ఆర్కైవ్ లో (DLL వారివి) కొన్ని నవలలు కన్పించినాయి. వాటిని అందుబాటులోకి తెస్తే ఔత్సాహికులైన పాఠకులకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఇక్కడ సాధ్యమైనవాటిని అందిస్తున్నాము.
తెలుగులో వెలువడిన వివిధ ప్రక్రియలపై గతంలో ప్రపంచమహాసభల వేళలో అప్పటి ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ వారు చిన్న చిన్న పుస్తకాలు వెలువరించారు. అటువంటివి పరిశోధకులకు, పరీక్షార్థులకు ఉపయోగకరమని, అంతర్జాలంలో లభించినవాటిని ఒక్కదగ్గర సంగ్రహిస్తున్నాము.
తెలుగులో చతుర్విధ కవిత్వాల్లో చిత్రకవిత్వం ఒకటి. ఇది నన్నె చోడుని కాలంనుండే తెలుగులో ఉన్నా, సంస్కృతంనుండి మనకు వచ్చిందని చెప్పడానికి సందేహం లేదు. ఎందరో కవులు చిత్రకవిత్వంలో పరిశ్రమ చేసారు
జాతక కథలు భారతదేశంలో ప్రాచుర్యం పొందిన బుద్ధుని పూర్వ జన్మల గురించిన జానపద కథల సమాహారం. క్రీ.పూ 300 — క్రీ.శ 400 మధ్యలో రచించబడినట్టుగా చెప్పబడుతున్న ఈ కథలన్నీ పాళీ భాషలో లభ్యమయ్యాయి. తరువాత అనేక భాషల్లోకి తర్జుమా చేయబడ్డాయి. వీటి సంఖ్య సుమారుగా 550-600 మధ్యలో ఉంటుంది.
ప్రముఖ భాషాశాస్త్ర పండితులు, ఆచార్య రవ్వా శ్రీహరి గారు తమ Ph.D. పట్టంకొరకు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సమర్పించిన సిద్ధాంతగ్రంథం అంతర్జాలంలో లభించింది.
తెలుగు సాహిత్యంలో గురజాడది ప్రత్యేకస్థానం. ఆయన ఆధునిక కవిత్వానికి యుగకర్త. వ్యావహారిక భాషను రచనల్లో వాడి, దానికీ పుస్తకభాషా స్థాయిని కల్పించిన మహనీయుడు.
తెలుగులో వెలువడిన జానపదగేయ వాఙ్మయాన్ని మథించి, అందులో ప్రస్తావించిన గాథలు, ఆచారాలు, సంస్కృతి మొదలైనవానిగురించి సమగ్రంగా పరిశోధించి అందించారు ఆచార్య నాయని కృష్ణకుమారిగారు.
ఆచార్య బిరుదరాజు రామరాజు గారు పరిశోధించి, వ్రాసిన సిద్ధాంతగ్రంథం ఈ తెలుగు జానపద గేయ సాహిత్యము. ఇది ఉస్మానియా విశ్వైద్యాలయం తెలుగు విభాగంలో సమర్పించబడిన మొదటి పరిశోధనాగ్రంథం. అంతే కాకుండా జానపదగేయ సాహిత్యంలో వెలువడిన మొదటి పరిశోధనాగ్రంథం. ఇది తరువాత వెలువడిన ఎన్నో పరిశోధనాగ్రంథాలకు ఆకరం.
చిలకమర్తి లక్ష్మీనరసింహం రచనలు Chilakamarthi Lakshmi Narasiamham Rachanalu
కవిగా, నవలా రచయితగా, నాటక రచయితగా, సంఘసంస్కర్తగా పేరుపొందిన చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు చేసిన అనేక రచనల్లో అంతర్జాలంలో లభిస్తున్న వాటిని సేకరించి, మీ ముందుకు తెస్తున్నాం. ఈ పుస్తకాలను దిగుఅమతి చేసుకుని, చదివి, ఆనందించండి.