Showing posts with label Ramayanam. Show all posts
Showing posts with label Ramayanam. Show all posts

12 September, 2017

తెలుగు రామాయణాలు Telugu Ramayanalu

తెలుగు రామాయణాలు 
Telugu Ramayanalu



తెలుగులో వెలువడిన వివిధ రామాయణాలను అంతర్జాలంలో లభిస్తున్నవాటిని ఒక్కదగ్గర అందించే ప్రయత్నం లో భాగంగా ఈ టపాను మీ ముందుకు తెస్తున్నాం.





  1. రంగనాథరామాయణం
  2. గోపీనాథ రామాయణం (కొత్తగా చేర్చబడింది)
  3. మొల్ల రామాయణం
  4. ఆనంద రామాయణం
  5. ఆంధ్ర వాల్మీకి రామాయణం
  6. శ్రీ జైమినీయ రామాయణం
  7. నిర్వచనరామాయణం
  8. శ్రీ అమృతరామాయణం
  9. రమణియ రామాయణం
  10. ఆధ్యాత్మ రామాయణం
  11. గంగా రామాయణం
  12. శతకరీతి పద్యాంధ్ర సంగ్రహ రామాయణం
  13. గజల్ రామాయణం
  14. తులసి రామాయణం
  15. శ్రీ హనుమద్రామాయణం
  16. శతకంఠ రామాయణం
  17. గౌరీ రామాయణం
  18. చంపూ రామాయణము
  19. రఘురామ రామాయణం
  20. గణపతి రామాయణ సుధ
  21. లల్ల రామాయణం
  22. మల్లెమాల రామాయణం
  23. అద్భుత రామాయణం
  24. మోక్షగుండ రామాయణం

ఇవే కాకుండా  సాయి రియల్ ఆటిట్యూడ్ వారి రామాయణం లంకెలో మరికొంత సమాచారం లభించవచ్చు.

30 March, 2016

రంగనాథ రామాయణము Ranganatha Ramayanamu

రంగనాథ రామాయణము
గోన బుద్ధా రెడ్డి
 Ranganatha Ramayanamu
Gona Buddha Reddy

గోన బుద్ధారెడ్డి రచించిన రంగనాథ రామాయణం తెలుగులో తొలి సంపూర్ణ రామాయణంగా సుప్రఖ్యాతి చెందినది. అంతకుమునుపు తిక్కన వ్రాసిన నిర్వచనోత్తర రామాయణం సంపూర్ణమైన రామాయణంగా చెప్పేందుకు వీలులేని రచన. రంగనాథ రామాయణాన్ని ద్విపద ఛందస్సులో రాశారు. తెలుగులో ద్విపద ఛందస్సును ఉపయోగించి ప్రధానమైన కావ్యాన్ని రచించడంలో పాల్కురికి సోమనాథుని తర్వాత రెండవవారిగా బుద్ధారెడ్డి నిలుస్తున్నారు. మరియు చాల తెలివి గల వ్యక్తి 

06 March, 2016

ఆంధ్రానంద రామాయణం Andhra Ananda Ramayanam

గుండు లక్ష్మణ శాస్త్రి గారిచే వ్రాయబడిన ఈ ఆనంద రామాయణము తెలుగు వారికి మరుగున పడినట్లైనది.ఇదొక అపురూప కావ్యం. సంస్కృతంలోని ఆనందరామాయణానికి ఇది అనువాదమో కాదో తెలీదు. కానీ, రసనిర్భరము. చదివి ఆనందించండి.

07 February, 2016

శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం ( మందరము) Mandaramu Vavikolanu Subba Rao

వావికొలను సుబ్బారావుగారు రచించిన మందరము తెలుగువారికి నిజంగా రామాయణ విషయ విశేష మందారమే. దీనికి వారు శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం అనే పేరు పెట్టినా మందరము గానే ప్రసిద్ధమిది. శ్రీ భక్తి సంజీవని వారు అందించే ప్రయత్నం చేసారు. సాయి రియల్ ఆటిట్యూడ్ వారు కూడా ఆ ప్రయత్నమే చేసారు. ఇప్పటికీ ఇంకా మనం దిగుమతి చేసుకోకుంటే ఎలా? చదువకుంటే ఎలా?


28 November, 2015

శ్రీ రామాయణం సంబంద ప్రవచనాలు,గ్రంధాలు Books,Pravachanams On Ramayanam


      సాయినాధుని కృపతో శ్రీ రామాయణం సంబంద ప్రవచనాలు,గ్రంధాలు,పాటలు,సినిమాలు మా శక్తిమేర సేకరించి ఒకేచోట
చేర్చే ప్రయత్నం చేయటం జరిగింది. ఈ సమాచారం మీ మిత్రులకి,సాధకులకు తెలియచేయగలరని మనవిచేసుకొంటున్నాము.

03 October, 2015

మల్లె మాల రామాయణము Mallemala Ramayanamu

మల్లె మాల రామాయణము
 Mallemala Ramayanamu


ప్రఖ్యాత సినీ నిర్మాత మల్లెమాల సుందర రామిరెడ్డి గారు వ్రాసిన అద్భుత రామాయణకావ్యం ఈ మల్లెమాల రామాయణము. దీనిని తితిదే వారు అందిస్తున్నారు. ఈ రసవత్తర కావ్యాన్ని రామాయణ మాధుర్యాసక్త భృంగములు గ్రోలి ఆనందింతురు గాక!







హర్వా లేదు. మీకు నచ్చి తీరుతుంది. అయినా మీరు వ్యాఖ్య మాత్రం వ్రాయరు. అయినా సరే. మేము మీకు ఇటువంటి అవకాశం కలిగినప్పుడల్ల అందించే ప్రయత్నం చేస్తూనే ఉంటాం....
అందుకే.......
మీకు నచ్చినా సరే ......ఎవరితోనూ పంచుకోకండి.
వ్యాఖ్య అస్సలుకే వ్రాయకండి ....అయినా మీరు దిగుమతి చేసుకోవాలనుకుంటే.....

పై నొక్కండి.



11 March, 2013

రామాయణ కల్పవృక్షం - తెలుగుదనం Ramayana Kalpavruksham - Telugudanam

రామాయణ కల్పవృక్షం - తెలుగుదనం
Ramayana Kalpavruksham - Telugudanam

డా.పాణ్యం శ్రీనివాస్ గారిచే Ph.D పట్టం కొరకు బెంగులూరు విశ్వవిద్యాలయంలో సమర్పించ బడిన సిద్ధాంత వ్యాసం. విశ్వనాథ సత్యనారాయణగారిచే వ్రాయబడిన రామాయణ కల్పవృక్షంపై జరిగిన పరిశోధనల్లో ఇది విశిష్టమైనది. విశ్వనాథవారు కల్పవృక్షంలో తెలుగుదనాన్ని అంటే తెలుగువారి సంస్కృతీ సంప్రదయాలు, వర్ణనల్లో, అలంకారాల్లో,చందస్సులో, భాషలో........ఇలా అన్ని విషయాల్లో తెలుగుదనం ఎలా ఉందో నిరూపించారు.

ఇది విద్యార్థులకు, కవులకు,పండితులకు, భాషా ప్రియులకు, పరిశోధకులకు అత్యంత ఉపయోగకరం. ఈ పుస్తకాలని పి.డి.ఎఫ్ లో దిగుమతి చేసుకుని మీ టాబ్లెట్ పి.సి.లో/మొబైల్ లో/ల్యాప్టాప్ లో వేసుకుని చదుకొని, ఆనందించండి.




మీకు ఈ పుస్తకం నచ్చింది, దిగుమతి చేసుకోవాలి అంటే......

రామాయణ కల్పవృక్షం - తెలుగుదనం



అనుసరించువారు