Showing posts with label Telugu Classic literature. Show all posts
Showing posts with label Telugu Classic literature. Show all posts

03 May, 2020

తెలుగు ప్రబంధాలు Telugu Prabandhas




ప్రబంధం అనేది  తెలుగువారి పుణ్యాల పరిపాకం. అది మన సృష్టి. మన ప్రత్యేకత. తెలుగు ప్రబంధాలను చదివించాలని గతంలో ఎమెస్కో వారు ప్రబంధాలన్నిటినీ చిన్నసైజులో పుస్తకాలుగా వేయించారు.

తెలుగుపరిశోధన తన సభ్యకుటుంబంకోసం తెలుగుప్రబంధాలన్నిటినీ దొరికినంతవరకు ఒక్కదగ్గర చేర్చి అందించాలనుకుంది.


  1. ఆముక్తమాల్యద - సవ్యాఖ్యానం
  2. కళాపూర్ణోదయం  (కళాపూర్ణోదయం కథ ఈమాటలో)
  3. పారిజాతాపహరణము
  4. ప్రభావతీ ప్రద్యుమ్నము - సవ్యాఖ్య
  5. మను చరిత్ర - సవ్యాఖ్య
  6. రాధికా సాంత్వనము
  7. రాఘవపాండవీయము - సవ్యాఖ్య
  8. వసు చరిత్ర - సవ్యాఖ్య
  9. విజయ విలాసము - తాపీ ధర్మారావు వ్యాఖ్య
  10. వైజయంతీ విలాసము
  11. సమీర కుమార విజయము
  12. శ్రీ కాళహస్తి మాహాత్మ్యము (లఘు టీకా సహితం)
  13. పాండురంగ మహాత్మ్యం , వావిళ్ళ వారిది 
  14. తాలాంకనందినీ పరిణయం 




ఈ టపాలో అప్పుడు కొత్త కొత్త పుస్తకాలు చేర్చే అవకాశం ఉంది కాబట్టి  దీనిపై అప్పుడప్పుడు ఒక కన్నేసి ఉంచండి ....



ఈ టపాపై మీ వ్యాఖ్య తప్పక రాస్తారు కదూ? మీ వ్యాఖ్యలే మాకు మంచి ప్రోత్సాహకాలు. ఈ టపాను మీ సాంఘికసంపర్కజాలంలో పంచుకొండి. ఇంకొందరికీ ఈ టపా ఉపయోగ పడుతుంది, మీరూ వారికి మేలు చేసినవారవుతారు. మీ రా పని చేస్తారనే నమ్మకంతో ముందుగానే ధన్యవాదాలు.

02 May, 2020

తాలాంక నందినీ పరిణయం Talankanandini Parinayam





దీనిని క్రీ.శ. 1780 ప్రాంతంలో వున్న ఆసూరి మరింగంటి వేంకట నరసింహాచార్య కవి రచించినాడు. నల్లగొండ జిల్లా అహల్యా మండలానికి చెందిన అనుముల ఈయన నివాస గ్రామం. కవి తన రచనల్లో షోడశ మహాగ్రంథ బంధురాలంకార నిర్మాణ ధురీణుడను అని తెల్పుకున్న ఈయన కృతుల్లో దాదాపు 10 గ్రంథాలు లభిస్తున్నవి. మిగతావి నామమాత్రావశేషాలు. దొరికిన వాటిలో 5 గ్రంథాలు ముద్రణమైనాయి.


08 April, 2020

శ్రీనాథ కవిసార్వభౌముడు - రచనలు Srinatha Kavi Sarvabhaumuni Rachanalu

శ్రీనాథ కవిసార్వభౌముడు - రచనలు 
 Srinatha Kavi Sarvabhaumuni Rachanalu

శ్రీకారంతోనే తెలుగు సాహిత్య ఆరంభం. తెలుగు సాహిత్య సముద్రంలో శ్రీనాథ మహా కవి ఉవ్వెత్తుత్తున ఎగిసిపడిన తరంగం. శ్రీనాథుని చదవడం జీవితానికి ఒక తృప్తి. 

07 April, 2020

తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర - ముదిగంటి సుజాతా రెడ్డి Telangana Telugu Sahitya Charitra - Mudiganti Sujata Reddy

తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర - ముదిగంటి సుజాతా రెడ్డి Telangana Telugu Sahitya Charitra - Mudiganti Sujata Reddy




   తెలంగాణ ఉద్యమం తర్వాత తెలంగాణ అస్తిత్వ భావనతో తమ భాషా, సాహిత్య, సాంస్కృతిక,చరిత్రలపైన ఇక్కడి పండితులు ప్రత్యేక శ్రద్ధ చూపెట్టారు. అందులో భాగంగా తెలంగాణ సాహిత్య చరిత్రను విద్యార్థులకు ఉపయోగపడేవిధంగా తీర్చిదిద్దారు ముదిగంటి సుజాతా రెడ్డిగారు. 

12 January, 2020

సాహిత్య పదకోశము Sahithya pada koshamu


సాహిత్య పదకోశము
 Sahithya pada koshamu



న్నో ఏళ్ళక్రితం ప్రచురితమైన పుస్తకం ఇది. సాహిత్య విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ విధమైన సాహిత్యపదకోశాలు హిందిలో ఉన్నా తెలుగులో లేదనే లోటు లేకుండా తెలుగుఅకాడమీ వారు ప్రచురించారు చాలానాళ్ళక్రితం. అదృష్టవశాత్తు నాకు ఈ మధ్య తారసపడింది. ఈ పుస్తకంకోసం ఎన్నాళ్లనుండో తాపత్రయపడుతున్నాను. కానీ, దొరకడం లేదు. నేను గతంలో కొనుక్కున్న మూడు ప్రతులూ సాహితీపిపాసుకులైన మిత్రులెవరికో ఇచ్చాను. ఏమయితేనేం ఈ విధంగానైనా మనకు లభించేట్టు చేసిన ఆ అజ్ఞాత'ఈ'పుస్తకదాతకు శతకోటి నమస్కారాలు.

ఈ పుసకంలో సాహిత్య,నాటక,అలంకార విభాగాల్లో సాహిత్యశాస్త్ర పారిభాషికపదాలన్నీ అకారాదిక్రమంలో ఉన్నాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు .... ఈ పుస్తకాన్ని పొంది, ఆనందించాలని మా కోరిక.




దిగుమతి కొరకు లంకె .......



- పై నొక్కండి.








ఈ టపాను మీ సాంఘికసంపర్కజాలంలో పంచుకొండి. ఇంకొందరికీ ఈ టపా ఉపయోగ పడుతుంది, మీరూ వారికి మేలు చేసినవారవుతారు. మీ రా పని చేస్తారనే నమ్మకంతో ముందుగానే ధన్యవాదాలు.

20 October, 2018

పాండురంగ మాహాత్మ్యం - పామర వ్యాఖ్యా సహితం Panduranga Mahathmyam - Pamara vyakhya


పాండురంగ మాహాత్మ్యం - పామర వ్యాఖ్య Panduranga Mahathmyamu - Pamara vyakhya


పాండురంగ మాహాత్మ్యం-పామర వ్యాఖ్య



తెలుగు సాహిత్యంతో ఏ కొంచెం పరిచయం ఉన్నవారయినా తెనాలి రామకృష్ణ కవి గూర్చి వినక ఉండరు. ఆయన రాసిన పాండురంగ మాహాత్మ్యం కూడా ప్రసిద్ధమే. అది ప్రౌఢ ప్రబంధం.  గతంలో ఈ గ్రంథాన్ని బులుసు వేంకటరమణయ్యగారి టీకతో తెలుగుపరిశోధన మీకు అందించింది. ఇక ఇప్పుడు 'పామర' వ్యాఖ్యతో మీకు అందించే అవకాశం కల్పించినవారు రసజ్ఞభారతి వ్యవస్థాపకులు ఆచార్య ఆర్.వి.కుమార్ గారు. వారికి సహస్రానేక కృతజ్ఞతాభివందనాలు.

ఈ 'పామర' వ్యాఖ్యను మనకొరకు అందించినవారు డా.దేవగుప్తాపు సూర్య గణపతి రావు గారు. వారు వృత్తిరీత్యా సామాన్యులకు దురవగాహమైన ఎన్నో విషయాలను పరిశీలించి లోకసామాన్యానికి అర్థమయ్యేతీరులో వ్యాఖ్యానించి చెప్పే రేడియాలజిష్టు. వారు తమ ఆ తృతీయనేత్రాన్ని  సాహిత్యంలో కూడా పారించారు. ఇంకేం సామాన్యులకు పాండురంగ మహాత్మ్యం అర్థం కావడం కష్టం. దాన్ని కూడా పరిశీలించి, మనకు  వ్యాఖ్యానించి అందించారు.  అదీ అందరికీ ఉచితంగా అందించాలనే సత్సంకల్పంతో .... 

ఈ రసజ్ఞభారతి గూర్చి, వ్యాఖ్యా రచయితగూర్చి, వారి మిత్రబృందంగూర్చి అన్ని విషయాలను ఆ పుస్తకంలోనే చదువండి. 

మరింకేం ఆలస్యం .......


పాండురంగ మాహాత్మ్యం-పామరవ్యాఖ్య by Dr.Pandu Ranga Sharma Ramaka on Scribd




ఈ పుస్తకాన్ని దిగుమతి చేసుకోవాలనుకుంటే .......


పై నొక్కండి.

ఈ టపాను మీ సాంఘికసంపర్కజాలంలో పంచుకొండి. ఇంకొందరికీ ఈ టపా ఉపయోగ పడుతుంది, మీరూ వారికి మేలు చేసినవారవుతారు. మీ రా పని చేస్తారనే నమ్మకంతో ముందుగానే ధన్యవాదాలు.

16 June, 2018

తెలుగులో చిత్రకవిత్వం TelugulO Chitra kavitvam

తెలుగులో చిత్రకవిత్వం 
TelugulO Chitra kavitvam 
గాదె ధర్మేశ్వర రావు Gade Dharmeswara Rao

తెలుగులో చతుర్విధ కవిత్వాల్లో  చిత్రకవిత్వం ఒకటి. ఇది నన్నె చోడుని కాలంనుండే తెలుగులో ఉన్నా, సంస్కృతంనుండి మనకు వచ్చిందని చెప్పడానికి సందేహం లేదు. ఎందరో కవులు చిత్రకవిత్వంలో పరిశ్రమ చేసారు

07 June, 2018

వసుచరిత్రము (సవ్యాఖ్యానం) Vasucharitramu (Savyakhya)

వసుచరిత్రము (సవ్యాఖ్యానం) 
Vasucharitramu (Savyakhya)
రామరాజ భూషణుడు Ramaraja Bhushanudu

ప్రబంధయుగములో వెలువడిన అత్యుత్తమసాహిత్యంలో రామరాజకృత వసుచరిత్రము ప్రముఖము. ఈ ప్రబంధం ప్రౌఢము. వ్యాఖ్యానరహితంగా అర్థమయ్యేది కాదు.

09 December, 2017

పద్మపురాణం Padmapuranam

పద్మపురాణం-
 Padmapuranam 



28 March, 2017

కూచిమంచి తిమ్మకవి రచనలు Kuchimanchi Timmakavi Rachanalu

కూచిమంచి తిమ్మకవి రచనలు 
Kuchimanchi Timmakavi Rachanalu


       కూచిమంచి తిమ్మకవి 18వ శతాబ్దపు తెలుగు కవి. తిమ్మకవి పదిహేడవ శతాబ్దపు నాలుగవ భాగంలో జన్మించి, పద్దెనిమిదవ శతాబ్దపు మూడవభాగం వరకు జీవించి ఉండేవాడని విమర్శకులు, చారిత్రకులు చెప్తున్నారు.

ఈయన రచనలు  -

రచనలు కొన్ని లభిస్తున్నాయి, చదవండి........

  1. అచ్చతెలుగు రామాయణము
  2. సీతామనోహరం
  3. రుక్మిణీ పరిణయము (1715)
  4. సింహాచల మహాత్మ్యము (1719)
  5. నీలాసుందరీ పరిణయము
  6. సారంగధర చరిత్ర
  7. రాజశేఖర విలాసము (1705)
  8. రసికజన మనోభిరామము (1750)
  9. సర్వలక్షణసార సంగ్రహము (1740)
  10. సర్పపురీ మహాత్మ్యము (1754)
  11. శివలీలా విలాసము (1756)
  12. కుక్కుటేశ్వర శతకము
  13. శ్రీ భర్గ శతకము (1729)
  14. భర్గీ శతకము
  15. చిరవిభవ శతకము

03 May, 2016

జమ్మలమడుగు మాధవరామశర్మ రచనలు Writings of Jammalamadugu Madhava Rama Sharma

జమ్మలమడుగు మాధవరామశర్మ రచనలు 
Writings of Jammalamadugu Madhava Rama Sharma

సుప్రసిద్ధ పండితులు, ఎందరో కవిపండితులను తెలుగువారికందించిన గురువరేణ్యులు జమ్మలమడుగు మాధవరామశర్మగారు.

02 May, 2016

విష్ణుమాయా విలాసము Vishnu maya Vilasamu of Kankanti Papi Raju

విష్ణుమాయా విలాసము   
 Vishnu maya Vilasamu of  Kankanti Papi Raju



గతంలో తెలుగు పరిశోధన కంకంటి పాపరాజు రచించిన ఉత్తరరామాయణాన్ని ప్రకటించింది. ఇక ఇప్పుడు అతని మరొక కృతి విష్ణుమాయావిలాసము ను కూడా ప్రకటించి, కవి ఋణాన్ని, భాషా సాహిత్య ఋణాన్ని తీర్చుకునే ప్రయత్నం చేస్తుంది మీ తెలుగు పరిశోధన.

22 April, 2016

వేదము వేంకటరాయ శాస్త్రి రచనలు Writings of Vedam Venkata Raya Shastri

వేదము వేంకటరాయ శాస్త్రి రచనలు 
Writings of Vedam Venkata Raya Shastri


సుప్రసిద్ధ పండితులు వేదం వేంకటరాయ శాస్త్రి గారి రచనలను డిజిటల్ లైబ్రరి ఆఫ్ ఇండియా లో లభిస్తున్న వానిని మీ ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నది తెలుగుపరిశోధన. పుస్తకాలను దిగుమతి చేసుకొని, చదివి ఆనందించండి.

15 April, 2016

దాశరథి రంగాచార్యుల రచనలు Dasharathi Ranga Acharya Rachanalu

దాశరథి రంగాచార్యుల రచనలు 
Dasharathi Ranga Acharya Rachanalu





దాశరథి రంగాచార్యుల రచనలను అంతర్జాలంలో లభించిన వాటిని ఒక్కదగ్గర చేర్చి, మీ ముందుకు తెస్తుంది తెలుగు పరిశోధన. ఆయా పుస్తకాలను దిగుమతి చేసుకొని, చదివి ఆనందించండి.

03 April, 2016

తిక్కన భారతము రస పోషణము Tikkana Bharatamu Rasa Poshanamu

తిక్కన భారతము రస పోషణము 
Tikkana Bharatamu Rasa Poshanamu
డా.ఆండ్ర కమలా దేవి Dr.Andra Kamala Devi

డా.ఆండ్ర కమలాదేవి గారు ఆంధ్ర విశ్వ విద్యాలయం నుండి Ph.D. పట్టం పొందడం కొరకు సమర్పించిన సిద్ధాంత గ్రంథమిది.

30 March, 2016

రంగనాథ రామాయణము Ranganatha Ramayanamu

రంగనాథ రామాయణము
గోన బుద్ధా రెడ్డి
 Ranganatha Ramayanamu
Gona Buddha Reddy

గోన బుద్ధారెడ్డి రచించిన రంగనాథ రామాయణం తెలుగులో తొలి సంపూర్ణ రామాయణంగా సుప్రఖ్యాతి చెందినది. అంతకుమునుపు తిక్కన వ్రాసిన నిర్వచనోత్తర రామాయణం సంపూర్ణమైన రామాయణంగా చెప్పేందుకు వీలులేని రచన. రంగనాథ రామాయణాన్ని ద్విపద ఛందస్సులో రాశారు. తెలుగులో ద్విపద ఛందస్సును ఉపయోగించి ప్రధానమైన కావ్యాన్ని రచించడంలో పాల్కురికి సోమనాథుని తర్వాత రెండవవారిగా బుద్ధారెడ్డి నిలుస్తున్నారు. మరియు చాల తెలివి గల వ్యక్తి 

16 March, 2016

సన్నిధానం వారి రచనలు Sannidhanam Rachanalu

సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రి గారి గ్రంథాలను అంతర్జాలంలో లభించిన వాటినన్నింటిని ఒక్కచోట చేర్చి అందించాలనే సంకల్పంతో చేసిన ప్రయత్నమే ఈ సన్నిధానం వారి రచనలు. ప్రస్తుతం లభిస్తున్నవాటిని ప్రకటిస్తున్నాం. ఇంకా ఏవైనా పుస్తకాల లంకెలను ఎవరైనా అందిస్తే వాటినీ అందిస్తాం.

07 February, 2016

శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం ( మందరము) Mandaramu Vavikolanu Subba Rao

వావికొలను సుబ్బారావుగారు రచించిన మందరము తెలుగువారికి నిజంగా రామాయణ విషయ విశేష మందారమే. దీనికి వారు శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం అనే పేరు పెట్టినా మందరము గానే ప్రసిద్ధమిది. శ్రీ భక్తి సంజీవని వారు అందించే ప్రయత్నం చేసారు. సాయి రియల్ ఆటిట్యూడ్ వారు కూడా ఆ ప్రయత్నమే చేసారు. ఇప్పటికీ ఇంకా మనం దిగుమతి చేసుకోకుంటే ఎలా? చదువకుంటే ఎలా?


06 February, 2016

పోతన చరిత్రము(వానమామలై వరదాచార్యులు) Potana Charitramu (Vanamamalai Varada acharyulu)

వానమామలై వరదాచార్యులు గారు రచించిన పోతన చరిత్రము అనే అద్భుత గ్రంథాన్ని మీకు అందించే భాగ్యాన్ని తెలుగు పరిశోధన పొందింది.


14 January, 2016

మనుచరిత్ర (సవ్యాఖ్యానము) Manu Charitra

అల్లసాని పెద్దన రచించిన మనుచరిత్ర తెలుగులో వెలువడిన మొట్టమొదటి ప్రబంధము. ఈ రచనతోటే అల్లసానివానికి ఆంధ్రకవితాపితామహుడనే పేరు వచ్చింది. ఈ పుస్తకాన్ని సవ్యాఖ్యానంగా మీకు అందించడం తెలుగు పరిశోధన కు సంతోషం.

అనుసరించువారు