Showing posts with label Natakam. Show all posts
Showing posts with label Natakam. Show all posts

21 January, 2017

తెలుగు నాటక వికాసం Telugu NaTaka vikasasam

తెలుగు నాటక వికాసం Telugu NaTaka vikasasam
పోణంగి శ్రీరామ అప్పారావు Ponangi Sri Rama Appa Rao


పోణంగి శ్రీరామ అప్పారావు నాటకకర్త, అధ్యాపకుడు, నాట్యశాస్త్రం అనువాదకుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత.
అప్పారావు 1923 జూలై 21 వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా, కొవ్వూరు తాలూకా, బందపురంలో జన్మించాడు. కొవ్వూరు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలోను, విజయవాడ శ్రీరాజా రంగయ్యప్పారావు కళాశాలలోనూ, ఆంధ్ర విశ్వవిద్యాలయంలోను విద్యాభ్యాసం చేశాడు. ’తెలుగు నాటకవికాసం‘ అనే అంశంపై పరిశోధన చేసి 1961 లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టా స్వీకరించాడు. తెలుగు నాటక రంగాన్ని గురించిన సర్వ సమగ్రమైన గ్రంథమిది. 1967లో ఈ గ్రంథం వెలువడిన నాటినుంచి నాటకరంగానికి ప్రామాణిక గ్రంథంగా విరాజిల్లుతుంది. దీనికి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది.
అప్పారావు వృత్తిరీత్యా అధ్యాపకుడు. భీమవరంరాజమహేంద్రవరంమద్రాసుకడప, శ్రీకాకుళం ఆర్ట్స్ కాలేజీల్లోనూ, మద్రాసు ప్రెసిడెన్సి కాలేజీలోనూ కొంతకాలం ఉపస్యాసకుడిగా పనిచేశాడు. విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయం లోను పాఠ్యగ్రంథ జాతీయకరణ ప్రత్యేకోద్యోగిగా పనిచేశాడు.
అప్పారావు 1987 లో కలకత్తాలో జరిగిన విశ్వ ఉన్నయన్ సంసద్లో రాష్ట్ర నాట్య సామ్రాట్ బిరుదును, 1990లో హైదరాబాదు యువ కళావాహిని వారిచే నాటక రత్న బిరుదాన్ని, 1992 లో శ్రీకాళహస్తి భరతముని ఆర్ట్స్ అకాడెమీ వారిచే కళారత్న బిరుదాన్ని అందుకున్నాడు.[1]
భరతముని ‘నాట్యశాస్త్రం’ను తెలుగులో అనువదించి ప్రపంచానికి అందించాడు. ఈ గ్రంథానికి కేంద్రసాహిత్య అకాడమీ బహుమతి లభించింది. ఇతర రచనలు తాజ్ మహల్ (నాటిక), విశ్వభారతి (నవల), వేణువు (పద్యాత్మక గద్యము), నాట్యశాస్త్రము (గుప్తభావప్రకాశికాసహితము-జాతీయ బహుమతి పొందన గ్రంథం), నాటకరచనాప్రయోగములు (సిద్ధాంత గ్రంథము), తెలుగు నాటక వికాసము (డాక్టరేట్ పట్ట పరిశోధన వ్యాసము) నాటకరంగ పరిశోధనలో విశేషంగా కృషిచేసిన అప్పారావు 2005, జూలై 2న కన్నుమూశాడు.

To Download...........

15 January, 2016

ఆరుద్ర నాటికలు Arudra Natikalu

తెలంగాణా పోరాట ఇతివృత్తంతో రాసిన త్వమేవాహం (1949) కావ్యం చదివి ఇక నేను పద్యాలు రాయక పోయినా పరవాలేదు అని మహాకవిశ్రీశ్రీ ప్రశంస పొందిన ఆరుద్ర ( ఆగస్టు 311925 - జూన్ 41998) పూర్తిపేరు భాగవతుల సదాశివశంకర శాస్త్రి . శ్రీశ్రీ తర్వాత యువతరంపై ఎక్కువ ముద్ర పడిన కవిగా పేరు పొందిన ఆరుద్ర అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త మరియు విమర్శకుడు.ఈయన భార్య కె.రామలక్ష్మి కూడా ప్రముఖ తెలుగు రచయిత్రి.


10 February, 2014

పిపీలికం (నాటకం) Pipeelikam

పిపీలికం (నాటకం) Pipeelikam
రాచకొండ విశ్వనాథ శాస్త్రి/ పసుపులేటి పూర్ణ చంద్ర రావు
Rachakonda Vishva naatha Shastry/ pasupuleti Purana chandra rao



రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు రచించిన కథను పసుపులేటి పూర్ణ చంద్ర రావు గారు నాటకీకరంచారు.

మీరిక్కడే చదువుకోవాలంటే..........

Error: Embedded data could not be displayed.



Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....



పైనొక్కండి

అనుసరించువారు