డా. కుమార తాతాచార్య సంస్కృతంలో రచించిన భవభూతి భారతి అనే ఈ గ్రంథాన్ని శ్రీ యన్.సి.వి. నరసింహా చార్యులు తెలుగులోకి అనువదించారు. ఈ గ్రంథ పఠనం వల్ల భవభూతి రచనల పైన మాత్రమే కాకుండా కావ్య హేతువులు, ఔచిత్యగుణాదులూ ప్రసక్తానుప్రసక్తంగా చర్చించారు.
తే. గీ. ఒత్తుకొని వచ్చు కటి కుచో ద్వృత్తి
చూచితరుణి తను మధ్య మెచటికో తొలగి
పోయెఉండెనేనియు కనబడ కుండె? అహహ!
ఉద్ధతుల మధ్య పేదల కున్దతరమే
అనే పద్యం ప్రసిద్ధం. ఈ పద్యం వ్రాసినవారు సంకుసాల నృసింహ కవి. ఆయన వ్రాసిన కవికర్ణ రసాయనం లోనిది ఈ పద్యం.