03 ఏప్రిల్, 2020

పానుగంటి లక్ష్మీ నరసింహారావు రచనలు Panuganti Lakshmi Narsimha Rao Rachanalu

పానుగంటి లక్ష్మీ నరసింహారావు రచనలు Panuganti Lakshmi Narsimha Rao Rachanalu




సాక్షి వ్యాసాలగురించి తెలువని తెలుగు వాడిలో తెలుగుదనం లోపించిందని అనుకోవాలి. అటువంటి వాటి సృష్టికర్త  పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారి రచనలను అంతర్జాలంలో లభిస్తున్నవాటిని మీ అందరికీ అందుబాటులోకి తేవాలనే మా ప్రయత్నం సఫలం కావాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.

01 ఏప్రిల్, 2020

గోదావరి జిల్లాలు - సాహిత్య సంస్థలు ద్వా నా శాస్త్రి Godavari Jillalu - Sahitya Samsthalu D N Shastri


 గోదావరి జిల్లాలు - సాహిత్య సంస్థలు  ద్వా నా శాస్త్రి  Godavari Jillalu - Sahitya Samsthalu  D N Shastri


ద్వా నా శాస్త్రి


ప్రముఖ పండితుడు ద్వాదశి నాగేశ్వర శాస్త్రి గారి గురించి వినని సాహిత్య ప్రేమికులుండరు. 

17 మార్చి, 2020

మహా భారత కథలు Mahabharatha Kathalu


మహా భారత కథలు 
కాటమరాజుగడ్డ రామచంద్రరావు
 Mahabharatha Kathalu 
katamarajugadda Ramachandra Rao


తెలుగు వారికి అత్యంతపౄతి పాత్రమైనది భారతం. 'తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి" అనే సామెతకూడా ఉంది. అందుకే నన్నయ మొదటగా భారతాన్ని రాశాడు. 

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి కథలు Sripada Subrahmanya Shastry Kathalu

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి కథలు
 Sripada Subrahmanya Shastry Kathalu



సుబ్రహ్మణ్య శాస్రి 75 కథలు రాసారు. ఈయన కథలలో విషయాన్ని ప్రణయం, సంఘసంస్కారం, ప్రబోధం, కుటుంబజీవితం, అపరాధ పరిశోధనం, భాషావివాదాత్మకం, అవహేళనాత్మకం, చారిత్రకం అనే విషయాలుగా విభజించచ్చు. ఇవేకాక శ్రీపాద అనేక పద్య రచనలు, నవలలు,నాటకాలు,అనువాదాలు, వైద్య గ్రంథాలు కూడా రాసారు.

12 జనవరి, 2020

సాహిత్య పదకోశము Sahithya pada koshamu


సాహిత్య పదకోశము
 Sahithya pada koshamu



న్నో ఏళ్ళక్రితం ప్రచురితమైన పుస్తకం ఇది. సాహిత్య విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ విధమైన సాహిత్యపదకోశాలు హిందిలో ఉన్నా తెలుగులో లేదనే లోటు లేకుండా తెలుగుఅకాడమీ వారు ప్రచురించారు చాలానాళ్ళక్రితం. అదృష్టవశాత్తు నాకు ఈ మధ్య తారసపడింది. ఈ పుస్తకంకోసం ఎన్నాళ్లనుండో తాపత్రయపడుతున్నాను. కానీ, దొరకడం లేదు. నేను గతంలో కొనుక్కున్న మూడు ప్రతులూ సాహితీపిపాసుకులైన మిత్రులెవరికో ఇచ్చాను. ఏమయితేనేం ఈ విధంగానైనా మనకు లభించేట్టు చేసిన ఆ అజ్ఞాత'ఈ'పుస్తకదాతకు శతకోటి నమస్కారాలు.

ఈ పుసకంలో సాహిత్య,నాటక,అలంకార విభాగాల్లో సాహిత్యశాస్త్ర పారిభాషికపదాలన్నీ అకారాదిక్రమంలో ఉన్నాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు .... ఈ పుస్తకాన్ని పొంది, ఆనందించాలని మా కోరిక.




దిగుమతి కొరకు లంకె .......



- పై నొక్కండి.








ఈ టపాను మీ సాంఘికసంపర్కజాలంలో పంచుకొండి. ఇంకొందరికీ ఈ టపా ఉపయోగ పడుతుంది, మీరూ వారికి మేలు చేసినవారవుతారు. మీ రా పని చేస్తారనే నమ్మకంతో ముందుగానే ధన్యవాదాలు.

15 డిసెంబర్, 2019

సమగ్ర ఆంధ్ర సాహిత్యం - Samagra Andhra Sahithyam ఆరుద్ర Arudra

సమగ్ర ఆంధ్ర సాహిత్యం - Samagra Andhra Sahithyam  
ఆరుద్ర Arudra

 


   గతంలో  ఆరుద్ర రచనలు, ఆరుద్ర నాటికలు పేరిట అంతర్జాలంలో లభిస్తున్న ఆరుద్రగారి రచనలను అందిచే ప్రయత్నం చేసింది తెలుగుపరిశోధన.  
    
'ఆరుద్ర'  ఆరోగ్యాన్ని హరించిన 'సమగ్ర ఆంధ్ర సాహిత్యం'

సమగ్ర ఆంధ్ర సాహిత్యం కోసం 
ఆరుద్ర తన  ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా  శ్రమించారు.
మనకు తెలియని మన తెలుగు సాహిత్య చరిత్రను  ఇదిగో ఇట్లా మన చేతుల్లో  అపురూపంగా పెట్టి తన దారిన తాను వెళ్లి పోయిన  దార్శనికుడు ఆరుద్ర.  
తాను విపరీతంగా సేకరించిన  కట్టల కట్టల,  గుట్టల గుట్టల  పాత పుస్తకాలు, సంచికలు,  రాసుకున్న నోటు పుస్తకాలు, తదితర సరంజామా... అంతా కలిసి  'డస్ట్ ఎలర్జీ 'గా మారి  ఆరుద్ర  ప్రాణానికి ప్రమాదం గా మారాయి. కంటి చూపు కూడా  దాదాపు సన్నగిల్లింది .ఇదే విషయాన్ని వారు సమగ్ర ఆంధ్ర సాహిత్యం మొదటి సంపుటికి రాసిన ముందు  మాట లో స్పష్టంగా   రాశారు.

 '1965 జనవరి నెల నుండి సమగ్ర ఆంధ్ర సాహిత్యం సంపుటాల రచనకు ఉపక్రమించాను. సమగ్రత దెబ్బ తినకూడదని సంపుటాల సంఖ్యను పెంచి అదనపు యుగాలను, ఉపయుగాలను,  చేర్చవలసి వచ్చింది. 1965 ఏప్రిల్ నెల నుండి నవంబర్ నెల దాకా ఎనిమిది నెలలు క్రమం తప్పకుండా ఆసాంతం రచన చేసి  సమగ్ర ఆంధ్ర సాహిత్యం సంపుటాలను అచ్చు ఇవ్వడంతో నా ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్నది. టెన్షన్ వల్ల రావలసిన రుగ్మతలు వచ్చాయి. గత సంవత్సరం నా రెండు కళ్ళ   ఆపరేషన్  జరగడం వల్ల  గ్రంథరచన కార్యక్రమానికి వీలు కలిగింది' 

నిజానికి,సమగ్ర ఆంధ్ర సాహిత్యం  అనేది  ఏదైనా ఒక పెద్ద యూనివర్సిటీ  పూనుకొని చిత్తశుద్ధితో చేయవలసిన పని. కానీ దాన్ని ఒక వ్యక్తి శక్తిగా మారి  తయారుచేయడం అంటే మాటలు కాదు.సమగ్ర సాహిత్య చరిత్రను ఒక చోటికి చేర్చడానికి పగలూ రాత్రీ కష్టపడ్డారు.ఒక సాహితీ యజ్ఞమ్ చేసారు.ఈ రోజుకు కూడా మనకు  ఎవరో ఒక తెలుగు సాహిత్య కారుడి గురించి తెలుసుకోవాలంటే కూడా మనం ముందు చేతికి 'సమగ్ర ఆంధ్ర సాహిత్య చరిత్ర' అందుకోక తప్పదు.నిజమైన పరిశోధన అంటే అదే.దటీజ్ ఆరుద్ర ! 

తెలుగు  ఒక సబ్జెక్టుగా స్వీకరించి  పోటీ  పరీక్షలు రాసి  ఉద్యోగాలు పొందిన వారు కావచ్చు,  ఇప్పుడు ఇంకా ప్రిపేర్ అవుతున్న వారు కావచ్చు,  తెలుగు అధ్యాపక,  ఉపాధ్యాయ  ఉద్యోగాల్లో ఉన్నవారు కావచ్చు... అందరి మొదటి చూపు 'సమగ్ర ఆంధ్ర సాహిత్యం' పైనే ఉంటుంది. అది ఒక అక్షయ పాత్ర. 

సమగ్ర ఆంధ్ర సాహిత్యం- సంపుటాలు;
పూర్వ యుగము, చాళుక్య చోళ కాలము - (800-1200)
 కాకతీయుల కాలము (1200-1290)
పద్మనాయకుల కాలము (1337-1399)
రెడ్డిరాజుల కాలము (1400 - 1450)
రాయల ప్రాంభ కాలము (1450 - 1500)
రాయల అనంతర కాలము (1500 - 1550)
నవాబుల కాలము (1550 - 1600)
నాయకుల కాలము (1600 - 1670)
అనంతర నాయకుల కాలము (1670 - 1750)
కంపెనీ కాలము (1750-1850)
జమీందారుల కాలము (1850 - 1900)
ఆధునిక కాలము (1900 తరువాత)
#మనమిప్పుడు ఏమి చెయ్యాలి ? మన తెలుగు సాహిత్య చరిత్రను భావితరాల వారికి, మన పిల్లలకు చెప్పడానికి , గుర్తు చెయ్యడానికి తప్పనిసరిగా  'సమగ్ర ఆంధ్ర సాహిత్య చరిత్ర'
ను మీ ఇంట్లో ఉండేలా చూసుకోండి. అది తెలుగు వారి సాహిత్య సంపద. తెలుగు సాహిత్య బంగారు కలశం. మన తెలుగు అక్షర సారధుల సామ్రాజ్యం.
ఈ తెలుగు నేల పైన తెలుగు అక్షరం ప్రసాదించిన వెలుగు.
'సమగ్ర ఆంధ్ర సాహిత్య చరిత్ర'.

ఒక సాహిత్య కారుడు  తన ఆరోగ్యాన్ని అర్పించి ఒక తపస్సులా  తెలుగు సాహిత్య సేకరణ ఎలా చేసాడో ఆ సంపుటాలను చూస్తే మీకు మన 'తెలుగు సాహిత్య వైభవం' కళ్ళముందు కదలాడుతుంది.
ఈ సంపుటాలు ఉన్నంతకాలం తెలుగువారి సాహిత్య విజయ బావుటా లోకానికి చాటి చెప్తూనే ఉంటుంది. మనం  నడిచివచ్చిన కాలాన్ని గుర్తు చేస్తూనే ఉంటుంది. మన  తెలుగు మూలాలు,  వేర్లు ఎంత  శక్తివంతమైన, బలమైన ,  దృఢమైన  నేపథ్యాన్ని  పటిష్టంగా కలిగిఉన్నాయో, అట్లా  దేదీప్యమానంగా  గుర్తు చేస్తూనే ఉంటుంది.
ఏమి ఆశించి చేస్తారు  మహానుభావులు ఇంతటి గొప్ప పనులు? అందుకే వారు చరిత్ర పేజీల్లో  నిలిచిపోయిన సాహిత్య నిర్మాతలు!

తెలుగు వారి సాహిత్య చరిత్రను  సమగ్రంగా సేకరించి,  సంస్కరించి,   పరిష్కరించి భద్రపరిచి  ఇలా  మనకు కానుకగా అందించిన మహనీయుడు,  నిజమైన  సాహిత్యకారుడు ఆరుద్ర.  వారికి అక్షర నివాళి.


    తెలుగు భాషాసాహితీ ప్రేమికులకు అపురూప గ్రంథాలను అందించే ప్రయత్నం నిరంతరం చేసే తెలుగుపరిశోధన గతంలో తెలుగు సాహిత్య చరిత్రకు సంబంధించిన గ్రంథాలను అందించే ప్రయత్నం చేసింది. అవి -
  1. వీరేశలింగం పంతులు - కవుల చరిత్ర
  2. కాశీనాథుని నాగేశ్వర్ రావు - ఆంధ్రవాఙ్మయ చరిత్ర
  3. దివాకర్ల వేంకటావధాని - ఆంధ్ర వాఙ్మయ చరిత్ర
  4. పింగళి లక్ష్మీకాంతం - ఆంధ్ర సాహిత్య చరిత్ర

ఇప్పుడు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఆరుద్రగారి అపురూప పరిశోధనాత్మక రచన ఈ సమగ్రాంధ్ర సాహిత్య గ్రంథాన్ని మీ ముందుకు తెస్తున్నాం. ఎప్పటిలాగానే ఈ గ్రంథాన్నీ ఆదరిస్తారని ఆశిస్తున్నాము.

ఈ గ్రంథాన్ని దిగుమతి చేసుకోవడానికి ........




   లంకె పై నొక్కండి.


ఈ టపాను మీ సాంఘికసంపర్కజాలంలో పంచుకొండి. ఇంకొందరికీ ఈ టపా ఉపయోగ పడుతుంది, మీరూ వారికి మేలు చేసినవారవుతారు. మీ రా పని చేస్తారనే నమ్మకంతో ముందుగానే ధన్యవాదాలు.

21 నవంబర్, 2019

తేనెపలుకుల అన్నమయ్య - డా.దేవగుప్తాపు సూర్యగణపతి రావు TenePalukula Annamayya - Dr.Devaguptapu SuryaGanapathi Rao

తేనెపలుకుల అన్నమయ్య - డా.దేవగుప్తాపు సూర్యగణపతి రావు TenePalukula Annamayya - Dr.Devaguptapu SuryaGanapathi Rao





  `తెలుగుపరిశోధన'ను అలమేలుమంగా సమేతుడైన శ్రీవేంకటేశ్వర స్వామి వారు అనుగ్రహించదలచారు. అందుకే తనకు ఇష్టమైన అన్నమయ్యకీర్తనలనే తేనెల గంగాప్రవాహాన్ని దేవగుప్తాపు సూర్యగణపతి రావు గారనే భగీరథుని వెంట ఇక్కడినుండి ప్రవహింపజేయ సంకల్పించారు.

"తెలుగును తెలియాలంటే అన్నమయ్యను చదివి తీరాల్సిందే" అన్న రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారి పలుకులను ఈ సందర్భంగా మనం గుర్తుతెచ్చుకోవాలి.  ఒక రెండు నిమిషాలపాటు అన్యదేశ్యాలు లేని తెలుగు మాట్లాడడం ఎంతో కష్టమైన ఈ రోజుల్లో, పనిగట్టుకొని  దేశభాషాసంస్కృతులను రూపుమాపే ప్రయత్నాలు జరుగుతున్న రోజుల్లో, ఒక్కసారి తేనెలూరే తేటతెనుగును మనం అర్థం చేసుకునేందుకు సహకరిస్తున్న డా.దేవగుప్తాపు సూర్యగణపతి రావు గారికి కృతజ్ఞతాభివందనాలు.

డాక్టరుగారు వృత్తిరీత్యా రేడియాలజిష్టు. ప్రవృత్తిరీత్యా వ్యాఖ్యాత. వారి దృష్టి సామాన్యుల దృష్టికంటే భిన్నమైనదనేది గతంలో 'పాండురంగమాహాత్మ్యం'కు వారి రసజ్ఞవ్యాఖ్య నిరూపించింది. ఇప్పుడు అన్నమయ్య పలుకుబళ్ళను మనకు పరిచయంచేస్తున్నారు. వారి వ్యాఖ్య లేకుంటే పాండురంగవిభుని పదగుంభనంకాని, ఈ 'తేనెపలుకుల అన్నమయ్య'  వ్యాఖ్య లేకుంటే, తెలుగుభాషను మరిచే ప్రయత్నం చేస్తున్న మనకు, అన్నమయ్య అచ్చమైన తెలుగుకాని, జాతీయాలు కాని అర్థంకావడం కష్టమేనేమో! 

అలనాడు వేంకటేశ్వర స్వామి జగన్మోహినిగా దేవతలకు సముద్రాన్ని చిలుకగా వెలువడిన అమృతం పంచిపెడితే, నేడు సూర్యగణపతులవారు అన్నమయ్య కీర్తనా సముద్రాన్ని చిలుకగా వచ్చిన తెలుగుభాషామృతాన్ని తెలుగుభాషాభిమానులకు అందిస్తున్నారు.

మీరిక్కడే చదువదలిస్తే ........




మీరెక్కడైనా, ఎప్పుడైనా చదువుకుందామని పుస్తకాన్ని పొందగోరితే ........


పై నొక్కండి.


ఈ టపాను మీ సాంఘికసంపర్కజాలంలో పంచుకొండి. ఇంకొందరికీ ఈ టపా ఉపయోగ పడుతుంది, మీరూ వారికి మేలు చేసినవారవుతారు. మీ రా పని చేస్తారనే నమ్మకంతో ముందుగానే ధన్యవాదాలు.

09 సెప్టెంబర్, 2019

శ్రీశ్రీ రచనలు SriSri Rachanalu


శ్రీశ్రీ రచనలు 
SriSri Rachanalu


శ్రీశ్రీ


శ్రీశ్రీ గురించి తెలుగువాడికి పరిచయం చేయబూనడం హాస్యాస్పదం కాబట్టి అటువంటి సాహసానికి ఒడిగట్టను. కాని, ఒక్కటి మాత్రమ్ ఒప్పుకోక తప్పదు - 

 ఇన్నాళ్ళూ వారి రచనలు ఈ తెలుగుపరిశోధనలో చేరకపోవడం పెద్ద పొరపాటే(తప్పే?)" అని. ఏమయితేనేం ఇన్నాళ్ళకైనా తెలిసి వచ్చింది, సంతోషం.
అంతర్జాలంలో లభించే శ్రీశ్రీ రచనలను అందించే ప్రయత్న మిది. కొన్ని రచనలు తెలుగు వికీసోర్స్ లో కూడా లభిస్తున్నాయి.

మీకు కావాల్సిన పుస్తకం పేరుపై నొక్కండి. దిగుమతి పుటకు వెళతారు.


  1. మహా ప్రస్థానం
  2. మహా ప్రపంచం
  3. మరో ప్రపంచం
  4. ఖడ్గ సృష్టి
  5. ప్రభవ 
  6. అనంతం (ఆత్మకథ-నవల)
  7. సంపెంగ తోట
  8. అమ్మా (అనువాద నాటికలు)
  9. పాడవోయి భారతీయుడా (సినిమా పాటలు)
  10. విశాలాంధ్రలో ప్రజా రాజ్యం
  11. అగ్నిజ్వాల,ఉక్కు పిడికిలి (సినిమా పాటలు)




ఈ టపాను మీ సాంఘికసంపర్కజాలంలో పంచుకొండి. ఇంకొందరికీ ఈ టపా ఉపయోగ పడుతుంది, మీరూ వారికి మేలు చేసినవారవుతారు. మీ రా పని చేస్తారనే నమ్మకంతో ముందుగానే ధన్యవాదాలు.

అనుసరించువారు