Showing posts with label సంస్కృతి. Show all posts
Showing posts with label సంస్కృతి. Show all posts

17 July, 2025

ఆంధ్ర ప్రశస్తి (వివిధ కవుల కవితా సంకలనం) Andhra Prashasti (Collections of Telugu Poetry of various poets)





ఈ కింది తెలుగు పద్యం చూడండి.
 
వేదముల్ సంస్కృత వాదముల్ చేసిన  తెలుఁగువాఁడే చేయవలయు ననఁగ
సంస్కృతచ్ఛందస్సు చక్కఁగా సాగింప తెలుఁగులోనే సాగవలయు ననఁగ
ఋతువులవద్దతి ఋజువుగా నుండఁగా నొకతెల్గునాటనే యుండు ననఁగ
నిఖిలసస్యములు పండింపఁగా దగినట్టి ధాత్రిలక్షణ మిందె తనరు ననఁగ

సర్వవేదాంతములకును జన్మభూమి
తూచిమనుజుఁడు తాల్చు దుస్తులకుఁ దగిన
దనుప్రమాణమ్ము చూపించి నట్టి నేల
తెలుఁగుధాత్రికి ధాత్రిలో దీటుఁగలదె?

ఈ పద్యం విశ్వనాథ సత్యనారాయణ గారిది. 
వివిధ కవులు వివిధ సందర్భాలలో తెలుగు జాతి, భాష, సంస్కృతులకు సంబంధించిన  వ్రాసిన ఇటువంటి కవితలను సేకరించి ఆంధ్ర ప్రశస్తి పేరుతో ఒక గ్రంథంగా ప్రచురించారు తెలుగు విశ్వవిద్యాలయం వారు. 
 
 ఆ అపురూపమైన పుస్తకం మీ కోసం......

👉  ఆంధ్ర ప్రశస్తి Andhra Prashasti 👈 


పుస్తకాలను ఎలా దిగుమతి చేసుకోవాలంటే పైన 'సహాయం' ట్యాబ్ పై నొక్కండి ఈ టపాపై మీ వ్యాఖ్య తప్పక రాస్తారు కదూ? మీ వ్యాఖ్యలే మాకు మంచి ప్రోత్సాహకాలు. ఈ టపాను మీ సాంఘికసంపర్కజాలంలో పంచుకొండి. ఇంకొందరికీ ఈ టపా ఉపయోగ పడుతుంది, మీరూ వారికి మేలు చేసినవారవుతారు. మీ రా పని చేస్తారనే నమ్మకంతో ముందుగానే ధన్యవాదాలు.

06 April, 2013

కడప జిల్లా శాసనాలు సంస్కృతి- చరిత్ర History and Culture of Cuddapah District in Inscriptions

కడప జిల్లా శాసనాలు సంస్కృతి- చరిత్ర
History and Culture of Cuddapah District in Inscriptions



డా. ఉమా మహేశ్వర శాస్త్రి గారు శ్రీకృష్ణదేవరాయల విశ్వ విద్యాలయంలో Ph.D. పట్టా కొరకు సమర్పించిన సిద్ధాంత వ్యాసం.


01 April, 2013

భారతీయ సంస్కారాలు Bharateeya Samskaaraalu

భారతీయ సంస్కారాలు
Bharateeya Samskaaraalu





భారతీయులందరికీ షోడష సంస్కారాలు ఉంటాయి. శిశువు తల్లి కడుపులో పడక ముందునుండి ప్రారంభం. గర్బాధానం. చివరకు మరణించిన తర్వాత అన్త్యేష్టి. ఈ రెంటిమధ్యలో మరో పదునాలుగు సంస్కారాలు. అవి ఏమిటేమిటి? ఎలా? ఎందుకు? మొదలైన వివరాలన్నీ ఈ పుస్తకంలో లభిస్తాయి.

ఇందులో ....
  1.  గర్భాదానం
  2.  పుంసవనం
  3.  జాతకర్మ
  4. నిష్క్రమణము
  5. ఉపవేశనము
  6.  నామకరణం
  7.  అన్నప్రాశనం
  8. కర్ణవేధ
  9.  చూడాకరణం
  10.  అక్షరాభ్యాసం
  11.  ఉపనయనం
  12.  గోదాన వ్రతం
  13.  ఉపాకర్మ
  14.  సమావర్తనము
  15. వివాహము
  16. అంత్యేష్టి  

అనే పదహారు సంస్కారాలగురించి విపులంగా చర్చించబడింది.

అనుసరించువారు