30 August, 2016

ఆంధ్ర వాఙ్మయారంభ దశ Andhravangmaya Arambhadasha

ఆంధ్ర వాఙ్మయారంభ దశ 
 Andhravangmaya Arambhadasha



రెండు భాగాల దివాకర్ల వేంకటావధానిగారి పరిశోధనాగ్రంథం ప్రాఙ్నన్నయ యుగం గురించి విపులంగా చర్చించడమే కాక భారతావతరణాన్నీ స్పృశిస్తుంది. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి Ph.D. పట్టం కొరకు సమర్పించిన తొలితరం పరిశోధనాగ్రంథం. అపురూపమైన సంప్రదింపు గ్రంథం.

28 August, 2016

Dr.అంబడిపూడి నాగభూషణం రచనలు Dr.Ambadipudi Nagabhushanam

Dr.అంబడిపూడి నాగభూషణం రచనలు Dr.Ambadipudi Nagabhushanam


ప్రసిద్ధ వ్యాకరణశాస్త్ర పండితులు, భాషాశాస్త్రవేత్త, ఆచార్యులు అంబడిపూడి నాగభూషణంగారి వ్యాకరణ రచనలు లభిస్తున్నాయి. వాటిని చదవడంవల్ల మన భాషా జ్ఞానం పెరుగుతుంది. చక్కని సంప్రదింపు గ్రంథాలు. దిగుమతి చేసుకుని, ఆనందించండి.

20 August, 2016

ఆంధ్ర వాల్మీకి రచనలు Andhra Valmiki Rachanalu





ఆంధ్ర వాల్మీకి రచనలు 
Andhra Valmiki Rachanalu
 



వాసుదాసుయై యవతరించి శ్రీరామాయణమును తెనిగించి బండ్ల కెక్కించి లోకోద్ధరణ మొనరించి తమ 73 ఏట పరమవదించిరి. ఆయనే వాసుదాసు అన్వర్థ నామ ధేయుడై శ్రీ వావిలికొలను సుబ్బారావు గారు – ఆంధ్రవాల్మీకిబిరుదాంకితులు – శ్రీ కోదండ రామ సేవక సమాజ సమాజ సంస్థాపనాచార్యులు – ఆంధ్ర వాల్మీకి రామాయణ శ్రీ కృష్ణ లీలామృత ద్విపద భగవత్ గీతాది బహుగ్రంధ కర్తలు ఒంటిమిట్ట కోదండ రామాలయ పునరుద్ధారకులు భక్తి మత ప్రచారకులు – మహర్షి – మౌని – అకుంఠిత రామభక్తుడు – తత్త్వ వేత్త – వక్త – విమర్శకులు.

ఇంకా ఊలపల్లి సాంబశివ రావు గారు ఇలా తెలుపుతున్నారు........
   
''వీరు వాసుదేవ స్వామిగా బహుథా ప్రసిద్ధులు. మహా సాధకులు,    పోతన జీవిత ఆదర్శాలతో 19-20 శతాబ్దాలలో జీవించిన మహానుభావుడు . .  కాలం మరుగున ఉండిపోయిన పండిత శ్రేష్ఠ తముడు. . .
  
శ్రీ శ్రీ శ్రీ  వాసుదేవ స్వామి, కడప, (వావికొలను వారు) సాహిత్యాన్ని లక్ష్మీనారాయణగారు ప్రాచారం చేస్తున్నారు.
మీకు తెెలిసిన విషయమే వాసుదేవ స్వామివారి గొప్పదనం. వారు  మహర్షి. వారు ప్రచురించిన  ఆధ్యాత్మిక గ్రంథాలు అనేకం ఉన్నాయి.
వాటిని ప్రచారంచేసే కార్యం బుజాన వేసుకున్న మహానుభావులు శ్రీ లక్ష్మీనారాయణగారు కడపలో ఉంటారు.
వారి పుస్తకాలు ఉన్న వారి జాలగూడులో పెట్టారు.
మీరు అవకాశం చూసుకుని వారి గ్రంథాలను అందించి ప్రచారం కల్పించండి. మన తెలుగుభాషకు సంప్రదాయాలకు ఎంతో మేలు జరుగుతుందండి. . .'' అని.


మరి పెద్దల మాట చద్దన్నం మూట కదా? తప్పక ఆ జాలగూటిని సందర్శించండి. 
దాని చిరునామా........
                                  http://www.sribhakthisanjeevani.org/lite.html 



 

అనుసరించువారు