ఇటీవల నవీకరించిన టపాలు
01 April, 2020
గోదావరి జిల్లాలు - సాహిత్య సంస్థలు ద్వా నా శాస్త్రి Godavari Jillalu - Sahitya Samsthalu D N Shastri
లేబుళ్లు:
Ph.D.,
Telugu,
ద్వా నా శాస్త్రి
17 March, 2020
మహా భారత కథలు Mahabharatha Kathalu
మహా భారత కథలు
కాటమరాజుగడ్డ రామచంద్రరావు
Mahabharatha Kathalu
katamarajugadda Ramachandra Rao
తెలుగు వారికి అత్యంతపౄతి పాత్రమైనది భారతం. 'తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి" అనే సామెతకూడా ఉంది. అందుకే నన్నయ మొదటగా భారతాన్ని రాశాడు.
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి కథలు Sripada Subrahmanya Shastry Kathalu
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి కథలు
Sripada Subrahmanya Shastry Kathalu
సుబ్రహ్మణ్య శాస్రి 75 కథలు రాసారు. ఈయన కథలలో విషయాన్ని ప్రణయం, సంఘసంస్కారం, ప్రబోధం, కుటుంబజీవితం, అపరాధ పరిశోధనం, భాషావివాదాత్మకం, అవహేళనాత్మకం, చారిత్రకం అనే విషయాలుగా విభజించచ్చు. ఇవేకాక శ్రీపాద అనేక పద్య రచనలు, నవలలు,నాటకాలు,అనువాదాలు, వైద్య గ్రంథాలు కూడా రాసారు.
12 January, 2020
సాహిత్య పదకోశము Sahithya pada koshamu
సాహిత్య పదకోశము
Sahithya pada koshamu
ఎన్నో ఏళ్ళక్రితం ప్రచురితమైన పుస్తకం ఇది. సాహిత్య విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ విధమైన సాహిత్యపదకోశాలు హిందిలో ఉన్నా తెలుగులో లేదనే లోటు లేకుండా తెలుగుఅకాడమీ వారు ప్రచురించారు చాలానాళ్ళక్రితం. అదృష్టవశాత్తు నాకు ఈ మధ్య తారసపడింది. ఈ పుస్తకంకోసం ఎన్నాళ్లనుండో తాపత్రయపడుతున్నాను. కానీ, దొరకడం లేదు. నేను గతంలో కొనుక్కున్న మూడు ప్రతులూ సాహితీపిపాసుకులైన మిత్రులెవరికో ఇచ్చాను. ఏమయితేనేం ఈ విధంగానైనా మనకు లభించేట్టు చేసిన ఆ అజ్ఞాత'ఈ'పుస్తకదాతకు శతకోటి నమస్కారాలు.
ఈ పుసకంలో సాహిత్య,నాటక,అలంకార విభాగాల్లో సాహిత్యశాస్త్ర పారిభాషికపదాలన్నీ అకారాదిక్రమంలో ఉన్నాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు .... ఈ పుస్తకాన్ని పొంది, ఆనందించాలని మా కోరిక.
దిగుమతి కొరకు లంకె .......
- పై నొక్కండి.
ఈ టపాను మీ సాంఘికసంపర్కజాలంలో పంచుకొండి. ఇంకొందరికీ ఈ టపా ఉపయోగ పడుతుంది, మీరూ వారికి మేలు చేసినవారవుతారు. మీ రా పని చేస్తారనే నమ్మకంతో ముందుగానే ధన్యవాదాలు.
లేబుళ్లు:
Dictionary,
Telugu Classic literature,
కోశం,
సాహిత్యం
15 December, 2019
సమగ్ర ఆంధ్ర సాహిత్యం - Samagra Andhra Sahithyam ఆరుద్ర Arudra
సమగ్ర ఆంధ్ర సాహిత్యం - Samagra Andhra Sahithyam
ఆరుద్ర Arudra
గతంలో ఆరుద్ర రచనలు, ఆరుద్ర నాటికలు పేరిట అంతర్జాలంలో లభిస్తున్న ఆరుద్రగారి రచనలను అందిచే ప్రయత్నం చేసింది తెలుగుపరిశోధన.
తెలుగు భాషాసాహితీ ప్రేమికులకు అపురూప గ్రంథాలను అందించే ప్రయత్నం నిరంతరం చేసే తెలుగుపరిశోధన గతంలో తెలుగు సాహిత్య చరిత్రకు సంబంధించిన గ్రంథాలను అందించే ప్రయత్నం చేసింది. అవి -
- వీరేశలింగం పంతులు - కవుల చరిత్ర
- కాశీనాథుని నాగేశ్వర్ రావు - ఆంధ్రవాఙ్మయ చరిత్ర
- దివాకర్ల వేంకటావధాని - ఆంధ్ర వాఙ్మయ చరిత్ర
- పింగళి లక్ష్మీకాంతం - ఆంధ్ర సాహిత్య చరిత్ర
ఇప్పుడు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఆరుద్రగారి అపురూప పరిశోధనాత్మక రచన ఈ సమగ్రాంధ్ర సాహిత్య గ్రంథాన్ని మీ ముందుకు తెస్తున్నాం. ఎప్పటిలాగానే ఈ గ్రంథాన్నీ ఆదరిస్తారని ఆశిస్తున్నాము.
ఈ గ్రంథాన్ని దిగుమతి చేసుకోవడానికి ........
లంకె పై నొక్కండి.
ఈ టపాను మీ సాంఘికసంపర్కజాలంలో పంచుకొండి. ఇంకొందరికీ ఈ టపా ఉపయోగ పడుతుంది, మీరూ వారికి మేలు చేసినవారవుతారు. మీ రా పని చేస్తారనే నమ్మకంతో ముందుగానే ధన్యవాదాలు.
లేబుళ్లు:
Andhra,
Arudra,
Sahityam,
samagra Andhra Sahityam,
Telugu
21 November, 2019
తేనెపలుకుల అన్నమయ్య - డా.దేవగుప్తాపు సూర్యగణపతి రావు TenePalukula Annamayya - Dr.Devaguptapu SuryaGanapathi Rao
తేనెపలుకుల అన్నమయ్య - డా.దేవగుప్తాపు సూర్యగణపతి రావు TenePalukula Annamayya - Dr.Devaguptapu SuryaGanapathi Rao
`తెలుగుపరిశోధన'ను అలమేలుమంగా సమేతుడైన శ్రీవేంకటేశ్వర స్వామి వారు అనుగ్రహించదలచారు. అందుకే తనకు ఇష్టమైన అన్నమయ్యకీర్తనలనే తేనెల గంగాప్రవాహాన్ని దేవగుప్తాపు సూర్యగణపతి రావు గారనే భగీరథుని వెంట ఇక్కడినుండి ప్రవహింపజేయ సంకల్పించారు.
"తెలుగును తెలియాలంటే అన్నమయ్యను చదివి తీరాల్సిందే" అన్న రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారి పలుకులను ఈ సందర్భంగా మనం గుర్తుతెచ్చుకోవాలి. ఒక రెండు నిమిషాలపాటు అన్యదేశ్యాలు లేని తెలుగు మాట్లాడడం ఎంతో కష్టమైన ఈ రోజుల్లో, పనిగట్టుకొని దేశభాషాసంస్కృతులను రూపుమాపే ప్రయత్నాలు జరుగుతున్న రోజుల్లో, ఒక్కసారి తేనెలూరే తేటతెనుగును మనం అర్థం చేసుకునేందుకు సహకరిస్తున్న డా.దేవగుప్తాపు సూర్యగణపతి రావు గారికి కృతజ్ఞతాభివందనాలు.
డాక్టరుగారు వృత్తిరీత్యా రేడియాలజిష్టు. ప్రవృత్తిరీత్యా వ్యాఖ్యాత. వారి దృష్టి సామాన్యుల దృష్టికంటే భిన్నమైనదనేది గతంలో 'పాండురంగమాహాత్మ్యం'కు వారి రసజ్ఞవ్యాఖ్య నిరూపించింది. ఇప్పుడు అన్నమయ్య పలుకుబళ్ళను మనకు పరిచయంచేస్తున్నారు. వారి వ్యాఖ్య లేకుంటే పాండురంగవిభుని పదగుంభనంకాని, ఈ 'తేనెపలుకుల అన్నమయ్య' వ్యాఖ్య లేకుంటే, తెలుగుభాషను మరిచే ప్రయత్నం చేస్తున్న మనకు, అన్నమయ్య అచ్చమైన తెలుగుకాని, జాతీయాలు కాని అర్థంకావడం కష్టమేనేమో!
అలనాడు వేంకటేశ్వర స్వామి జగన్మోహినిగా దేవతలకు సముద్రాన్ని చిలుకగా వెలువడిన అమృతం పంచిపెడితే, నేడు సూర్యగణపతులవారు అన్నమయ్య కీర్తనా సముద్రాన్ని చిలుకగా వచ్చిన తెలుగుభాషామృతాన్ని తెలుగుభాషాభిమానులకు అందిస్తున్నారు.
మీరిక్కడే చదువదలిస్తే ........
మీరెక్కడైనా, ఎప్పుడైనా చదువుకుందామని పుస్తకాన్ని పొందగోరితే ........
పై నొక్కండి.
ఈ టపాను మీ సాంఘికసంపర్కజాలంలో పంచుకొండి. ఇంకొందరికీ ఈ టపా ఉపయోగ పడుతుంది, మీరూ వారికి మేలు చేసినవారవుతారు. మీ రా పని చేస్తారనే నమ్మకంతో ముందుగానే ధన్యవాదాలు.
`తెలుగుపరిశోధన'ను అలమేలుమంగా సమేతుడైన శ్రీవేంకటేశ్వర స్వామి వారు అనుగ్రహించదలచారు. అందుకే తనకు ఇష్టమైన అన్నమయ్యకీర్తనలనే తేనెల గంగాప్రవాహాన్ని దేవగుప్తాపు సూర్యగణపతి రావు గారనే భగీరథుని వెంట ఇక్కడినుండి ప్రవహింపజేయ సంకల్పించారు.
"తెలుగును తెలియాలంటే అన్నమయ్యను చదివి తీరాల్సిందే" అన్న రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారి పలుకులను ఈ సందర్భంగా మనం గుర్తుతెచ్చుకోవాలి. ఒక రెండు నిమిషాలపాటు అన్యదేశ్యాలు లేని తెలుగు మాట్లాడడం ఎంతో కష్టమైన ఈ రోజుల్లో, పనిగట్టుకొని దేశభాషాసంస్కృతులను రూపుమాపే ప్రయత్నాలు జరుగుతున్న రోజుల్లో, ఒక్కసారి తేనెలూరే తేటతెనుగును మనం అర్థం చేసుకునేందుకు సహకరిస్తున్న డా.దేవగుప్తాపు సూర్యగణపతి రావు గారికి కృతజ్ఞతాభివందనాలు.
డాక్టరుగారు వృత్తిరీత్యా రేడియాలజిష్టు. ప్రవృత్తిరీత్యా వ్యాఖ్యాత. వారి దృష్టి సామాన్యుల దృష్టికంటే భిన్నమైనదనేది గతంలో 'పాండురంగమాహాత్మ్యం'కు వారి రసజ్ఞవ్యాఖ్య నిరూపించింది. ఇప్పుడు అన్నమయ్య పలుకుబళ్ళను మనకు పరిచయంచేస్తున్నారు. వారి వ్యాఖ్య లేకుంటే పాండురంగవిభుని పదగుంభనంకాని, ఈ 'తేనెపలుకుల అన్నమయ్య' వ్యాఖ్య లేకుంటే, తెలుగుభాషను మరిచే ప్రయత్నం చేస్తున్న మనకు, అన్నమయ్య అచ్చమైన తెలుగుకాని, జాతీయాలు కాని అర్థంకావడం కష్టమేనేమో!
అలనాడు వేంకటేశ్వర స్వామి జగన్మోహినిగా దేవతలకు సముద్రాన్ని చిలుకగా వెలువడిన అమృతం పంచిపెడితే, నేడు సూర్యగణపతులవారు అన్నమయ్య కీర్తనా సముద్రాన్ని చిలుకగా వచ్చిన తెలుగుభాషామృతాన్ని తెలుగుభాషాభిమానులకు అందిస్తున్నారు.
మీరిక్కడే చదువదలిస్తే ........
తేనె పలుకుల అన్నమయ్య by Dr.Pandu Ranga Sharma Ramaka on Scribd
మీరెక్కడైనా, ఎప్పుడైనా చదువుకుందామని పుస్తకాన్ని పొందగోరితే ........
ఈ టపాను మీ సాంఘికసంపర్కజాలంలో పంచుకొండి. ఇంకొందరికీ ఈ టపా ఉపయోగ పడుతుంది, మీరూ వారికి మేలు చేసినవారవుతారు. మీ రా పని చేస్తారనే నమ్మకంతో ముందుగానే ధన్యవాదాలు.
లేబుళ్లు:
Annamayya,
Surya Ganapathi
09 September, 2019
శ్రీశ్రీ రచనలు SriSri Rachanalu
శ్రీశ్రీ రచనలు
SriSri Rachanalu
శ్రీశ్రీ
శ్రీశ్రీ గురించి తెలుగువాడికి పరిచయం చేయబూనడం హాస్యాస్పదం కాబట్టి అటువంటి సాహసానికి ఒడిగట్టను. కాని, ఒక్కటి మాత్రమ్ ఒప్పుకోక తప్పదు -
ఇన్నాళ్ళూ వారి రచనలు ఈ తెలుగుపరిశోధనలో చేరకపోవడం పెద్ద పొరపాటే(తప్పే?)" అని. ఏమయితేనేం ఇన్నాళ్ళకైనా తెలిసి వచ్చింది, సంతోషం.అంతర్జాలంలో లభించే శ్రీశ్రీ రచనలను అందించే ప్రయత్న మిది. కొన్ని రచనలు తెలుగు వికీసోర్స్ లో కూడా లభిస్తున్నాయి.
మీకు కావాల్సిన పుస్తకం పేరుపై నొక్కండి. దిగుమతి పుటకు వెళతారు.
- మహా ప్రస్థానం
- మహా ప్రపంచం
- మరో ప్రపంచం
- ఖడ్గ సృష్టి
- ప్రభవ
- అనంతం (ఆత్మకథ-నవల)
- సంపెంగ తోట
- అమ్మా (అనువాద నాటికలు)
- పాడవోయి భారతీయుడా (సినిమా పాటలు)
- విశాలాంధ్రలో ప్రజా రాజ్యం
- అగ్నిజ్వాల,ఉక్కు పిడికిలి (సినిమా పాటలు)
ఈ టపాను మీ సాంఘికసంపర్కజాలంలో పంచుకొండి. ఇంకొందరికీ ఈ టపా ఉపయోగ పడుతుంది, మీరూ వారికి మేలు చేసినవారవుతారు. మీ రా పని చేస్తారనే నమ్మకంతో ముందుగానే ధన్యవాదాలు.
లేబుళ్లు:
ఖడ్గ సృష్టి,
మహా ప్రస్థానం,
శ్రీశ్రీ
02 September, 2019
బాల బోధిని ( 3 భాగాలు) కాశీ కృష్ణాచార్యులు Balabodhini (3 Parts)
బాల బోధిని ( 3 భాగాలు) కాశీ కృష్ణాచార్యులు Balabodhini (3 Parts)Kasi Krishnacharyulu
తెలుగు వారికి సంస్కృతం నేర్చుకోవాలనే కోరిక పుడితే, ఏ గురువు లేకున్నా స్వయంగా పాఠాలు చదువుకుని, సంస్కృతం మాట్లాడవచ్చు - ఈ బాలబోధినీ మూడు భాగాలు నేరిస్తే. దానికి గాను కాశీ కృష్ణాచార్యులుగారు వేసుకున్న ప్రణాళిక ఎంత అద్భుతంగా ఉందో చదివినవారికే తెలుస్తుంది.
ఈ బాలబోధినీ అంతర్జాలంలో దొరకడం ఎంతో అపురూపం. మార్కెట్టులోనూ దొరుకుతున్నట్లుంది. ప్రతులు చెల్లక ముందే, మీ ప్రతిని భద్రపర్చుకొండి. తర్వాతి తరాలకు మనం అందించే గొప్ప కానుక.
దిగుమతికోసం .........
- బాల బోధిని - ప్రథమ భాగం (అన్ని పుటలు కలిగినది)
- బాల బోధిని - ద్వితీయభాగం
- బాల బోధిని - తృతీయభాగం
.............. లపై నొక్కండి.
ఈ టపాను మీ సాంఘికసంపర్కజాలంలో పంచుకొండి. ఇంకొందరికీ ఈ టపా ఉపయోగ పడుతుంది, మీరూ వారికి మేలు చేసినవారవుతారు. మీ రా పని చేస్తారనే నమ్మకంతో ముందుగానే ధన్యవాదాలు.
లేబుళ్లు:
Bala bodhini,
Kashi Krishnacharya,
Sanskrit
Subscribe to:
Posts (Atom)