ఆంధ్ర వాల్మీకి రచనలు
Andhra Valmiki Rachanalu
వాసుదాసుయై యవతరించి శ్రీరామాయణమును తెనిగించి బండ్ల కెక్కించి లోకోద్ధరణ మొనరించి తమ 73 ఏట పరమవదించిరి. ఆయనే వాసుదాసు అన్వర్థ నామ ధేయుడై శ్రీ వావిలికొలను సుబ్బారావు గారు – ఆంధ్రవాల్మీకిబిరుదాంకితులు – శ్రీ కోదండ రామ సేవక సమాజ సమాజ సంస్థాపనాచార్యులు – ఆంధ్ర వాల్మీకి రామాయణ శ్రీ కృష్ణ లీలామృత ద్విపద భగవత్ గీతాది బహుగ్రంధ కర్తలు ఒంటిమిట్ట కోదండ రామాలయ పునరుద్ధారకులు భక్తి మత ప్రచారకులు – మహర్షి – మౌని – అకుంఠిత రామభక్తుడు – తత్త్వ వేత్త – వక్త – విమర్శకులు.
ఇంకా ఊలపల్లి సాంబశివ రావు గారు ఇలా తెలుపుతున్నారు........
''వీరు వాసుదేవ స్వామిగా బహుథా ప్రసిద్ధులు. మహా
సాధకులు, పోతన జీవిత ఆదర్శాలతో 19-20 శతాబ్దాలలో జీవించిన మహానుభావుడు .
. కాలం మరుగున ఉండిపోయిన పండిత శ్రేష్ఠ తముడు. . .
శ్రీ శ్రీ శ్రీ వాసుదేవ స్వామి, కడప, (వావికొలను వారు) సాహిత్యాన్ని లక్ష్మీనారాయణగారు ప్రాచారం చేస్తున్నారు.
మీకు తెెలిసిన విషయమే వాసుదేవ స్వామివారి గొప్పదనం. వారు మహర్షి. వారు ప్రచురించిన ఆధ్యాత్మిక గ్రంథాలు అనేకం ఉన్నాయి.
వాటిని ప్రచారంచేసే కార్యం బుజాన వేసుకున్న మహానుభావులు శ్రీ లక్ష్మీనారాయణగారు కడపలో ఉంటారు.
వారి పుస్తకాలు ఉన్న వారి జాలగూడులో పెట్టారు.
మీరు అవకాశం చూసుకుని వారి గ్రంథాలను అందించి ప్రచారం కల్పించండి. మన తెలుగుభాషకు సంప్రదాయాలకు ఎంతో మేలు జరుగుతుందండి. . .'' అని.
మరి పెద్దల మాట చద్దన్నం మూట కదా? తప్పక ఆ జాలగూటిని సందర్శించండి.
దాని చిరునామా........