ఇటీవల నవీకరించిన టపాలు
09 December, 2017
04 December, 2017
సారస్వతవ్యాసములు Sarasvata vyasamulu
సారస్వతవ్యాసములు
Sarasvata vyasamulu
గతంలో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి వారు మహత్తరమైన గ్రంథాలు ప్రచురించారు. అందులో భాగంగా సారస్వతవ్యాసములు అనే వ్యాససంపుటులను పర్చురించారు. ప్రస్తుతం ఇవి మార్కెట్టులో లభించడం లేదు. అంతర్జాలంలో లభిస్తున్నవాటిని అన్నింటిని
(ప్రస్తుతం ఐదుభాగాలు) వీలైనంతవరకు సేకరించి మీ చేతికి అందిచే ప్రయత్నం చేస్తున్నది తెలుగుపరిశోధన.
లేబుళ్లు:
Essay
28 November, 2017
పోతన భాగవతం - సార్థతాత్పర్యం Pothana Bhagavatham (Sateeka)
పోతన భాగవతం - సార్థతాత్పర్యం
Pothana Bhagavatham (Sateeka)
తిరుమల వేంకటేశ్వరస్వామి మరొకసారి తెలుగువారిని కరుణించి తెలుగువారి దోసిళ్ళలో అమృతాన్ని ధారవోశాడు. గతంలో భాగవతాన్నంతా తాత్పర్యంతో అందించి, అంతటితో తృప్తిపడక ఆ స్వామి మనమీదగల అవ్యాజమైన, అపారమైన కరుణతో భాగవతాన్నంతా ప్రతిపదార్థసహిత వ్యాఖ్యానంతో అందించారు.అవును పోతన ఏమడిగాడు? .....
''పద్యంబొక్కటి చెప్పి సార్థముగ తాత్పర్యమ్ము భాషింపుమా !'' - అనికదా?
లేబుళ్లు:
Bhagavatham,
Pothana,
TTD
18 September, 2017
ఆధునిక భాషాశాస్త్ర సిద్ధాంతాలు Adhunika Bhasha Shastra Siddhantalu
ఆధునిక భాషాశాస్త్ర సిద్ధాంతాలు
Adhunika Bhasha Shastra Siddhantalu
Dr.పి.యస్.సుబ్రహ్మణ్యం Dr.P.S.Subrahmanyam
Dr.పి.యస్.సుబ్రహ్మణ్యం జగమెరిగిన భాషాశాస్త్రపండితులు. వారు తెలుగులో అందించిన రెండు అపురూపగ్రంథాలు -
- ఆధునిక భాషాశాస్త్ర సిద్ధాంతాలు
- ద్రావిడభాషలు
ఇందులో మొదటి గ్రంథాన్ని మేము మీకు అందిస్తున్నాము. రెండవపుస్తకం అంతర్జాలంలో లభించడం లేదు.
అన్నట్టు, ఈ రెండుపుస్తకాలను తెలుగువిశ్వవిద్యాలయంవారు ముద్రించి అమ్ముతున్నారు. మీరూ ఒకప్రతి కొని పెట్టుకొండి. లేదంటే, అవి దొరకనప్పుడు బాధ పడతారు.
ఈ పుస్తకాలను తెలుగు భాషాసాహిత్యాభిమానులు,భాషాశాస్త్రాభిమానులు,విద్యార్థులు, పోటీ పరీక్షల్లో పాల్గొనేవారు, ఉపాధ్యాయులు..... ఒకమాటలో చెప్పాలంటే, ప్రతి యింట ఉండదగిన అపురూప గ్రంథాలు. ఇప్పుడుమీకు 'ఆధునిక భాషాశాస్త్ర సిద్ధాంతాలు' గ్రంథాన్ని అందిస్తున్నాము.
సూచనః
తెలుగులో ఎన్నో గ్రంథాలను అందిస్తూ సేవ చేస్తున్న ఉచితగురుకులవిద్య వారి ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్ ని దిగుమతి చేసుకొని, పుస్తకాలను చదువుకోండి. లంకె -
లేబుళ్లు:
Language,
Linguistics,
Reference Book,
Telugu
12 September, 2017
తెలుగు రామాయణాలు Telugu Ramayanalu
తెలుగు రామాయణాలు
Telugu Ramayanalu
- రంగనాథరామాయణం
- గోపీనాథ రామాయణం (కొత్తగా చేర్చబడింది)
- మొల్ల రామాయణం
- ఆనంద రామాయణం
- ఆంధ్ర వాల్మీకి రామాయణం
- శ్రీ జైమినీయ రామాయణం
- నిర్వచనరామాయణం
- శ్రీ అమృతరామాయణం
- రమణియ రామాయణం
- ఆధ్యాత్మ రామాయణం
- గంగా రామాయణం
- శతకరీతి పద్యాంధ్ర సంగ్రహ రామాయణం
- గజల్ రామాయణం
- తులసి రామాయణం
- శ్రీ హనుమద్రామాయణం
- శతకంఠ రామాయణం
- గౌరీ రామాయణం
- చంపూ రామాయణము
- రఘురామ రామాయణం
- గణపతి రామాయణ సుధ
- లల్ల రామాయణం
- మల్లెమాల రామాయణం
- అద్భుత రామాయణం
- మోక్షగుండ రామాయణం
ఇవే కాకుండా సాయి రియల్ ఆటిట్యూడ్ వారి రామాయణం లంకెలో మరికొంత సమాచారం లభించవచ్చు.
లేబుళ్లు:
Ramayanam
10 July, 2017
తిరుపతి వేంకటకవుల రచనలు Tirupathi Venkata kavula rachanalu
తిరుపతి వేంకటకవుల రచనలు
Tirupathi Venkata kavula rachanalu
జంటకవులుగా చెళ్ళపిళ్ల వేంకటశాస్త్రిగారు, దివాకర్ల తిరుపతి శాస్త్రిగారు ఆంధ్రదేశమంతా తిరిగి వెలువరించిన తమ కవితా సుగంధాలను నేటికీ ......
"బావా ఎప్పుడు వచ్చితీవు?"
" జెండాపై కపిరాజు "
అంటూనో తెలుగువారందరూ నేటికీ ఆస్వాదిస్తూనే ఉన్నారు.
అటువంటి తిరుపతి వేంకటకవుల రచనలు తెలుగువారందరికీ దొరికినంతవరకు పంచుకోవాలనే ప్రయత్నం తెలుగుపరిశోధన చేస్తుంది. గతంలో
శతావధానసారము ప్రకటించాము. ఇప్పుడు ........
శతావధానసారము ప్రకటించాము. ఇప్పుడు ........
- పాండవ జననము (1901-1917)
- పాండవ ప్రవాసము
- పాండవ రాజసూయము
- పాండవ ఉద్యోగము
- పాండవ విజయము
- పాండవ అశ్వమేధము
- అనర్ఘ నారదము
- దంభ వామనము
- సుకన్య
- ప్రభావతీ ప్రద్యుమ్నము (1920-1922)
అనేవి ఒకే సంపుటంలో కలిగిన
5. కథలూ గాథలూ
6. ప్రబంధాలు
( ఇందులో
6. ప్రబంధాలు
( ఇందులో
- శ్రవణానందము (1893-1897; 1897-1898)
- పాణిగృహీత
- లక్షణా పరిణయము (1897-1901)- లక్షణతో శ్రీకృష్ణుని వివాహాన్ని గురించిన భాగవత గాథ.
- ఏలా మహాత్మ్యము (1898-1900) ఏలా నది గురించి.
- బొబ్బిలి పట్టాభిషేకం (కావ్యము) (1929) బొబ్బిలి మహారాజు పట్టాభిషేక సందర్భంగా.
- బుద్ధచరిత్ర
- శ్రీనివాసవిలాసము
అనే ప్రబంధాలున్నాయి.)
లేబుళ్లు:
Tirupati Venkata Kavulu
దాసోజు జ్ఞానేశ్వర్ రచనలు Dasoju Gyaneshwar Rachanalu
దాసోజు జ్ఞానేశ్వర్ రచనలు
Dasoju Gyaneshwar Rachanalu
దాసోజు జ్ఞానేశ్వర్ గారు తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో తెలుగు పండితులుగా ఉద్యోగబాధ్యతలు నిర్వహిస్తూ కవితావ్యవసాయం చేస్తున్నారు. వారు రాసిన శ్రీదళంలో నల్గొండ జిల్లాలోని ప్రజల కష్టాలు అద్భుతంగా ఆవిష్కరించారు. అందులో ఆయన ........
"శివుడిని పార్వతి హాలాహలాన్ని మింగడానికి అనుమతించిది ఎందుకో తెలుసా?" అని ప్రశ్నించి సమాధానం ఆయనే చెబుతారు -
"అందులో ఎల్లాగూ ఫ్లోరైడ్ అయితే లేదు, అయితే మరేం ఫర్లేదు" అని అట.
ఈ మాటల్లో నల్గొండజిల్లా ప్రజలు ఫ్లోరైడ్ తో ఎంతగా బాధ పడుతున్నారో వ్యంజింపజేసారు.
వారు రాసిన కవితాసంపుటాలను తెలుగుప్రజలకు అందరికీ అందించాలని తెలుగుపరిశోధన ప్రయత్నం చేస్తున్నది.
వాటిని దిగుమతి చేసుకోవాలంటే........
2. రణగీతం
లేబుళ్లు:
Dasoju,
Gyaneshwar,
Modern Literature
28 March, 2017
కూచిమంచి తిమ్మకవి రచనలు Kuchimanchi Timmakavi Rachanalu
కూచిమంచి తిమ్మకవి రచనలు
Kuchimanchi Timmakavi Rachanalu
కూచిమంచి తిమ్మకవి 18వ శతాబ్దపు తెలుగు కవి. తిమ్మకవి పదిహేడవ శతాబ్దపు నాలుగవ భాగంలో జన్మించి, పద్దెనిమిదవ శతాబ్దపు మూడవభాగం వరకు జీవించి ఉండేవాడని విమర్శకులు, చారిత్రకులు చెప్తున్నారు.
ఈయన రచనలు -
రచనలు కొన్ని లభిస్తున్నాయి, చదవండి........
- అచ్చతెలుగు రామాయణము
- సీతామనోహరం
- రుక్మిణీ పరిణయము (1715)
- సింహాచల మహాత్మ్యము (1719)
- నీలాసుందరీ పరిణయము
- సారంగధర చరిత్ర
- రాజశేఖర విలాసము (1705)
- రసికజన మనోభిరామము (1750)
- సర్వలక్షణసార సంగ్రహము (1740)
- సర్పపురీ మహాత్మ్యము (1754)
- శివలీలా విలాసము (1756)
- కుక్కుటేశ్వర శతకము
- శ్రీ భర్గ శతకము (1729)
- భర్గీ శతకము
- చిరవిభవ శతకము
లేబుళ్లు:
Kuchimanchi,
Telugu Classic literature
Subscribe to:
Posts (Atom)