రామాయణ విషవృక్ష ఖండన - లత రామాయణము
తెన్నేటి హేమలత
Ramayana Vishavriksha Khandana - Latha Ramayanamu
Tenneti Hema Latha
తెన్నేటి హేమలత
( 'రసజ్ఞభారతి' సహకారంతో )
విశ్వనాథ సత్యనారాయణ గారు 1962 లో రామాయణ కల్పవృక్షాన్ని తెలుగువారి పెరట్లో తెచ్చి నాటారు. కల్పవృక్షఫలాలను అనుభవించే తెలుగువారి పెరట్లోకి వారికి ఇష్టం లేకున్నా, దురదృష్ట వశాత్తు, 1974 లో రామాయణ విషవృక్షమనే విదేశీ/విజాతి భావాల 'ఒయ్యారిభామ' వచ్చి చేరింది. ఈ దేశ సంస్కృతిపై అక్కసు కలిగినవాళ్ళు ఎందరో ఈ దేశంలోనే ఉన్నారు. అది మన దౌర్భాగ్యం. ఏమయితేనేం ఆ జాతివినాశకరమైన మొక్కను కూకటివేళ్ళతో పెరికివేయడానికి పూనుకున్నారు లతగా పేరుమోసిన తెన్నేటి హేమలతగారు. ఆ విధంగా తెలుగువారు ఆయమ్మకు ఋణపడి ఉన్నారు.