20 October, 2018

పాండురంగ మాహాత్మ్యం - పామర వ్యాఖ్యా సహితం Panduranga Mahathmyam - Pamara vyakhya


పాండురంగ మాహాత్మ్యం - పామర వ్యాఖ్య Panduranga Mahathmyamu - Pamara vyakhya


పాండురంగ మాహాత్మ్యం-పామర వ్యాఖ్య



తెలుగు సాహిత్యంతో ఏ కొంచెం పరిచయం ఉన్నవారయినా తెనాలి రామకృష్ణ కవి గూర్చి వినక ఉండరు. ఆయన రాసిన పాండురంగ మాహాత్మ్యం కూడా ప్రసిద్ధమే. అది ప్రౌఢ ప్రబంధం.  గతంలో ఈ గ్రంథాన్ని బులుసు వేంకటరమణయ్యగారి టీకతో తెలుగుపరిశోధన మీకు అందించింది. ఇక ఇప్పుడు 'పామర' వ్యాఖ్యతో మీకు అందించే అవకాశం కల్పించినవారు రసజ్ఞభారతి వ్యవస్థాపకులు ఆచార్య ఆర్.వి.కుమార్ గారు. వారికి సహస్రానేక కృతజ్ఞతాభివందనాలు.

ఈ 'పామర' వ్యాఖ్యను మనకొరకు అందించినవారు డా.దేవగుప్తాపు సూర్య గణపతి రావు గారు. వారు వృత్తిరీత్యా సామాన్యులకు దురవగాహమైన ఎన్నో విషయాలను పరిశీలించి లోకసామాన్యానికి అర్థమయ్యేతీరులో వ్యాఖ్యానించి చెప్పే రేడియాలజిష్టు. వారు తమ ఆ తృతీయనేత్రాన్ని  సాహిత్యంలో కూడా పారించారు. ఇంకేం సామాన్యులకు పాండురంగ మహాత్మ్యం అర్థం కావడం కష్టం. దాన్ని కూడా పరిశీలించి, మనకు  వ్యాఖ్యానించి అందించారు.  అదీ అందరికీ ఉచితంగా అందించాలనే సత్సంకల్పంతో .... 

ఈ రసజ్ఞభారతి గూర్చి, వ్యాఖ్యా రచయితగూర్చి, వారి మిత్రబృందంగూర్చి అన్ని విషయాలను ఆ పుస్తకంలోనే చదువండి. 

మరింకేం ఆలస్యం .......


పాండురంగ మాహాత్మ్యం-పామరవ్యాఖ్య by Dr.Pandu Ranga Sharma Ramaka on Scribd




ఈ పుస్తకాన్ని దిగుమతి చేసుకోవాలనుకుంటే .......


పై నొక్కండి.

ఈ టపాను మీ సాంఘికసంపర్కజాలంలో పంచుకొండి. ఇంకొందరికీ ఈ టపా ఉపయోగ పడుతుంది, మీరూ వారికి మేలు చేసినవారవుతారు. మీ రా పని చేస్తారనే నమ్మకంతో ముందుగానే ధన్యవాదాలు.

12 August, 2018

చారిత్రక సామాజిక నేపథ్యంలో తెలుగు సాహిత్య చరిత్ర Sociological History Of Telugu literature

చారిత్రక సామాజిక నేపథ్యంలో తెలుగు సాహిత్య చరిత్ర 
Sociological History Of Telugu literature 
Dr.ముదిగంటి సుజాతా రెడ్డి


డా. ముదిగంటి సుజాతా రెడ్డి గారి ఈ రచన ఒక విశిష్టమైన రీతిలో సాగిన తెలుగు సాహిత్య చరిత్ర. విద్యార్థులకు, ఉపాధ్యాయులకూ కరదీపిక.

18 June, 2018

నవల Navala

నవల Navala

ఆర్కైవ్ లో (DLL వారివి) కొన్ని నవలలు కన్పించినాయి. వాటిని అందుబాటులోకి తెస్తే ఔత్సాహికులైన పాఠకులకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఇక్కడ సాధ్యమైనవాటిని అందిస్తున్నాము.

17 June, 2018

తెలుగులో వివిధ ప్రక్రియలు Telugulo vividha Prakriyalu

తెలుగులో వివిధ ప్రక్రియలు
 Telugulo vividha Prakriyalu

తెలుగులో వెలువడిన వివిధ ప్రక్రియలపై గతంలో ప్రపంచమహాసభల వేళలో అప్పటి ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ వారు చిన్న చిన్న పుస్తకాలు వెలువరించారు. అటువంటివి పరిశోధకులకు, పరీక్షార్థులకు ఉపయోగకరమని, అంతర్జాలంలో లభించినవాటిని ఒక్కదగ్గర సంగ్రహిస్తున్నాము.

16 June, 2018

తెలుగులో చిత్రకవిత్వం TelugulO Chitra kavitvam

తెలుగులో చిత్రకవిత్వం 
TelugulO Chitra kavitvam 
గాదె ధర్మేశ్వర రావు Gade Dharmeswara Rao

తెలుగులో చతుర్విధ కవిత్వాల్లో  చిత్రకవిత్వం ఒకటి. ఇది నన్నె చోడుని కాలంనుండే తెలుగులో ఉన్నా, సంస్కృతంనుండి మనకు వచ్చిందని చెప్పడానికి సందేహం లేదు. ఎందరో కవులు చిత్రకవిత్వంలో పరిశ్రమ చేసారు

11 June, 2018

జాతక కథలు Jataka Kathalu

జాతక కథలు 
Jataka Kathalu







జాతక కథలు భారతదేశంలో ప్రాచుర్యం పొందిన బుద్ధుని పూర్వ జన్మల గురించిన జానపద కథల సమాహారం. క్రీ.పూ 300 — క్రీ.శ 400 మధ్యలో రచించబడినట్టుగా చెప్పబడుతున్న ఈ కథలన్నీ పాళీ భాషలో లభ్యమయ్యాయి. తరువాత అనేక భాషల్లోకి తర్జుమా చేయబడ్డాయి. వీటి సంఖ్య సుమారుగా 550-600 మధ్యలో ఉంటుంది.

10 June, 2018

తెలుగువారి ఇంటి పేర్లు Teluguvari Inti Perlu

తెలుగువారి ఇంటి పేర్లు 
Teluguvari Inti Perlu
తేళ్ళ సత్యవతి Tella Sathyavathi

తెలుగు వారి ఇంటి పేర్లు ఏ విధంగా ఏర్పడినాయి? ఎన్ని విధాలుగా ఉంటాయి? అనేవి ఆసక్తికరమైన అంశం.

09 June, 2018

ఆంధ్రమున ప్రబంధరూపమొందిన సంస్కృత రూపకములు Andhramuna Prabandha Roopamondina Samskrita Rupakamulu

ఆంధ్రమున ప్రబంధరూపమొందిన సంస్కృత నాటకములు Andhramuna Prabandha Roopamondina Samskrita Natakamulu
సి.రాజేశ్వరి C.Rajeshwari

సంస్కృతంలోని కాళిదాస అభిజ్ఞానశాకుంతలం తెలుగులో శృంగార శాకుంతలంగా పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు అనువదించాడు. అది మనకు తెలిసిందే. 

08 June, 2018

భాస్కర రామాయణము - పరిశీలనము (రవ్వా శ్రీహరి) Bhaskara Ramayanamu - Parishilanamu (Ravva Shrihari)

భాస్కర రామాయణము - పరిశీలనము 
 Bhaskara Ramayanamu - Parishilanamu
     రవ్వా శ్రీహరి  Ravva Shrihari 

రవ్వా శ్రీహరి


ప్రముఖ భాషాశాస్త్ర పండితులు, ఆచార్య రవ్వా శ్రీహరి గారు తమ Ph.D. పట్టంకొరకు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సమర్పించిన సిద్ధాంతగ్రంథం అంతర్జాలంలో లభించింది. 

07 June, 2018

వసుచరిత్రము (సవ్యాఖ్యానం) Vasucharitramu (Savyakhya)

వసుచరిత్రము (సవ్యాఖ్యానం) 
Vasucharitramu (Savyakhya)
రామరాజ భూషణుడు Ramaraja Bhushanudu

ప్రబంధయుగములో వెలువడిన అత్యుత్తమసాహిత్యంలో రామరాజకృత వసుచరిత్రము ప్రముఖము. ఈ ప్రబంధం ప్రౌఢము. వ్యాఖ్యానరహితంగా అర్థమయ్యేది కాదు.

06 June, 2018

గురజాడ రచనలు Gurajada Rachanalu

గురజాడ రచనలు 
 Gurajada Rachanalu

Gurajada Apparao


తెలుగు సాహిత్యంలో గురజాడది ప్రత్యేకస్థానం. ఆయన ఆధునిక కవిత్వానికి యుగకర్త. వ్యావహారిక భాషను రచనల్లో వాడి, దానికీ పుస్తకభాషా స్థాయిని కల్పించిన మహనీయుడు.

05 June, 2018

తెలుగు జానపద గేయ గాథలు Telugu Janapada Geya gathalu

తెలుగు జానపద గేయ గాథలు 
Telugu Janapada Geya gathalu
నాయని కృష్ణకుమారి Nayani Krishna Kumari


తెలుగులో వెలువడిన జానపదగేయ వాఙ్మయాన్ని మథించి, అందులో ప్రస్తావించిన గాథలు, ఆచారాలు, సంస్కృతి మొదలైనవానిగురించి సమగ్రంగా పరిశోధించి అందించారు ఆచార్య నాయని కృష్ణకుమారిగారు.

04 June, 2018

ప్రబంధాలు - శృంగారం-ప్రయోగాలు Prabandhalu-Sringaram-Prayogalu

ప్రబంధాలు - శృంగారం-ప్రయోగాలు 
Prabandhalu-Sringaram-Prayogalu
బి.రాములు B.Ramulu


చార్యులు బి.రాములు గారు హైదరాబాద్ విశ్వ విద్యాలయంలో Ph.D. పట్టం కొరకు సమర్పించిన సిద్ధాంత వ్యాసం.

03 June, 2018

కల్పవృక్ష బాలకాండము - ఛందోవస్తుశిల్పము Chandovastushilpamu

కల్పవృక్ష బాలకాండము - ఛందోవస్తుశిల్పము 
Kalpavriksha Balakandamu-Chandovastushilpamu
డా.పవని ఆర్. హరినాథ్ Dr.Pavani R. Harinath  

డా.పవని ఆర్. హరినాథ్ గారు శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయానికి Ph.D. సమర్పించిన పట్టం కొరకు సమర్పించిన సిద్ధాంత గ్రంథం.

02 June, 2018

తెలుగు జానపద గేయ సాహిత్యము - Telugu jaanapada Geya Sahityamu

తెలుగు జానపద గేయ సాహిత్యము - బిరుదరాజు రామరాజు
 Telugu jaanapada Geya Sahityamu -  Birudaraju Ramaraju

బిరుదరాజు రామరాజు

ఆచార్య బిరుదరాజు రామరాజు గారు పరిశోధించి, వ్రాసిన సిద్ధాంతగ్రంథం ఈ తెలుగు జానపద గేయ సాహిత్యము. ఇది ఉస్మానియా విశ్వైద్యాలయం తెలుగు విభాగంలో సమర్పించబడిన మొదటి పరిశోధనాగ్రంథం. అంతే కాకుండా జానపదగేయ సాహిత్యంలో వెలువడిన మొదటి పరిశోధనాగ్రంథం. ఇది తరువాత వెలువడిన ఎన్నో పరిశోధనాగ్రంథాలకు ఆకరం. 

01 June, 2018

చిలకమర్తి లక్ష్మీనరసింహం రచనలు Chilakamarthi Lakshmi Narasiamham Rachanalu

చిలకమర్తి లక్ష్మీనరసింహం రచనలు Chilakamarthi Lakshmi Narasiamham Rachanalu




విగా, నవలా రచయితగా, నాటక రచయితగా, సంఘసంస్కర్తగా పేరుపొందిన చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు చేసిన అనేక రచనల్లో అంతర్జాలంలో లభిస్తున్న వాటిని సేకరించి, మీ ముందుకు తెస్తున్నాం. ఈ పుస్తకాలను దిగుఅమతి చేసుకుని, చదివి, ఆనందించండి.

అనుసరించువారు