి Gantijogi Somayaji

ఆచార్య గంటిజోగి సోమయాజి గారు తెలుగుభాషగురించి, ద్రవిడ భాషల్లో తెలుగు స్థానం గురించి...... అన్ని విషయాలను వారు పాఠం చెప్పిన అనుభవంతో వ్రాసిన గ్రంథ రత్నమిది.

02 జూన్, 2013

తెలుగు వ్యాకరణాలపై సంస్కృత ప్రాకృత వ్యాకరణాల ప్రభావం Influence of Sanskrit& Prakrit Grammars on Telugu Grammars

తెలుగు వ్యాకరణాలపై 
సంస్కృత ప్రాకృత వ్యాకరణాల ప్రభావం
Influence of Sanskrit& Prakrit Grammars on Telugu Grammars 
ఆచార్య బేతవోలు రామబ్రహ్మం Betavolu Rama Brahmam
Betavolu Ramabrahmam


తెలుగు ద్రావిడ భాష ఐనప్పటికీ తెలుగుసాహిత్యంపై సంస్కృత ప్రభావం ఎంతటిదో అందరికీ తెలుసు. అసలు తెలుగులో గ్రంథ రచన ప్రారంభమైందే సంస్కృత వ్యాసభారత అనువాదంతో. ఇక వ్యాకరణ విషయానికి వస్తే మన వ్యాకర్తలు ఉపయోగించినది సంస్కృత వ్యాకర్తల ప్రణాలికలే, వారి పారిభాషిక పదాలే. ఇంకా ఏమేమున్నాయో పరిశోధించి అందజేసారు బేతవోలు రామబ్రహ్మం గారు తమ నాగార్జున విశ్వవిద్యాలయానికి సమర్పించిన Ph.D. సిద్ధాంతవ్యాసగ్రంథంలో. ఆ విశిష్ట గ్రంథమే ఇది.

అనుసరించువారు