తెలంగాణ రాజకీయ, సాంఘిక చైతన్యం అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు సురవరం ప్రతాపరెడ్డి (మే 28, 1896 - ఆగస్టు 25, 1953). పత్రికా సంపాదకుడుగా, పరిశోధకుడుగా, పండితుడుగా, రచయితగా, ప్రేరకుడుగా, క్రియాశీల ఉద్యమకారుడుగా బహుముఖాలుగా సాగిన ప్రతాపరెడ్డి ప్రతిభ, కృషి అనన్యమైనవి. స్థానిక చరిత్రల గురించి, స్థానిక ప్రజల కడగండ్ల గురించి ఆయన పడిన నిరంతర తపనకు ప్రతి అక్షరం ప్రత్యక్ష సాక్ష్యం. తెలంగాణలో కవులే లేరనే నిందావ్యాఖ్యలను సవాలుగా తీసుకొని 354 కవులతో కూడిన "గోల్కొండ కవుల సంచిక" గ్రంథాన్ని కవుల జీవిత విశేషాలతో సహా ప్రచురించి గ్రంథరూపంలోనే సమాధానమిచ్చిన వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి. తెలంగాణ సాంస్కృతిక చరిత్రలో సురవరం ప్రతాపరెడ్డి ఒక అధ్యాయం.
ఇటీవల నవీకరించిన టపాలు
17 జనవరి, 2016
16 జనవరి, 2016
సాక్షి వ్యాస సంపుటి-పానుగంటి Sakshi by Panuganti
సాక్షి వ్యాసాలు పానుగంటి లక్ష్మీ నరసింహారావు (1865-1940) రచించిన ప్రసిద్ధ తెలుగు వ్యాసాల సంపుటి. ఈ వ్యాసములన్ని కూడ చిక్కనైన గ్రాంధిక భాషలో వ్రాయబడినాయి.
లేబుళ్లు:
Essay,
Modern Literature,
Sakshi
15 జనవరి, 2016
ఆరుద్ర నాటికలు Arudra Natikalu
తెలంగాణా పోరాట ఇతివృత్తంతో రాసిన త్వమేవాహం (1949) కావ్యం చదివి ఇక నేను పద్యాలు రాయక పోయినా పరవాలేదు అని మహాకవిశ్రీశ్రీ ప్రశంస పొందిన ఆరుద్ర ( ఆగస్టు 31, 1925 - జూన్ 4, 1998) పూర్తిపేరు భాగవతుల సదాశివశంకర శాస్త్రి . శ్రీశ్రీ తర్వాత యువతరంపై ఎక్కువ ముద్ర పడిన కవిగా పేరు పొందిన ఆరుద్ర అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త మరియు విమర్శకుడు.ఈయన భార్య కె.రామలక్ష్మి కూడా ప్రముఖ తెలుగు రచయిత్రి.
లేబుళ్లు:
Modern Literature,
Natakam
14 జనవరి, 2016
మనుచరిత్ర (సవ్యాఖ్యానము) Manu Charitra
అల్లసాని పెద్దన రచించిన మనుచరిత్ర తెలుగులో వెలువడిన మొట్టమొదటి ప్రబంధము. ఈ రచనతోటే అల్లసానివానికి ఆంధ్రకవితాపితామహుడనే పేరు వచ్చింది. ఈ పుస్తకాన్ని సవ్యాఖ్యానంగా మీకు అందించడం తెలుగు పరిశోధన కు సంతోషం.
లేబుళ్లు:
Kavya-Prabandham,
Telugu Classic literature
13 జనవరి, 2016
మహాభారత సంబంధ ప్రవచనాలు,గ్రంథాలు,సినిమాలు Information about Mahabharatha
తెలుగు వారికి భాషా సాహిత్య ధార్మిక రంగాల్లో సేవ చేయాలనే సత్సంకల్పంతో పని చేస్తున్న సాయి సేవకులు ఈసారి మహాభారత సంబంధ సమాచారాన్ని (పుస్తకాలు,ప్రవచనాలు,సినిమాలు) ఒకే దగ్గర అందించే ప్రయత్నం చేస్తున్నారు. వారి సేవ తెలుగు వారందరికీ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు ప్రకటిస్తున్న తెలుగుపరిశోధన ఈ సందేశాన్ని కూడా మీకు అందిస్తుంది. దీనిని వినియోగించుకొని తెలుగువారు ఆనందింతురు గాక!
లేబుళ్లు:
Bharatam,
Kavitrayam
12 జనవరి, 2016
పాండురంగ మాహాత్మ్యం (సవ్యాఖ్యానం) Panduranga Mahatmyam Tenali Ramakrishna Kavi
లేబుళ్లు:
Kavya-Prabandham,
Telugu Classic literature
01 జనవరి, 2016
శ్రీవిద్యా సారథి ( శ్రీవిద్యా గ్రంథాలు) Shri Vidya Granthas
క్రోవి పార్థ సారథి గారి సంపాదకత్వంలో వెలువడిన శ్రీవిద్యా గ్రంథాలన్నీ ఒకే చోట వారి వెబ్ సైట్ శ్రీవిద్యా సారథి లో లభిస్తున్నాయి. వాటిని తెలుగు పరిశోధన పాఠకులు ఈ కింది లంకెలో పొందవచ్చు.
లేబుళ్లు:
Spirutual
శబ్దార్థ చంద్రిక (నిఘంటువు) Shabda Artha Chandrika (Telugu-Telugu Dictionary)
గతంలో ఎన్నో తెలుగు - తెలుగు నిఘంటువులను అందించిన తెలుగు పరిశోధన మరొక తెలుగు నిఘంటువును మీ ముందుకు తెస్తున్నది. అదే శబ్దార్థ చంద్రిక. ఈ నిఘంటువును దిగుమతి చేసుకుని, మీ అవసరాలకు ఉపయోగించుకోగలరు.
లేబుళ్లు:
Dictionary,
Telugu Dictionary
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లు (Atom)

