మీ కోసం ప్రస్తుతం అంతర్జాలంలో లభిస్తున్న అడవి బాపిరాజు రచనలని ఒక్క చోట అందించే ప్రయత్నం చేస్తున్నాం. మీకు అందుబాటులో ఇంకేవైనా ఉంటే అందిస్తే పదిమందితో పంచుకుందాం.
- అంశుమతి
- బోగీర లోయ
- నా పడమటి ప్రయాణం
- గోన గన్నారెడ్డి
- జాజిమల్లి
- నారాయణ రావు
- శశికళ (పాటల సంపుటి)
- తరంగిణి (కథా సంపుటి)
- తుపాను
వీటన్నిటినీ ఇక్కడ పొడవచ్చు.
16 వ్యాఖ్యలు:
నమస్సులు. అడవి బాపిరాజు గారి సేకరణ అయిన ఒక పాట...కొండొండోరి సెరువుల కింద ..తత్వం...దీని అర్ధం తెలుపగలరు.
I am also trying to get the philosophical essence in that. Could not get.
Song lyric available, meaning not known
I am also trying can u pls let me know if find....my circle is limited and engg back ground so no hope I can get
ఈ కింద లింక్ లో మీకు కావలసిన పాట వీడియో చూడగలరు,వినగలరు.
https://kasthephali.blogspot.com/2019/09/blog-post_35.html
రామక పాండురంగ శర్మగారి బ్లాగును ఇలా వాడుకున్నందుకు మన్నించ వేడుతాను.
Very nice song
Pls send me songs & audios books pdf pls
1. కొండొండోరి సెరువుల కాడా సే సిరి ముగ్గురు ఎగసాయం యొకడికి (త్రి మూర్తులు 1. బ్రహ్మ, 2. విష్ణువు, 3. మహేశ్వరుడు.) కాడి లేదు రెండు దూడాలే దు అనంతకోటి బ్రహ్మాండాలలో (కొండొండోరి సెరువుల) త్రిమూర్తులు సృష్టి వ్యవసాయం మొదలుపెట్టారు. వ్యవసాయానికి కాడి, దూడా ఉండాలి కదా ! కాని వీరి వ్యవసాయానికి అవిలేవు. (మిగతా చరణాలన్నింటిలోను ఇదేరీతిగా స మన్వ యించుకోవాలి) 2. కాడిదూడా లేనెగసాయం పండెను మూడు పంటాలొకటి (1. సత్త్వము, 2. రజస్సు, 3. తమస్సు) వడ్లు లేవు రెండు గడ్డీ లేదు పంటలకి వడ్లు , గడ్డీ ఉండాలి కదా ! కాని 1. సత్త్వము, 2. రజస్సు, 3. తమస్సు అను పంటలకు వడ్లు , గడ్డీ లేవు. 3. వడ్లు గడ్డీ లేని పంటా ఇశాఖపట్నం సంతలో పెడితే( విశాఖ= ఔన్నత్యపు శాఖలు లేని సంసారం) వట్టి సం తేకానీ సంతలో జనం లేరు ( సత్వ రజస్తమోగుణాల పంటను శాఖలు లేని సంసారంలో పెట్టారు. జనం వాటిలో మునిగిపోయారు. ప్రపంచం ఉన్నది కాని ప్రపంచంలో సంసారపు ఊర్ధ్వమూలాన్ని ఆలోచించటానికి ఎవరూ లేరని భావం ) 4. జనంలేని సంతలోకి వచ్చిరి ముగ్గురు షరాబు లొకరికి( షరాబులు= కంసాలులు 1. అగ్ని, 2. వాయువు, 3. సూర్యుడు.) కాళ్ళు లేవు రెండు సేతుల్లేవూ 5. కాళ్ళు చేతులు లేని షరాబు తెచ్చిరి మూడు కాసూలొకటి( త్రిదండాలు 1. వాగ్దండము (మౌనము), 2. మనోదండము (ఆశ లేకుండుట), 3. కాయదండము (స్వధర్మాచరణము)) వొలాల్లొల్లదూ రెండు సెల్లాసెల్లవు ( త్రిదండాలకు ఈలోకంలో చెల్లుబాటు లేదని భావం) 6. ఒల్లాసెల్లని కాసులు తీసుకు ఇజయనగరం ఊరికిబోతె ఒట్టి ఊ రేగాని ఊళ్ళో జనం లేరు ( విజయ అనగా మిక్కిలి గెలుపు. సహస్రార చక్ర భేదనమనే ఊరు. ఈలోకంలో చాలామంది దృష్టిలో పనికిరాని ఆ త్రిదండాలను ఆచరించి ఉత్తమ యోగాభ్యాసంతో ఆ సహస్రార చక్ర భేదనమనే ఊరుకు వెళదామని చూస్తే ఆ ఊరు చేరిన వారు లేరు. యోగులెవరు లేరని భావం) 7. జనం లేని ఊల్లోను ఉండిరి ముగ్గురు కుమ్మల్లొకడికి(త్రికాలాలు 1. భూతకాలము, 2. భవిష్యత్కాలము, 3. వర్తమానకాలము.) తల లేదు - రెండు కి మొలాలేదు ( ఉత్తమ యోగాభ్యాసము చేసే వారు ఎవరూ లేకపోయినా తలా మొలా లేని- అనగా ఆకారం లేని త్రికాలాల కుమ్మర్లు వస్తూనే ఉంటారని భావం. ) 8. తల మొల లేని కుమ్మర్లు చేసి రిమూడు భాండాలొకటికి(1. భూలోకము, 2. స్వర్గలోకము, 3. పాతాళ లోకము.) అంచులేదూ . రెంటికి అడుగు లేదు ( కాలం సృష్టించిన లోకాలకు అంచులేదు. అడుగు లేదు.) 9. అంచు అడుగు లేని భాండాల్లో ఉంచిరి మూడు గింజలొకటి ( త్రిదోషాలు శ్లేష్మం, పిత్తం, వాతం.) ఉడకా ఉడక దు రెండు మిడకామిడకావూ (ఈలోకాలలో జీవులతో ఆడుకోవటానికి కాలం శ్లేష్మం, పిత్తం, వాతం అను మూడు గింజలను ప్రతి జీవిలోను ప్రవేశపెట్టింది) 10. ఉడకని మిడకని మెతుకులు తినుటకు వచ్చిరి ముగ్గురు సుట్టాలొకడికి (1. మనస్సు, 2. వాక్కు, 3. కర్మ. త్రికరణాలు) అంగు ళ్లేదూ రెండు మింగు ళ్లేదూ (శ్లేష్మం, పిత్తం, వాతం అను అనువాటిని త్రికరణాలు జీవుల చేత అను భవింపచేస్తున్నాయి) 11. అంగుడుమింగుడు(= లోకుత్తుక) లేని సుట్టాలు తెచ్చిరి మూడు సెల్లాలొకటి (1. ధర్మము, 2. అర్థము, 3. కామము.-త్రిగణము) సుట్టు లేదు , రెండు మద్దెలేదు . (అంచుల్లేని సన్నని బట్టను సెల్లా అంటారు. 1. ధర్మము, 2. అర్థము, 3. కామము.-త్రిగణములు అటువంటివి సెల్లాలు. వీటిని తెచ్చిన వారు త్రికరణాలు. 1. ధర్మము, 2. అర్థము, 3. కామములకు చుట్టూలేదు. అనగా ఒక పరిధిలేదు. మధ్య లేదు. )
దన్యోస్మి
http://smarana-bharathi.blogspot.com/2019/09/blog-post.html?m=1
1. కొండండోరి సెరువుల కింద సేసిరి ముగ్గురు ఎగసాయం! త్రిమూర్తులు - బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు జీవ సృష్టి అనే వ్యవసాయం చేస్తున్నారు. ఒకడికి (ఒక్కడికీ) కాడి లేదు, రెండు దూడ లేదు. కానీ ఆ జీవి మీద వారికి ఏ విధమైన ఆసక్తి గాని మమకారం గానీ లేవు. కాడి అంటే బరువు, దూడ అంటే మమకారం.
2. కాడే దూడ లేనెగసాయం పండెను మూడు పంటలు. సృష్టించబడ్డ జీవం సత్వ, రజో, తమో గుణాలతో వృద్ధిచెందబడ్డాయి. (ఉదా॥ఆవు, గుర్రం, సింహం) ఒకటికి వడ్లు లేవు రెండు గడ్డి లేదు. వరి పంట వేసిన రైతు పంట పండాక పంట కోసి వడ్లను గడ్డిని వేరు చేసి ధాన్యాన్ని తీసుకుంటాడు. కానీ సృష్టి కార్యం ఏళ్ల తరబడి పండ్లనిచ్చే చెట్టు లాగా యుగాల తరబడి జరిగే నిరంతరాయ ప్రక్రియ. (జీవరాశిలో అత్యంత ఇష్టమైన జీవి మనిషి కాబట్టి ఇప్పుడు కింది చరణాలని మానవ జన్మకి అన్వయించుకుందాం..)
3. వడ్లు గడ్డి లేని పంట ఇశాకపట్నం సంతలో పెడితే... విశాఖ - అంటే కొమ్మలు రెమ్మలు విస్తరించి ఉన్నది అని అర్థం. సత్వ రజో తమో గుణాలు నిండి ఉన్న మనిషిని కొమ్మల రెమ్మలుగా విస్తరించే సంసారమనే సంతలో పడేస్తే... ఒట్టి సంతే కానీ సంతలో జనం లేరు. మాయదారి సంతలో పడి మానవజన్మ పరమార్ధాన్ని మరచిపోయిన వారే గాని గురుతెరిగిన వారు ఎవరూ లేరు అని అర్థం.
4. జనం లేని సంతాలోకి వచ్చిరి ముగ్గురు షరాబులు. (షరాబు=ric) అలా సంసారంలో పడి కొట్టుకుపోతున్న మనిషి లోకి మూడు తాపత్రయాలు ప్రవేశించాయి. అవి ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మికమనబడే మూడు తాపములు. ఒకరికి కాళ్ళు లేవు రెండు సేతుల్లేవు. వీటికి కాళ్లు చేతులు అనేది లేదు కానీ ఈ తాపములే మనిషిని నడిపిస్తాయి పరిగెత్తి స్తాయి మంకుపట్టు పట్టిస్తాయి
5. కాళ్లు చేతులు లేని షరాబులు తెచ్చిరి మూడు కాసులు... (కాసు= తెరువు, దారి) ఈ తాపాలచే రగిలించబడ్డ మనిషికి మూడు దారులు దొరికాయి. భక్తి, జ్ఞాన, వైరాగ్యం. ఒకటి ఒల్లా ఒల్లదు, రెండు సెల్లా సెల్లదు.
6. ఒల్లా సెల్లని కాసులు పట్టుకు ఇజయానగరం ఊరికి పోతే... (విజయనగరం= స్వర్గం) ఈ మార్గాలలో నడిచినంత పుణ్యాత్ములైరి. ఊరే కానీ వూళ్లో జనం లేరు. పుణ్యాత్ములకు స్వర్గంలో చోటు ఉండొచ్చు కానీ మోక్షం పొందిన వారు స్వర్గంలో ఉండరు కదా.
7. జనం లేని ఊళ్ళో- ఉండిరి ముగ్గురు కుమ్మరులు... అలాంటి ఊర్ధ్వ లోకంలో యముడు ఇంద్రుడు కాలుడు( యముడు సమయము) ఉంటారు. ఒక్కడికీ తల లేదు రెండు మొలా లేదు. వారి పని చాలా నిక్కచ్చిగా చేసుకుంటారు. సావకాశంగా, ఆలోచించి చేస్తా అనే తలా లేదు., జీవుడు ప్రాధేయపడడానికి కాళ్లు లేవు.
8. తల మొల లేని కుమ్మర్లు చేసిరి మూడు భాండాలు... అలా కాలుడు, ఇంద్రుడు, యముడు జీవి యొక్క గత జన్మ, ఈ జన్మ, మరుజన్మలను గుర్తిస్తారు. ఒక జీవి సుమారు 40 లక్షల జన్మలను పొందుతుంది అని (🤔చాగంటి - గరికపాటి ప్రవచనాలలో) చెప్పబడింది. ఒకటికి అంచు లేదు రెండు అడుగు లేదు. ప్రస్తుత జన్మ ది ఏ నెంబరో ఎవరికీ అంతుచిక్కదు.
9. అంచు అడుగు లేని భాండాల్లో ఏసిరి మూడు గింజలు... జీవి తాను బతికి ఉండగా చేసిన పాపపుణ్యాలను లెక్కగట్టి సంచితం, ప్రారబ్దం, ఆగామి అనే మూడు ఖాతాలు తెరుస్తారు. ఒకటి ఉడకా ఉడకదూ రెండు మిడకా మిడకదు. పూర్వజన్మ ఫలాలు సంచితము అని, ఈ జన్మ ఫలితాన్ని ప్రారబ్దం అని అంటారు. ఈ రెండు ఎకౌంట్స్ టాలీ చేయగా వచ్చే బ్యాలెన్స్ కర్మ ఫలం ఆగామి- మరుజన్మకు మళ్లింపబడుతుంది.
10. ఉడకని మిడకని మెతుకులు తినుటకు వచ్చిన ముగ్గురు సుట్టాలు... ఆ విధంగా గా ఎకౌంట్లో బ్యాలెన్స్ కర్మఫలాన్ని సున్నా చేసుకొని జన్మరాహిత్యం పొందడానికి జీవుడు సూక్ష్మశరీరం స్థూలశరీరం కారణ శరీరం అనే ముగ్గురు చుట్టాలుగా కలిసి మరల జన్మించి, జన్మవశాత్తు కలిగే గుణాలకు- వికారాలకు లొంగుతూ ఉంటాడు.. ఒకడికి అంగుళ్లేదు రెండు మింగుళ్లేదు. కానీ గత జన్మల వాసనల(ఙ్ఞానం) వలన సూక్ష్మ, కారణ శరీరాలుగా ఉన్న అంతరాత్మ కక్కలేక మింగలేక అన్నట్టుగా మధన పడుతూ చిత్రవధ అనుభవిస్తూ ఉంటుంది.
11. అంగుడు మింగుడు లేని సుట్టాలు తెచ్చిరి మూడు సెల్లలు... జన్మ రాహిత్యానికి లేదా మోక్షానికి మధన పడుతున్న జీవుడి కోసం యోగం, ధ్యానం, సమాధి అనే మూడు సెల్లలు( వస్త్రము, ధరింపదగిన) మహర్షులు ప్రసాదించారు. ఒకటికి సుట్టూ లేదు రెండు మద్దె లేదు. చుట్టు అంటే మొదలుపెట్టిన చోటు నుంచి తిరిగి మళ్ళీ అక్కడికే రావటం. మధ్య అంటే ఒక కేంద్రం లేదా బిందువు ఆధారంగా దానిచుట్టూ రమించడం, అంటే తిరగడం. మరి యోగము ధ్యానములో మొదలు పెట్టిన చోటికే మళ్లీ రాము కదా. అలాగే వీటికి పరిధి(radious) కూడా లేదు. ప్రతి జీవుడు తన కర్మఫలాన్ని అనుసరించి తనంత తానుగా తెలుసుకుంటూ, తనంత తానుగా నేర్చుకుంటూ తనకుతానుగా సాధన చేస్తూ సమాధిస్థితిని చేరుకోగలగాలి. అదే మోక్షం. అంటే మరు జన్మరాహిత్యం.
దీని భావము తెలియురా॥ . దీని భావము తెలిసెరా॥😇😇
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Wow so nice meaning i like that song very much
Thanks to this blogger. Really amazing.
wonderful explanation of the lyric, thanks a ton
నమస్కారం అండి.... అడవి బాపిరాజు గారి హిమబిందుఉంటే అప్లోడ్ చేయగలరా...
How to download pdf
కొంకొండోరి చెరువుల్ కింద
(తత్వమా -అన్యాపదేశ కవిత్వమా ?)
కొంకొండోరి చెరువుల కింద చేసిరి ముగ్గురు వ్యవసాయం
ఒకడికి కాడి లేదు -రెండు దూడ లేదు
కాడి దూడ లేనెగసాయం పండెను మూడు
పంటలొకటి వడ్లు లేవు ..రెండు గడ్డి లేదు.
( మన మెదడు నుండి 3 నాడి వ్యవస్థలు వ్యాపిస్తాయి. ఇడ-పింగళి -సుషుమ్న -
మన మెదడులోని సెరిబ్రల్ ద్రవము చెరువు .
మనకి అగుపడని 2 ఎడ్లు ఉచ్వాస -నిశ్వాస ములు -దాని వలన జరిగే
దున్నుడే జీవ వ్యవసాయం. సదరు నాడీ వ్యవస్థలకు మూలం -- దాని నుండి వడ్లు రావు . గడ్డి రాదు. )
వడ్లూ గడ్డి లేని పంటా విశాఖ పట్నం సంతలో పెడితే ఒట్టి
సంతే కానీ సంతలో జనమూ లేరు . జనం లేని సంత లోకి వచ్చిరి
ముగ్గురు షరాబులు - ఒకడికి కాళ్ళూ లేవు రెండు కళ్ళు లేవు.
(ఆధ్యాత్మికం అనుకుంటూ-ఏ విధమైన వస్తు ఉత్పత్తి లేకుండా చేతులూపు కుంటూ
ఈ సమాజం లోనికి చొరబడితే నీ వంక చూసే జనమూ వుండరు. నీ వ్యవసాయ ఉత్పత్తి
ఇదిగో ఈ మోక్ష సాధనే అని అమ్మ జాపితే కాళ్ళు -కళ్ళు లేని షరాబులు కూడా వస్తారు
నీకు ప్రతిఫలం గ చెల్లని కాసులు వేస్తారు. )
ఈ పాట కి అర్ధం ఒక రకం గా ఆలోచిస్తే--ఆధ్యాత్మికం కన్నా
సామజిక పరం గా ఆలోచిస్తే శ్రమైక జీవనం మంచిది ...
అనే సందేశం కనబడుతోంది . ఆధ్యాత్మిక వ్యవ సాయం చేస్తే
కడుపు నిండదని --కుమ్మరి కుండ కి నిజముగా అంచు -మట్టు ఉండాలని
తినే వాడికి మెతుకులు నిజమైనవి లేకుంటె కేవలం ఇడ -పింగళ -సుషుమ్న
అనే మూడు మెతుకులు సరిపోతాయా అనే సమాజానికి ఒక గొప్ప ప్రశ్న ని
సంధించి కవి వదిలాడని అనిపించింది .
ఈ మాత్రపు విశ్లేషణ నా మనో ఫలకం నుండి ఒక మెరుపు కొసలాగా
భాసించి పోస్ట్ చేస్తున్న. మీకు నచ్చవచ్చు లేదా నచ్చక పోవచ్చు.
--
K Phani Sankar
Post a Comment