వివిధ తెలుగు కవిపండితుల రచనలను మీ అభిమాన తెలుగుపరిశోధన అందిస్తున్న విషయాన్ని మీరు గమనించే ఉంటారు. అందులో భాగంగా ప్రసిద్ధ శాస్త్రపండితులు, కథారచయిత అయిన వేలూరి శివరామ శాస్త్రిగారి కొన్ని రచనలను మీ ముందుకి తెస్తున్నాం.
నోరి నరసింహశాస్త్రి (1900 - 1978) ప్రముఖ తెలుగు కవి. తెలుగు, సంస్కృతం, ఇంగ్లీషు, కన్నడ భాషలలో అతివేలమయిన అభినివేశాన్ని సంపాదించుకున్న మనీషులు. సాహిత్య శాస్త్రవలోకనంలో, ప్రాచీనాంధ్ర కవితా పరిశీలనంలో, అధునాతన సాహిత్య నిర్మాణంలో, సాంస్కృతిక అధ్యయనంలో, నవ్య సాహిత్య సమీక్షలో శ్రీ శాస్త్రిగారు గంభీరమయిన పరిశ్రమ చేసినవారు. సాహిత్యోద్యమంలో అగ్రేసరులు.